సాయంత్రం అయిదు గంటల సమయం. సముద్రం పైనించి వీస్తున్న చల్లటి గాలులు నాలో డ్రింకింగ్ హాబిట్ ని రెచ్చగొడుతన్నాయి . బ్రాందీ , విస్కీ, రమ్, జిన్... బ్రాండ్ ఏదయినా. గొంతులోకి ఏదో ఒకటి పడితే తప్ప శరీరం ఊరుకోనంటోంది.. షికారుకొచ్చిన ఫామిలీలు.. కేరింతలు కొడుతున్న పిల్లలు.. శృంగార జంటలు..నా కోరిక తీర్చుకోవటానికి ఎవరు దొరుకుతారా అని సెర్చ్ చేశాను. ఒక చోట ఒంటరిగా వృద్దుడు కనిపించాడు . అతని ముఖంలో సెంటిమెంట్ కనపడుతోంది. అలాంటి వాళ్ళని బుట్టలో పడేయటం నాకు తేలికైన పని.. ఈరోజుకి నా టార్గెట్ అతనే అని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను.
‘’సర్, ఈ సిటీ లో మా బంధువులున్నారని వచ్చాను. వాళ్ళు ఇదివరకే ఇల్లు ఖాళీ చేసి వేరే రాష్ట్రం వెళ్లారట. తిరిగి వెళ్తుండగా రైల్వే స్టేషన్ దగ్గరలో ఒకడు నా మీద కన్నేశాడు. వెంటపడ్డాడు. భయంతో పారిపోయి ఇటు వచ్చాను. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. తెల్లవారాక రైలు.. ఈ రాత్రికి ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో ఉండాలి. మిమ్మల్ని చూస్తే జెంటిల్మన్ లా ఉన్నారు..’’నేను కల్పించిన కధ అతను నమ్మేశాడు.
ఇరవై నిముషాల జర్నీ తర్వాత కారు ఓ డైమండ్ వ్యాలీ లోకి వెళ్ళి ఆగింది. అతనికి పెద్ద ఇల్లు ఉంది. అంత పెద్ద ఇంట్లో అతనొక్కడే. భార్య రెండేళ్ల కిందట చనిపోయిందట. పిల్లలు ఇతర దేశాలలో సెటిలయ్యారట. ముందే తయారు చేసిపెట్టుకున్న ఫుడ్ నాకూ ఆర్డర్ చేశాడు. పదార్ధం కడుపులో పడితే లిక్కర్ ఎంజాయ్ చేయలేను. నేను తర్వాత తింటానని అతడిని తిని పడుకోమని చెప్పాను. నాకు వేరే రూమ్ చూపించి అతను తన రూమ్ కి వెళ్ళాడు.
ఇప్పటికే సమయం మించి పోయింది. రాత్రి 12 వరకు బార్ షాపులు తెరిచి ఉంటాయి. ఇక్కడ నా పని పూర్తిచేసుకున్నాక క్యాబ్ బుక్ చేసుకోవాలి. బార్ కి చేరుకునే సరికి సమయం సరిపోతుంది. అతను పడుకున్న రూమ్ లోకి తొంగి చూశాను. నాకు తెలుసు.. అతనిక లేవలేడు. ఎందుకంటే అతని డైనింగ్ పైన వాటర్ గ్లాస్ లో కొన్ని మత్తు బిళ్ళలు కలిపిన సంగతి నాకు మాత్రమే తెలుసు.

ప్లాన్ ఏ ఇంతటితో పూర్తయింది. ఇక ప్లాన్ బి. ఆ ఇల్లంతా వెతికాను. ఓ గదిలో లాకర్ కనిపించింది. నాకున్న అనుభవం ఉపయోగించి దాన్ని తెరిచాను. లాకర్ లో అన్ని అరలు ఖాళీగా నన్ను వెక్కిరించాయి.
చేతిలో గన్ ఉంటే ఆ ముసలి వాడిని కాల్చి పారేయాలాన్నంత కోపం వచ్చింది. ఏమి చేసేది లేక వెనక్కి తిరిగిన నేను ఒక్కసారిగా షాక్ . ఎదురుగా నాకు గన్ ట్రిగ్గర్ చేసి ఆ వృద్దుడు..
కొన్ని సంవత్సరాల తర్వాత....
ఇప్పుడు నేను ఫ్యామిలీ విమెన్ ని. నన్ను ప్రేమగా చూసుకునే భర్త, కన్న కూతురిలా చూసుకునే అత్త, మామలు.. ఆరోజు ముసలి మిలిటరీ అతను గన్ గురిపెట్టి నా గుండెల్లో విసిరింది తూటాలు కాదు.. తూటల్లాంటి కొన్ని మంచి మాటలు..
" పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకుంటుందిట. నువ్వు నా కళ్ళు కప్పలేవు. నేనొక రిటైర్డ్ మిలిటరీ పర్సన్ ని. శత్రువుల నించి దేశాన్ని రక్షించటానికి నా జీవిత కాలాన్ని ఫణంగా పెట్టాను. చెడ్డ గుణాలనే శత్రువుల నించి నీ శరీరాన్ని కాపాడుకోటానికి నీ జీవిత కాలాన్ని కేటాయించలేవా.." అన్నాడు.
ఆ క్షణానే నేను డిసైడ్ అయ్యాను. నాలో చెడ్డ గుణాలకి బై బై .. చెప్పటానికి.