
తనఇంటి అరుగుపైన చేరినపిల్లలకు మిఠాయిలు పంచినతాతగారు 'బాలలు ఈరోజు మీకు కొన్నిసామెతలతోపాటు,ఒకనీతికథ చెప్పుకుందాం....
ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును. పరులసొమ్ము పామువంటిది అనితెలుసుకొండి.కథలోనికి వెళదాం!.....
కోతిబావకు ఆకలివేయడంతో,అడవికి కొద్దిదూరంలోని నగరంలోని గుడివద్ద తప్పెటమోతవినిపించడంతో,తనకు ఏదైనా ఆహారం దొరకక పోతుందాఅని నగరంలోని గుడివద్ద ఉన్నచెట్టుపైకి చేరాడు కొద్దిసేపటి అనంతరం,పిల్లలచేతిలోని అరటిపళ్ళు,ఒకకొబ్బరి చిప్పఅందుకుని వస్తుండగా ,అక్కడ చేతి సంచి ఒకటి కనిపించింది దాంట్లో ఏదైనా ఆహారం ఉండవచ్చ అని భావించిన కొతిబావ దాన్ని భుజానికి తగిలించుకుని, అడవి చేరి తనునివసించే చెట్టుపైన చేతిసంచి భద్రపరచి నీళ్ళు తాగడానికి చెట్టుదిగాడు.
ఇంతలోనే చెట్టుపైనున్నచేతిసంచి జారి నేలపైన పడుతూనే అందు లోని బాంబు పెద్ద శబ్ధంటో పేలింది. ఆ ధాటికి కోతి బావ ఎగిరి దూరంగా పడ్డాడు. అక్కడి అడవి ప్రదేశమంతా చిన్నాభిన్నం కావడంతో అడవికి నిప్పుఅంటుకుంది.
బాంబు పేలుడు శబ్ధంవిన్న జంతువులన్ని పరుగు పరుగున అక్కడికి చేరాయి. మండుతున్న అడవిని చూసిన ఏనుగులగుంపు సమీపం లోని నీటిని తమ తొండాల నిండుగా తీసుకువెళ్ళి అడవి మంటలను ఆర్పివేసాయి.
మూలుగుతున్న కోతిబావవద్దకు వెళ్ళిన సింహారాజు "ఇది తమరి పనేనా?"అన్నాడు."ప్రభు క్షమించండి ఆ సంచిలోని డబ్బాలో లో ఏదైనా ఆహారం ఉంటుంది అని ఆశపడి తీసుకువచ్చాను అందులో పేలుడు పదార్ధం ఉందనితెలిస్తే దాని తాకేవాడినేకాదు"అన్నాడు రెండుచేతులు జోడించిన కోతి." ఎవరో గుడికివచ్చే ప్రజలను లక్ష్యంగా పెట్టిన బాంబు ఉన్న సంచిని మీరు అడవిలోనికి తేవడం అది ఇక్కడ పేలి మనకు కొంతనష్టం జరిగినప్పటికి నగరంలోని ప్రజలకు జరిగేనష్టాన్ని అందుకు నిన్ను అభినందిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మనదికాని ఏవస్తువైనా మనంతాకకూడదు, అనుమానంగా ఉంటే పెద్దల దృష్టికి తీసుకువెళ్ళిలి తెలిసిందా"అన్నాడుసింహారాజు.బుద్దిగా తలఊపాడు కోతిబావ "అన్నాడు తాతగారు. పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.