మోహన్ కి ఆక్వేరియం లో చేపలు పెట్టి పెంచడము చాలా ఇష్టం. తన ఇంట్లో ఒక అందమైన ఆక్వేరియం ఉంది. అందులో చేపలని ఎంతో శ్రద్ధ తో రోజు ఆహారం వేసేవాడు. ఎప్పుడు వాటికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు.
ఒక రోజు ఒక కొత్త రంగుల చేపని కొని తెచ్చారు వాళ్ళ నాన్నగారు. ఆ చేపని మోహన్ ఆక్వేరియం లో వేసాడు. అది చాల అందంగా ఉంది. దానిని చూసి చాల ఆనందపడ్డాడు మోహన్. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి, ఎవరో తనని పిలుస్తునట్టు అనిపించింది మోహన్ కి. వెంటనే హాల్ లోకి వెళ్ళాడు. ఆ శబ్దం ఆక్వేరియం లో నుండి వస్తుందని గ్రహించాడు. అక్కడికి వెళ్లి చూడగా, కొత్తగా తెచ్చిన చేప తనతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్నదని గ్రహించాడు.
మోహన్! నువ్వు చాల మంచివాడి లాగా ఉన్నావు. నాకో సహాయం చేస్తావా?
ఆ మాటలు వినగానే మోహన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఒక పక్క ఆనందం కూడా కలిగింది.
నువ్వు ఎలా మాట్లాడగల్గుతున్నావు? నాకు నీ కధ చెప్పు! అని చేపని అడిగాడు.
నా కధ చెబుతాను విను. నేను ఇంతకుముందు ఒక ఆక్వేరియం లో ఉండేదానిని. నా యజమాని నీలాగా కాదు. ఒక శాడిస్ట్. ఆక్వేరియం లో ఉన్న నన్ను, నా తోటి స్నేహితులని సరిగ్గా చూసేవాడు కాదు. తిండి వేసేవాడు కాదు. చాలా ఇబ్బంది పెడుతూ, ఆనందం పొందేవాడు. అలాగా కొన్ని రోజులకి నా స్నేహితుల చేపలన్నీ చనిపోయాయి. వాడికి ఏ మాత్రం బాధలేదు. నేను మాత్రం ఎలాగో తెలివిగా ఎగిరి, పక్కనే ఉన్న నది లో పడ్డాను. ఆలా ఈదుకొని అలసి వొడ్డున పడ్డ నన్ను ఒక సాధువు చూసి తన దివ్య దృష్టితో చూసి నా బాధ తెలుసుకున్నాడు. నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం నేను తలచుకున్న మనిషి తో మాట్లాడగలిగే శక్తి నాకు వచ్చింది. అందుకే నేను నీతో మాట్లాడుతున్న.
నా బాధ తీర్చు. నన్ను, నా స్నేహితులని బాధపెట్టిన వాడికి బుద్ధి చెప్పు ప్లీజ్!
ఓ అందమైన చేప ! నువ్వు అడిగిన కోరిక నేను తీరుస్తా.
పధకం ప్రకారం మోహన్ బుద్ధి చెప్పడానికి ఆ శాడిస్ట్ ఇంటికి వెళ్ళాడు. ఒక పుకారు పుట్టించాడు అక్కడ. వాడికి ఒక వింత అంటూ వ్యాధి వచ్చిందని, ఎవరూ దగ్గరకు వెళ్లకుండా , సహాయం చెయ్యకుండా చేసాడు మోహన్ తెలివిగా. అలాగా వాడు బయటకు రాలేక, ఇంటికి ఎవరూ రాకపోవడం తో తిండి లేక నీరసించి తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. వెంటనే చేసిన తప్పు తెలుసుకొని మనసులో బాధ పడి క్షమించమని వేడుకున్నాడు.
ఆ విషయం చేపకి తెలిసాక, ఇక చాలనుకుని ఆ చేప శాడిస్తూ ని వదిలేయమని చెప్పించి మోహన్ కి. ఆ పుకారు నిజం కాదని జనాలకు తెలిసేటట్టు చేసాడు.
ఆ తర్వాత ఆ చేప మోహన్ తో స్నేహంగా, సంతోషంగా ఉంది.