కర్మ ఫలం - అవ్వారి హేమంత్

Karmafalam

కర్మ– కర్మఫలం గురించి ఒక గురువు తన శిష్యునికి రామాయణ- భాగవతాల్లోని పాత్రల ఉదాహరణలతో చెప్తున్నాడు.

గురువు: కర్మ అంటే ఏమిటి అనేది తెలుసా నాయనా!

శిష్యుడు: పితృ కర్మలు, చెడుజరిగితే ‘కర్మ ..కర్మ ‘ ఆని అనుకుంటాము ..అదేనా గురువుగారు!

గురువు: కాదు నాయనా! చేసే ప్రతీపనీ కర్మే( actions) . దానికి ఫలితం(result) ప్రతిగా( in reverse /opposite way ) తగిన సమానరూపంలో (similarly) ఏమైనా ,ఏదైనా రావచ్చు,జరగచ్చు

.శిష్యడు: మరి ఆ ఫలాన్నెలా తెలుసుకోవడం గురువుగారూ?

గురువు: ఫలం అనేది వర్తమానం యొక్క భవిషత్తు నాయనా! కాబట్టి తెలుసుకోవడం కాదుకదా,అందుగూర్చి ఆలోచన కూడా అనవసరం. ఆలోచన పరిమితి దాటితే ఆందోళనకి దారి తీస్తుంది.

శిష్యుడు: మరి అలా మనిషిపై మాత్రమే కర్మ ప్రభావం చూపిస్తుందా గురువుగారు? అలా అయితే దేవుడు ఎందుకు ఇంత పక్షపాతం చూపించాడు.

గురువు: లేదు నాయనా! ఆ దేవుడు ఏమీ పక్షపాతి కాదు .మనం ఇలా అనుకుంటామనే తాను నిర్మించిన కాలపాశపాలనాధర్మానికి తానూకట్టుబడి ఉంటాడు. ఎందుకంటే తాను తొక్కని తోవను రాజు ప్రజలకు చూపకూడదు ఆని ఆయనకు తెలుసు .అందుకే తానే అందుకు నిదర్శనమై రామాయణ – భాగవతాలతో నిరూపించాడు.

శిష్యుడు: ఎలా గురువుగారు?

గురువు: రామాయణంలో కైక అసందర్భంగా అడిగిన వరాల వల్ల అకారణంగా, తన మాంగళ్యాన్నీ,రాజ్యానికి నిర్దిష్ట రాజునీ, తాను ఎవరికోసమైతే ఆ వరాలు కోరినదో ఆ పుత్రునిచే నిందింపబడి తనయొక్క మాతృమర్యాదనీ కోల్పోయింది.భరతుడు ఏ మానవునికీ తగనిదైన మాతృనిందాపరాధం కారణంగా ,రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మని పిలవటానికి వెళ్ళి, లక్ష్మనునిచే ‘ఇంకనూ కనులు చల్లబడలేదా! అన్న ఇక్కడనూ బ్రతుకు వీలు లేదా!’ అన్న తనకు తగని అపార్ధానికి గురి అయ్యాడు. భరతుడిని అపార్థం చేసుకున్న కారణం చేత లక్ష్మణుడు మాతతో సమానం అనుకున్న సీతమ్మ చేత ‘మానం భంగపరచ చూస్తున్నావా?’ అన్న మాటలచే అనుమానించబడ్డాడు. బిడ్డకంటే ఎక్కువ సేవ చేసిన లక్ష్మణుని, తనని చెరపడతాడేమో అని శీలశంక చేసిన కారణంగా సీత , రావణుడు చెరపట్టడం, రామునిచే తనయొక్క శీలశంక మొదలగు పరిణామాలరూపంలో అనుభవించింది. సీతమ్మను , తన తప్పుచూపి, పాఠంరూపంలోదెప్పి మరీ స్వీకరించడం కారణంగా, చాకలివాడు తనభార్యను వదిలించుకొన ఆ పరిణామాన్నే కారణంగా చెప్పినా, గుణపాఠంగా స్వీకరించాడు రామూడు.వాలిని చంపిన కారణంగా ,తన చావుకు అతనే కారకుడు అయ్యేలా చేశాడు .

శిష్యుడు: అదెలా గురువుగారు ?గురువు: కృష్ణావతారం చాలించింది బోయావానిగా పుట్టిన ఆ వాలి చేతిలోనే.

శిష్యుడు: చూసారా గురువుగారు! దేవుడు పక్షపాతి కాడూ అన్నారుగా! పైన చెప్పబడిన అందరినీ కర్మ ముందే అనుభవించేలా చేసి ,తాను యుగాంతర విరామం తరువాత తీరికగా అనుభవించాడు.

గురువు: వత్సా! ఎప్పుడైనా ఇంట్లోవారినోట కర్మ కాలి ఇలా జరిగిందీ అన్న మాట విన్నావా?

శిష్యుడు: ఆ..ఆ ! విన్నాను గురువుగారూ! మా నాన్నగారు నేను ఏ చిన్న తప్పు చేసినా ‘నా కర్మ కాలి నువ్వు పుట్టవురా!’ ఆని అంటుంటారు.

గురువు: యద్భావం తత్భవతి. నీ తండ్రి తన కర్మ కాలగా నువ్వు పుట్టావు అని తలచాడు. ఆ రామయ్యతండ్రి జీవరాశి అనే బిడ్డల కర్మ కాలితేనే ,తనకర్మ కాలాలి అని తలచాడు. కర్మ ఎంత తొందరగా కాలిపోతే అంత మంచిది .మరీ తనమంచి పక్కనుంచి ఆనాటివారి కర్మలను తొందరగా కాల్చివేసాడు .ఇప్పుడు చెప్పు ఆయనది పక్షపాతం అన్నావే! నిజమే! కానీ అది తనయందు తానే చూపించుకున్నడు .

శిష్యుడు: మరీ జన్మల విరామమవసరమా గురువుగారూ ? మిగిలిన వారి కర్మలు ఆ జన్మలోనే కరిగాయి కదా! మరి తనకై రెండు జన్మలు ఎందుకు తీసుకున్నాడు?

గురువు: రెండు జన్మలు ఆని ఎవరు చెప్పారు నాయనా!

శిష్యుడు: అదేమిటి గురువుగారూ! రామ – కృష్ణావతారములు వేరుకదా! రాముడు నీట మునిగిపోయి జల సమాధి అయ్యాడు ఆని పాఠాంతరాల్లో విన్నాను. ఆ తరువాత కదా కృష్ణుడు పుట్టింది!

గురువు: లేదు నాయనా! చావు – పుట్టుకలు ఉన్నదే జన్మ.రాముడు చావలేదు- కృష్ణుడు పుట్టలేదు.శిష్యుడు: అదేమిటి గురువుగారూ?

గురువు: రాముడు జలమున ప్రవేశించి అంతర్ధానం అయ్యాడు.అయోధ్యాప్రజలు ఆ సంఘటన తరువాత ఆ ప్రాంతపు నలు దిక్కులా జల్లడవేసి పట్టారు.అయినా ఆయన వస్త్రాల నూలిపోగులు కూడా దొరకలేదు.(గమనిక: అందుకే ఉత్తరాదివారు మనిషి తనువుచాలించినా సరే, ‘రామ్- రామ్ సత్య హై’ అని అనుకుంటూ సాగనంపుతారు.ఎందుకంటే రాముడు చావలేదు. అలాగే ఈ దేహం విడిచిన ఆత్మారాముడు అయిన జీవుడు కూడా చావలేదు అని చెప్పడానికి).ఇక కృష్ణుని పుట్టుక అంటావా! అదో విష్ణుమాయ. ఆ అవతరణ సమయంలో ,ఎలాఅయితే ప్రహ్లదుడినీ కాపాడటానికి విశ్వమంతా నారసింహమై నిండాడో ,అలాగే మదురలోని కారాగారాన ఆవిర్భవించడానికి విశ్వమంతా మాయగా వ్యాపించాడు. దేవకీ వసుదేవులకు మొదట గర్భం నుండి తేజో రోపంలో బయటకు వచ్చి చేతుర్భుజ విష్ణువుగా ప్రత్యక్షమయ్యి బిడ్డ రూపు దాల్చాడు తప్ప, ప్రసూతి అయిన బిడ్డ కాదు కృష్ణుడు.రాముడు మాత్రం కౌసల్యకు ప్రసూతి అయిన బిడ్డలా ఆవిర్భవించాడు. కృష్ణుడు నిర్యాణం చెందినట్టు, రాముడు నిర్యాణం చెందలేదు. రామ రూపులో అంతర్ధానం అయ్యి వైకుంఠం చేరిన భగవంతుడు,కృష్ణావతారంలో ప్రత్యక్షం అయ్యాడు.ఒకే పుట్టుక,ఒకే నిర్యాణం .మరి అది ఒక జన్మగానే పరిగణించబడుతుంది కదా నాయనా! దీనినిబట్టి కర్మకు భగవంతుడు కూడా కట్టుబడి ఉంటాడు అని అర్థం అవతోంది కదా నాయనా! కర్మని శాశించునది కాలం. కాలానికి, భగవంతుడు తాను అనుకుంటే అతీతుడు లేదా ఆదీనుడు. ఎలా వచ్చినా ఆదర్శాన్నే అందిస్తాడు.

సారం:ఏది ఏమైనా సరే నీ కర్మలు( పనులు) నువ్వు చెయ్యి కర్మఫలాన్ని ( result) ఆశించకు ,ఆలోచించకు,చెడు ఫలం ఓస్తే ఆందోళన చెందకు .అవసరం అయితే ఆ ఫలానికి, కృష్ణునికి వచ్చినట్టు మృత్యురూపంలో వచ్చినా కాలుమీద కాలు వేసుకొని దర్జాగా స్వాగతం పలకాలి.

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.