ఆ రోజు లాయర్ వామనరావు బాబ్జి ఇంటికి వచ్చాడు . “ బాబ్జి ఎవరండి ? “ “నేనే “ “ నేను భానుమతి బాబయ్య గారి విల్లు అమలు చేయడానికి వచ్చాను “ “ రండి , లాయర్ గారు , ఏమి తీసుకుంటారు , టీ కాఫీ బూస్ట్ “ ఉత్సాహంగా చెప్పాడు బాబ్జి “ కొద్ది కాఫీ తీసుకురా “ అన్నాడు వామనరావు . బాబ్జి చిన్న ట్రే లో కాఫీ తీసుకు వచ్చాడు . “ ఇక్కడ ఇల్లాలు తీసుకు రాదా , కాఫీ “ అడిగాడు వామనరావు . “ అంటే తను అత్తారింటికి దారేది సీరియల్ చూస్తోంది ! ఆ సమయం లో ఎవరు వచ్చిన పట్టించుకోదన్న మాట , అది విషయం “ అన్నాడు బాబ్జి “ సరే , ఇక్కడే ఉండండి “ అని వామన రావు కారు దగ్గర కి వెళ్లి , “ ఎవరైనా ఉంటే ఇలా రండి అన్నాడు “ బాబ్జి ఇంట్లో పనిచేసే కుర్రాడు వచ్చాడు . కారు లో ఉన్న బాక్స్ చూపించాడు “ బాబు ఈ పెద్ద బాక్స్ లోపల పెట్టు “ . ఆ పెట్టె ఆరు అడుగుల పొడుగు ఉంది . బరువు గా ఉన్న బాక్స్ ని హాల్ లో పెట్టాడు . దానిని చూడ గానే “ ఇందులో బహుశా బంగారం , వజ్రాలు ఉన్నాయేమో “ అని ఇంత కళ్ళు పెట్టి చూస్తున్నాడు బాబ్జి . వామనరావు బాక్స్ ని తెరిచాడు . అందులో పెద్ద పొడుగైన “ విల్లు “ ఉంది . దాన్ని బయటికి తీసి “ బాబు బాబ్జి , మీ పిన మామ గారు నీకు రాసిన విల్లు ఇదే . దీని తో నాలుగు బాణాలు ఉచితం .” దాన్ని చూడగానే బాబ్జి స్పృహ తప్పాడు . “ ఇంకో విషయం బాబు , పిన మామ గారు చిన్న కాగితం రాసారు . చదివి వినిపిస్తాను . “ గురి తప్పకుండా బాణం వేస్తె లక్ష్యం చేరుతుంది . ఈ విల్లు నాకు నాటకాల లో ఉపయోగపడింది .రాముడి పాత్ర వేసి నప్పుడు , అర్జునుడి పాత్ర వేసినప్పుడు. ఈ విల్లు ఎవరు వాడినా వాళ్ళు జీవితం లో లక్ష్యం సాధిస్తారు “ బాబ్జి అది విని మళ్ళి స్పృహ తప్పాడు . అక్కడి కి వచ్చిన భానుమతి “ ఇప్పడు నాకు వంట ఎవరు చేస్తారు ?” అంది . “ఆ !” అని ఆశ్చర్య పోయి , “ బాబు జాగ్రత్త గా వంట చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి “ అని వెళ్ళిపోతుండగా అని వామన రావు ని అడిగాడు “ విడాకులు తీసుకోవడం ఎలా అని “ “ఆశ పడు నెరవేరుతుంది . దురాశ కి పోకు , ఈ సారి వచ్చినప్పుడు భానుమతి చేతి కాఫీ తాగాలనుకుంటున్న” అన్నాడు వామన రావు కారు ఎక్కుతూ “ అదే మరి పగటి కలలంటే “ అని తలుపు వేసుకున్నాడు బాబ్జి . **********