పెళ్ళిచూపులు - తాత మోహన కృష్ణ

Pelli choopulu

అలారమ్ గట్టిగ మోగుతుంది. నాకు తెలివొచ్చి టైం చూసాను. అప్పుడు టైం 6 అయ్యింది. 8 గంటలకి పెళ్ళిచూపులు ఉన్నాయని అమ్మ రాత్రి అలారమ్ పెట్టింది.

ఇదే నా మొదటి పెళ్ళిచూపులు. అమ్మ నాన్న లు అమ్మాయి ఫోటో చూసి పెళ్ళిచూపులు పెట్టారు ఈ రోజు. నాకు అమ్మాయి ఫోటో చూపించలేదు, వంకలు పెడతానేమో నని కాబోలు.నేను చేసుకోబోయా అమ్మాయి ఎలా ఉండాలో నాకు ఒక ఖచ్చితమైన లెక్క ఉందని. విశాలమైన కళ్ళు, గుండ్రటి మొహం, అందమైన చిరునవ్వు, ఇంపుగా ఎద సౌందర్యం, అన్నింటికీ మించి రసికురాలై ఉండాలి.

అనుకున్న టైం కి పెళ్ళి వారి ఇంటికి చేరుకున్నాం. వాకిట్లో కాళ్ళు కడుక్కోవడానికి చెంబు తో నీళ్లు అందించారు. తర్వాత లోపలికి వెళ్ళాం. కొంతసేపు తర్వాత నన్ను ఆ అమ్మాయిని మాట్లాడుకోమని పంపించారు. అలా మా ఇద్దరినీ మాట్లాడుకోవడానికి తోటలోకి పంపించారు. తోటలో అలా మా ఇద్దరం ఒకళ్ళకి ఎదురుగా ఒకరు కూర్చున్నాం. తను ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని చాలా అందంగా ఉన్నాది. చాలా బాగుంది.

తను ఎదురుగ కూర్చున్నది, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, కాకపోతే అమ్మాయి మటుకు చాలా బాగుంది. మనసులో ఎక్కడో చాలా బాగా నచ్చింది. నేను అనుకున్న విధంగా ఉన్నది. అన్ని రకాలుగా చాలా ఆనందపడ్డాను.

ఇంతలో నేను ఏం మాట్లాడాలో తెలియక సతమవుతమవుతుంటే, ఆ అమ్మాయి ఈ లోపు మెల్లగా మొదలుపెట్టింది మాటలు.

ఏవండీ వంశీ గారు ! ఎలా ఉన్నారు? అని ఒకసారిగా తను అనేసరికి ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తి నాతో మాట్లాడుతునట్టు అనుభూతి కలిగింది నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు.

కొంచెం కంగారుగా ఉన్నప్పటికీ కూడా బానే ఉన్నాను అని చెప్పాను. ఈ లోపు తను ఇంకొక మాట అందుకున్నది. నేను మీకు నచ్చానా అండి? నేను ఎలా ఉన్నాను? మీరు ఏం చెప్పలేదు. ఇంకో మాట సుమీ! నా కొలతలు 36 24 36 , నేనే చెప్పేస్తున్నాను. మీకు నేను నచ్చానా?

నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. నాది నవ్వు ముఖము అని మా ఇంట్లో అందరూ అంటారు.

నా పేరు మీకు నచ్చినట్టుగానే 'ఎస్' అక్షరంతో మొదలవుతుంది. మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నా పేరు స్వాతి ! ఇప్పుడు నేను నచ్చానా?

నేను ఎలా చూసినా చాలా అందంగా ఉంటానని మా కాలేజీలో అందరూ అనేవాళ్ళు. ఇక మీరే చెప్పాలి వంశీ గారు! నేను మీనుంచి ఏదో వినాలని వెయిట్ చేస్తున్నాను.

ఇలా అమ్మాయి మాట్లాడుతూ, కొంచెం కావాలని చేసిందో మరి ఎందుకు చేసిందో తెలియదు గానీ, కొంచెం తన పైట జరిగింది. నన్ను ఏదో తాను చెప్పిన కొలతలు కన్ఫర్మ్ చేసుకోమని అన్నట్టుగా ఉంది. అది చూడగానే నాకు ఇబ్బంది కలిగింది. ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నది బాబు! ఈ అమ్మాయి నాకు ఇంతకు ముందు తెలిసిన అమ్మాయా ? ఏమిటో నాకు అర్థం కాలేదు.

కానీ ఒకటి మటుకు నాకు అర్థమైంది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, కొంచెం చలాకీ ఉన్నా, ఇంకో రకమైన ఉద్దేశం ఏమీ లేదని నాకు అర్థమైంది. ఎక్కడో మనసులో నాకు ఒక మాట కూడా అర్థమైంది, ఏమిటంటే తనకి నేను నచ్చి ఉంటాను, కనుకనే తాను ఇంతలా చేస్తున్నాదని కూడా నాకు అనిపించింది.

ఆ అమ్మాయి అంతటితో ఆగకుండా, కొంచెం లేచి, నేను ఇప్పుడే మీకు టీ పెడతానని చెప్పి వెనకాతలే, పక్కనే స్టాండ్ మీద ఉన్నఫ్లాస్క్ నుంచి టీ కప్పులోకి పోసి, పంచదార వేసి కలుపుతూ, తన అందమైన నడుముని, తన వెనుక భాగాన్ని నాకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా, నాకెందుకు అనిపించింది. ప్రతి విషయానికి మాట్లాడుతున్నప్పుడల్లా ముందూ వెనుక చిరునవ్వు నాకు చాలా ఆనందం అనిపించింది.

నేను చిన్నప్పటి నుంచి నాకు కాబోయే శ్రీమతి ఎలా ఉండాలో అది నాకు దొరికిందని మనసులో ఎంతో ఆనందం కలిగి, నాకు నేనే కంగ్రాట్యులేషన్స్ నా మనసులో చెప్పుకున్నాను.

కప్పులో పంచదార వేసి కప్పులో పంచదార వేసి కలిపిన తర్వాత మెల్లగా తీసుకొచ్చి నా చేతికి అందించి, కొంచెం వంగుతూ చిన్నగా నవ్వుతూ నా చేతికి అందించింది. ఆ నవ్వు చూడగానే నాకు ఎనలేని ఆనందం కలిగింది. కాఫీ ని మెల్లమెల్లగా సిప్ చేస్తూ చాలా బాగుంది స్వాతి గారు! నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాను. మీరు నచ్చారు స్వాతిగారు ! అని చెప్ప లేక కాఫీ బాగుందని చెప్పి, హాల్లోకి వెళ్తానండి అని చెప్పేసి హాల్లోకి వచ్చేసాను. స్వాతి మౌనంగా తలదించుకుని అమాయకంగా హాల్లోకి వచ్చి ఎదురుగా కూర్చున్నది.

మా ఇంట్లో విషయం తర్వాత ఫోన్ చేసి చెప్తామని, మేము అందరం ఇంటికి బయలుదేరు వెళ్లిపోయాము.

ఆరోజు రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఆ రాజు ఉదయం జరిగిన సన్నివేశాలు : అందమైన స్వాతి రూపం, మరింత అందమైన ఆమె చిరునవ్వు, మాట్లాడిన మాటలు, చెప్పిన కొలతలు, గుర్తుకు వచ్చాయి. ఎంత ఆలోచించినా ఆ అమ్మాయికి నా మనసులో మాటలు ఎలా తెలుసొనని నాకైతే ఏమి అర్థం కాలేదు. ఏమైనా మన మంచికే జరిగింది. ఆ దేవుడు నాకోసమే తనని నాకు ఇలా పంపించడం, మనసులో చాలా సంతోషించి, కొంతసేపు అయిన తర్వాత నిద్రపోయాను.

తెల్లవారుజామున సెల్ ఫోన్ మోగింది. ఎవరో కొత్త నెంబర్. ఎవరీ కొత్త నెంబర్ అని ఆలోచిస్తూనే, ఫోన్ ఎత్తాను. ఈ లోపుకు అందమైన గొంతు వంశీ గారు! ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్! నాకు వెంటనే అర్థం అయిపోయింది. ఇది ఉదయం పూట నేను పెళ్ళిచూపుల్లో చూసిన స్వాతి అని.

బాగా నిద్ర పట్టిందా అండి? ఇంతకీ నాకు చెప్పలేదు - నేను మీకు నచ్చానా లేదా?
మీరు అయితే నాకు చాలా బాగా నచ్చారు! అని చెబుదామని ఉదయాన్నే ఫోన్ చేశాను.

ఒక అమ్మాయి ఇంత నిర్భయంగా తన మనసులో ఉన్న మాట చెప్పగల్గినప్పుడు, ఒక మగాడినై ఉండి నేనెందుకు చెప్పలేకపోతున్నాను?. నాలో నేను అనుకొని వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వెళ్లాను. మా అమ్మానాన్నలతో నాకు అమ్మాయి నచ్చిందని చెప్పాను. వాళ్లు ఎంతో సంతోషించారు.

బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఎందుకో స్వాతికి మళ్ళీ ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ తీసుకొని వెంటనే చేశాను. తన అందమైన గొంతు వినాలని, ఆ చిరునవ్వు ఒకసారి మనసుతో చూడాలని . వెంటనే అట్నుంచి తను ఫోను ఎత్తి ఏమండీ వంశీ గారు ! ఏమిటి మేము గుర్తొచ్చాం? అన్నది.

మనం ఎక్కడైనా కలుద్దామా స్వాతి గారు ? పార్క్ లో?
సరే నండి వంశీ గారు. ఈరోజు సాయంత్రం 5 కి కలుద్దాం.

సాయంత్రం 5 కి వంశీ పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. స్వాతి కి తన ఇష్టాన్ని ఎలా చెప్పాలని ప్రిపేర్ అవుతున్నాడు.

అల్లంత దూరాన స్వాతి పార్కులోకి నడిచి రావడం చూసాడు వంశి. చుడిదార్ వేసుకుంది. దూరంనుంచి ఆమె కొలతలు లెక్క వేసుకోడానికి అవకాశం వచ్చింది. సరిగ్గా సరిపోయాయి.

స్వాతి వచ్చిన తర్వాత వంశి తో " కొలతలు సరిపోయాయా "అంది.

వంశీకి నోట మాట రాలేదు. వెంటనే నా మనసులో ఉన్న మాటని నిర్భయంగా అమ్మాయికి చెప్పేసాను.

స్వాతి ఒక నవ్వు నవ్వింది. ఈలోపు ఎవరో రావడం తో ఇద్దరు వెళ్లిపోవాల్సి వచ్చింది.

అనుకున్న ప్రకారం గానే మా ఇద్దరికీ వివాహం అంగరంగ వైభవంగా జరిగినది.

అదే మా తొలిరాత్రి. ఈరోజు ఎలాగైనా స్వాతి తో మాట్లాడి నా గురించి ఇంతలా ఎలా తెలుసుకున్నదో , ఎలా రీసర్చ్ చేసిందో తెలుసుకోవాలని ఎంతో తప్పించాను. అలాగే ఆమె పాల పొంగులు దగ్గరగా చూడాలని ఎంతో ఆశ గా వుంది.

గదిలోకి స్వాతి ని పాల గ్లాస్ తో లోపలికి పంపించారు. స్వాతి వచ్చి నా పక్కన కూర్చున్నది. గ్రీన్ కలర్ సారీ ఆమె అందాన్ని గట్టిగ బందించాయి. ఆ బ్లౌజ్ లో ఆమె అందాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

ఏమండీ! మిమల్ని నా సొంతం చేసుకున్న. నాకు చాలా సంతోషంగా ఉంది.

అదేంటి స్వాతి?

ఇప్పటికైనా నా గురించి తెలిసిందా? మనం ఒకే స్కూల్ లో చదివేము. మనది కో-ఎడ్యుకేషన్ కాకపోవడం వలన, మాకు వేరే ఫ్లోర్ లో క్లాసులు ఉండేవి. మీరు ఎప్పుడూ మా ఫ్లోర్ కి రాలేదు. కానీ మిమల్ని నేను చాలా సార్లు చూసాను. మీరు స్కూల్ ఫస్ట్ కదా. మీరంటే ఇష్టమని, మీ ఫ్రెండ్స్ కి మీతో చెప్పమని చెప్పాను. కానీ మీకు చెప్పినట్టు లేదు.

మీ ఫోటో చూసి మిమల్ని గుర్తుపట్టాను. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఎలాగైనా, మిమల్ని పెళ్ళి చేసుకోవాలని.

అందుకే మీదగ్గర ఎక్కువ చనువు తీసుకున్నాను.

మరి నా ఇష్టాలు ఎలాగా తెలిసాయి?

ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. మరి అన్ని కంఫర్మ్ చేసుకున్నారా? పెళ్ళిచూపుల్లో, పార్కులో, ఇప్పుడు దగ్గరగా? అన్ని సరిపోయాయా?

కొంతసేపు ఆగండి. దగ్గరగా చూడొచ్చు ఇంకా!

చిలిపి శ్రీమతి! చూడడమే కాదు ఫుల్ గా ఆరగిస్తా చూడు!

స్వాతి! ఈ వొంటి కొలతలు, ఒంపు సొంపులు శాశ్వతం కాదు. నీ మంచి మనసు, నా మీద ఉన్న ప్రేమ ముఖ్యం. నీ చిరునవ్వు ఒకటి చాలు నాకు. అలాగని చిలిపితనం మాత్రం తగ్గదులే.

అయితే సరే! ఇకనుంచి పట్టుకొని కంఫర్మ్ చేస్కోవచ్చు రోజూ నన్ను.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న