అది విజయనగరంలోని ఉన్నత పాఠశాల.జిల్లాలో ఇన్స్ ఫేర్ అవార్డుల ప్రక్రియ ప్రారంభమయింది. "ఈ ప్రక్రియ ముఖ్యఉద్దేశం విద్యార్థులకు డబ్బు ఇచ్చి, ఏదైనా ప్రాజెక్టును లేదా నమూనాను రూపొందింపజేసి భావిశాస్త్రవేత్తలుగా ఎదగటానికి స్ఫూర్తిని కల్గించడం. అవార్డుకు పాఠశాలనుండి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి దరఖాస్తు పెట్టుకోవలసి ఉంటుంది. అవార్డుకు ఎన్నికయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేలరూపాయలు చెక్కురూపంలో అందుతుంది.ఆడబ్బుతో నమూనా,ప్రాజెక్టులను తయారుచేసి జిల్లాస్థాయిలో జరిగే ఇన్స్ ఫేర్అవార్డ్స్ ప్రదర్శనా ఉత్సవాలలో ప్రదర్శించవలసి ఉంటుంది.అక్కడ న్యాయనిర్ణేతలచే ఎన్నికైన ప్రాజెక్టులు,నమూనాలు రాష్ట్రస్థాయికి అధికారులచే సూచించబడతాయి.మీలో ఒకఅమ్మాయి,ఒక అబ్బాయి పేర్లు ఇస్తే దరఖాస్తు పూర్తిచేసి పంపిస్తాను" అంటూ వివరించారు ప్రధానోపాధ్యాయులు జయరామయ్యగారు. విద్యార్థులెవరూ ముందుకు రాలేదు. ఆయన మళ్లీమళ్లీ చెప్పినా ధైర్యంగా పేర్లు ఇచ్చి పాల్గొనడానికి ముందుకు రావడంలేదు.అప్పుడు జయరామయ్యగారు ఇలా చెప్పారు. మీరు న్యూటన్ మహాశయుడి గురించి విని ఉంటారు.ఆయన ఒకరోజు చెట్టు క్రింద నిల్చుని ఉండగా అవకాశమనేది కాయ రూపంలో చెట్టు మీద నుండి భూమి మీద పడింది.వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.కాయచెట్టు మీద నుండి భూమి మీదనే ఎందుకు పడాలి? ఆకాశం వైపు ఎందుకు పోగూడదు? అని ఆలోచించాడు. ఫలితంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూటన్ గమనసూత్రాలు ఆవిష్కరించగలిగాడు.వాటి గురించి వివరంగా మీరు పాఠ్యాంశాలలో చదువుకుంటున్నారు.అదేవిధంగా ఆల్ ఫ్రైడ్ నోబెల్ పేరు మీకు తెలుసు.నోబెల్ పెద్దగా చదువుకోలేదు. చిన్నతనంలో తన తండ్రి నడిపే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ప్రతిదీ పరిశీలించే తత్వంకలవాడు. ఒకరోజు ఫ్యాక్టరీకి పోవడం ఆలస్యమయింది. అంతకు ముందే ఆయన తమ్ముడు ఫ్యాక్టరీకి వెళ్లిఉన్నాడు. దురదృష్టవశాత్తు ప్రేలుడు జరిగి ఫ్యాక్టరీ పేలిపోయింది.నోబెల్ వెళ్లే లోపలే ఈసంఘటనజరిగింది.నోబెల్ తమ్ముడి మరణానికి చింతించాడు. ఫ్యాక్టరీ ప్రేలిపోయిందని అధైర్యపడలేదు. ప్రేలుడు కారణాన్ని అన్వేషించాడు. చివరకు ఆఅన్వేషణ ద్వారా డైనమేట్ కనుక్కున్నాడు.ప్రేలుడు ద్వారా ఆయనకు అన్వేషించే ఆలోచనచేసే అవకాశం వచ్చింది నోబెల్ చనిపోయాక ఆయన పేరు మీద నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు పదవతేదీన శాంతి, సాహిత్యం ,భౌతిక, రసాయనశాస్త్రాలు,వైద్యశాస్త్రం,ఆర్థికశాస్త్రం,మొదలగు రంగాల్లో నోబెల్ బహుమతులిస్తున్నారు.ఈ బహుమతి విలువ సుమారు13.5లక్షల అమెరికన్ డాలర్లు. న్యూటను,నోబెల్లాంటి వారు వచ్చిన అవకాశాలను,ఆలోచనలను ఉపయోగించుకోవటం వల్లే ఆ స్థాయికి చేరుకున్నారు.అవకాశమనేది ఎప్పుడూ రాదు.వచ్చినప్పుడు అందుకోవాలి." అని చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు జయరామయ్య. ఆయన మాటల ప్రేరణతో నేను, నేను అంటూ విద్యార్థులు నమూనా ప్రాజెక్టులఆవిష్కరణలో పాల్గొనడానికి ముందుకొచ్చారు.వారందరినీ పరీక్షించి ఇన్ స్ఫైర్ అవార్డుకు ప్రతిభావంతులను ఎన్నికచేసి దరఖాస్తు పంపారు జయరామయ్యగారు.