నైతిక విజయం - కయ్యూరు బాలసుబ్రమణ్యం

Naitika vijayam

గోమతి రాజ్యాన్ని విక్రమార్కుడు పరి పాలించేవాడు.ప్రజలకు ఏం కష్టం రానీయకుండా జనరంజకంగా పాలిస్తూ అందరి మన్ననలను పొందేవాడు.తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఎప్పటి కప్పుడు అన్ని శాఖల తో సమావేశమై ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సమ స్యలను పరిష్కరించేవాడు.ఒకోసారి మారు వేషంలో ప్రజలలోకి వెళ్ళి వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని మంత్రి ద్వారా తీర్చేవాడు.ప్రజలందరూ విక్రమార్కుని పరిపాలనలో ఆనందంగా జీవించేవారు.విక్రమార్కునికి తన ప్రజల శ్రేయస్సే ముఖ్యం. ఇతర రాజ్యాల పై యుద్ధం చేసి ఆక్రమించాలనే ఆలోచన ఉండేది కాదు.అలాగని తన రాజ్యం పై ఎవరైనా యుద్ధానికొస్తే ధైర్యంగా ఎదు ర్కొని తరిమేవాడు.ఏ నాడు యుద్ధం లో ఓటమి చవిచూడలేదు.చుట్టూ ఉన్న రాజ్యాల రాజులు విక్రమార్కుడుతో గెలవలేమని గోమతి రాజ్యంపై కన్నెత్తి చూసేవారు కాదు.ఒక రోజు గోమతి రాజ్యంలో సగం మంది ప్రజలకి, సైని కులకి ఓ వింత వ్యాధి సోకింది.విక్రమా ర్కుడు ఆందోళన చెందాడు.వెంటనే తన రాజ్యం లోని వైద్యులకి ఆ వింత వ్యాధిని నయం చేయమని ఆదేశిం చాడు.ఎంత వ్యయమైనా నయం చేయ మని చెప్పాడు.వైద్యులు ఆ వింత వ్యాధి నయం చేసే పనులో తలమునక లయ్యారు.ఇంతలో గోమతి రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించాని గతంలో ఐదు సార్లు విక్రమార్కుని చేతిలో ఓడిపోయిన పొరుగు శాకుంతల రాజ్యం రాజు దేవ సేనుడు ఈ సారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకుని, యద్దానికి వస్తున్నట్టు తన వేగుల ద్వారా విక్రమార్కునికి వర్త మానం పంపాడు. తన రాజ్యం లో సగం మంది ప్రజలకి, సైనికులకి వింత వ్యాధి సోకిన తరుణంలో యుద్ధం ఎలా వెళ్లాలని ఆలోచనలో పడ్డాడు విక్ర మార్కుడు.తన ప్రజలకి వైద్యం చేయిస్తూ,తన రాజ్యాన్ని కాపాడు కోవడమే తన ముందున్న కర్తవ్యం. యుద్ధానికి తగిన సంఖ్యా బలం లేక పోయినా గెలవకపోతే తన ప్రజలు వారికి బానిసలు గా బ్రతకాలని మొక్క వోని ధైర్యం తో యుద్ధానికి మిగిలిన సైన్యాన్ని సన్నద్ధం చేసాడు విక్ర మార్కుడు. విక్రమార్కునికి,దేవసేనుడికి మద్య భీకర యుద్ధం జరిగింది.తగిన సంఖ్యా బలం లేకపోవడంతో దేవసేనుడి చేతిలో విక్రమార్కుడు మొదటి సారిగా ఓడిపోయాడు.దేవసేనుడి ఆనందానికి హద్దులు లేవు.ఎప్పుడు ఓడని విక్ర మార్కుడు ఈ సారి ఎందుకు ఓడాడని దేవసేనుడికి సందేహం కలిగింది.వెంటనే వేగుల ద్వారా కారణం తెలుసుకోమని ఆదేశించాడు దేవసేనుడు.ఓటమికి గల కారణం తెలుసుకున్న వేగులు చెప్పిన మాటలు విని దేవసేనుడు ఆశ్చర్య పోయాడు.తను రాజ్యాన్ని ఆక్రమించా లనే కాంక్షతో ఇన్నాళ్లు ఆలోచించానే కాని ఏ రోజు ప్రజల శ్రేయస్సును కోర లేదని, విక్రమార్కుడు ప్రజల శ్రేయస్సు చూస్తూ కూడా యుద్ధం లో వీరోచితంగా పోరాడని గ్రహించాడు.వెంటనే విక్ర మార్కుడిని కలిసి"విక్రమార్కా! యుద్ధం చేయడమంటే శత్రు రాజులను ఓడించ టమే కాదు.ప్రజల శ్రేయస్సును కూడా చూడాలని నీవు నిరూపించావు.తగిన సంఖ్యా బలం లేకున్నా, ప్రజలు, సైనికులు వింత వ్యాధితో బాధపడు తున్నా వారికి వైద్యం చేయస్తూనే నాతో యుద్ధానికి తలపడ్డావు.నిజమైన వీరు డివి నీవే.ఈ యుద్ధం లో నీవు ఓడిపో యినా నైతిక విజయం నీదే.కనుక నీ రాజ్యాన్ని నీకేఇచ్చేస్తున్నాను.ఇంకె ప్పుడు ఏ రాజ్యం పై యుద్ధం చేయను. నా రాజ్యంలో ప్రజలను సుభిక్షితంగా చూసుకుంటాను"అని చెప్పి గోమతి రాజ్యాన్ని విక్రమార్కుడికి అప్పగించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పొరుగు రాజ్యాల రాజులు రాజు అంటే యుద్ధం చేసేవాడే కాదు తన రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కోరే వాడిని తెలుసుకుని యుద్ధాలు చేయ డం మానుకుని తమ ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలన చేయసాగారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న