అమరావతి నగర సమీపంలోని అడవిలో జంతువులన్ని నీటికొరకు ఎగువ ప్రాంతానికి నడవసాగాయి.కొంతదూరం ప్రయాణం చేసిన అనంతరం ''ఏనుగుతాతా మాఅందరిలో నువ్వు పెద్దవాడి అనుభవశాలివి.ప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా నీతికథ చెప్పు''అన్నాడు గుర్రంమామ.జంతువులు అన్నింటిని మర్రిచెట్టుకింద సమావేశపరచి''మీఅందరికి ఈరోజు సామెతలతో కూడిన కథ చెపుతున్నాను వినండి.ఒకవనంలో వర్షంకురవడంతో అక్కడి మోక్కలు, చెట్లు, అన్ని ఆనందంతొ పరవశిస్తు మాట్లాడిసాగాయి."ఇల్లు అలకగానే పండగ అవుతుందా!"నేనులేకుండావంటఅవుతుందా!''అంది కరివేపాకు చెట్టు.
''అలాగా ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు కూరవడ్డించగానే నిన్ను ఏరి పక్కనపెడతారు. గాలిలో మేడలుకట్టినట్లు గొప్పలు చెప్పక. నేను లేనిదేభోజనమే చేయలేరు'' అన్నది అరటి ఆకు.
''అందుకే భోజనం చేసిన వెంటనే నిన్ను కుప్పలోవేస్తారు.
కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. శంఖంలో పోస్తేగాని తీర్థంకాదు"అని భోజనం అనంతరం నన్ను తింటే గాని పంక్తి భోజంనం పూర్తికాదు''అంది తమలపాకు.
''అందుకేనిన్ను కసామిసా నమిలి తుపుక్కున ఉమ్ముతారు. "పిల్లకాకిఏమితెలుసు ఉండేలు దెబ్బఅని" నావిలువ మీకు తెలియదు తోరణంగా నేను లేనిదే ఏశుభకార్యం జరగదు తెలుసా?'' అందిమామిడి ఆకు.
"తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట. అలాఉన్నాయి మీమాటలు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నట్టు చెట్లలో నాస్ధానం ప్రత్యేకమైనది మండే ఎండల్లోనూ, ఆయుర్వేదంలోనూ నాకునేనే సాటి'అంది వేపచెట్టు.
"నీలాంటివాడే కిందపడినా నాదే పైచేయి అన్నాడట.కాకులు గూడుకట్టుకోవడానికే నువ్వు పనికి వస్తావు."మంత్రాలకు చింతకాయలు రాల్తాయా!"అయినా నాకంటే ఆరోగ్యప్రదాయని ఎవరున్నారు' అంది ద్రాక్షగుత్తి.
"సరేలే అందని ద్రాక్షపుల్లన అనే సామెత ఊరికే రాలేదు.
అలానే పూవ్వుల వాసన దారానికి అబ్బినట్లు జగమంతా నాపరిమళం మెచ్చుతారు పూజలో ప్రధమ స్ధానం నాదే అంది మల్లెమోక్క". "తెల్లవారకముందే తీసి వీధిలోకి విసురుతారు.నీదేంగొప్ప.
చాదస్తపోడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు ,మబ్బుల్లో నీళ్ళుచూసి ముంత ఒలక పోసుకున్నట్లు ఉందినీకథ. మానవాళి నేనే అమృతాన్ని''అన్నదీ మామిడిపండు.
"తమ్ముళ్ళు పెద్దల మాట చద్ది మూట అనిగమనించండి.
కలసిఉంటేకలదుసుఖం అని మనందరం గొప్పవాళ్ళమే మానవాళిశ్రేయస్సుకే జన్మించాము.మన విలువ గుర్తించని మనిషి మనల్ని కొట్టివేస్తూ పర్యావరణం సమతుల్యతను దెబ్బ తీస్తున్నాడు. తాతీసినగోతిలో తనే పడతాడు మనఅందరి లో పూజలు అందుకునే తులసి మొక్కచాలా గొప్పది.గోరంతదీపం కొండంతవెలుగు అని అందుకే అంటారు''అన్నాడు మర్రిచెట్టు.
"కాళ్ళులేవు కథకు చెవులు లేవు ముంతకు"పదండి'అంది పిల్లరామచిలు.
"కథకు కాళ్ళులేవు ముంతకు చెవులు లేవు"అని మాబిడ్డచెప్పింది'అంది తల్లిరామచిలుక.జంతువులు అన్ని తమ ప్రయాణం సాగించాయి.