కడివెడు నీళ్ళు. మొదటి భాగం. - రాము కోలా.దెందుకూరు.

Kadivedu neellu.1

(మొదటి భాగం).

"అయ్యా.... " మరో సారి ఆలోచించుకోయే! " ఎటి సేత్తమే అక్కడి కెళ్ళి" "కలో గంజో ఇక్కడే రెండు బుక్కులు తినేసే, నలుగురితో గడిపెద్దమే!" "ఆలోచించుకోయే" తను చెప్పవలసినది చెప్పి, ఇప్పుడేమంటావు ఏంటి, అని అయ్య ముఖంలోకి తొంగి సూసినాడు, నూనూగు మీసమైనా రాని వీరబాబు." " నేల మీద పరుచుకున్న కండువా తీసి, గాట్టిగా దులిపేసి, తలపాగా చుట్టేసి పక్కనేవున్న ముళ్ళుగర్ర అందుకని," "నా నేటైనా ఓపరి నిర్ణయం అంటూ తీసుకుంటే అది జరిగితీరాల్చిందే." "ఇక ఆలోచనల్తో బుర్ర పాడుచేసుకోక" " నే నట్టా ఊర్లోకియెల్లి, ఎక్కడైనా డబ్బులూ అప్పుగా దొరుకుద్దేమో అడిగి చూస్తా." "ఎటి అర్దమైందా?" "ఇక మరోటి ఆలోచనే లేదు" అంటూ చేతికర్ర తీసుకుని ఊరు వైపు నడక సాగించిండు మల్లయ్య . ఏటి చేయాలో అర్థం కానీ వీరబాబు, చిన్నగా ఓబులమ్మ దగ్గరికి జరిగి, " అయ్య కంటే ఎరకపోయే! నువ్వేమైనా కాస్త చెప్పోచుగందా? అట్టా మిన్న కుంటే ఎట్టా " " అంటూ ఓబులమ్మ పక్కన చేరిపోయాడు వీరబాబు" " ఏటిరా! నానేటి చెప్పగలను" "నాను చెప్పితే ఇంటాడేటి మీఅయ్య" "లేడికి లేచిందే పరుగు," మీ అయ్యకు తోచిందానికి ఒప్పేసుకోవడమే," "మరింకేటి లేదూ. ఆలోచించని కి" " పదా కాస్త సద్ది తిని తొంగుంటే, ఏ సాయంత్రానికో వత్తాడు కదా! మరో సారి చెప్పి చూద్దాంలే పదా" " అంటూ! గుడిసె వైపు సాగిపోతుంది ఓబులమ్మ....." "చాలా భారంగా మారిపోయింది వీరబాబు మనసు" ** "ఏటి! సద్దితినేసి తొంగున్నాడా ఆడు" "పిచ్చి సన్నాసి!" "నాకేమైనా సంతోషమా ఏటి?" "రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని, మట్టిని నమ్ముకుని, మట్టిలోనే కలిసిపోయే ఈ శరీరంతో ఎంత కట్టపడిపోనానో, ఆడి కేటెరుక?" "ఇడనుండి ఒగ్గేసి పోనికి, నాకు మనసు నేదనుకున్నాడా ఏటి" " నువ్వైనా కాస్త చెప్పోచ్చుకదే" అంటూ, ఓబులమ్మ వైపు చూసాడు మల్లయ్య., "పచ్చి ఉల్లిగడ్డ నంజుకు తింటున్న పెరుగన్నం రుచి ఆస్వాధిస్తూ". " ఏటి! ఇది మరీ బాగుంది" " ఆడూ నన్నే చెప్పమని, నువ్వూ నన్నే చెప్పమని, నేనేటి చెప్పేది! " " ఏదైనా! నీ ఇష్టమే గందా! ఏ నాడైనా నీ మాట కాదన్నానా ఏటి" " అనేసి తల వంచుకు ఉండిపోయింది ఓబులమ్మ" "నిజమేనే! మనసు సంపుకుని ఈ నిర్ణయం తీసుకున్నానే" " ఏటికి ఏటా! వర్షం తగ్గిపోతుంది! పంట దిగుబడి రాక, అప్పులు పెరిగి పోయి, ఓపిక కరిగిపోయిన మనసు తీసుకున్న నిర్ణయమే ఇది." " మరింకేటి చేయనేక" " సరేలే, ఏదైనా ఉంటే పొద్దుగల మాటాడేసుకుందమే, ఇక పడుకోయే" అంటూ చేతులు శుభ్రంగా కడిగేసుకుని, ఓ చుట్టముక్క ముట్టించేసి, ఓ పక్కగా ఉన్న నులక మంచం వాల్చేసాడు మల్లయ్య." "ఊరిలో తిరిగి తిగి అలసి పోనాడేమో, త్వరగా నిద్దరలోకి జారిపోనాడు"*****'' "ఓరేయ్! వీరబాబు, అయ్యపిలుతున్నాడు ఒక పరి ఇటు వచ్చిపో" " పెద్దగా కేకెట్టింది ఓబులమ్మ" " నేల మీద ఏదో కర్రముక్కతో ఫ్లాన్ల్ మీద ప్లాన్ల్ గీసేతున్న వీరబాబు అయ్య పిలుతున్నాడనగానే, చేతులు దులుపేసుకు, పరుగు పరుగున వచ్చి పక్కన కూర్చుండిపోయాడు." " ఏట్రా! ఇంకా నీ మనసు కుదుట పడినట్టు లేదే, రాతిరి సద్దికూడా సరిగా తిన్నట్టు లేదు." "ఓరే అయ్య! కొద్ది రోజుల అను బంధానికే నీకు ఇట్టా ఉంటే, ముప్పై సంవత్సరాల నుండి పెంచుకున్న అను బంధంరా నాది." "గుండెలు తరుక్కుపోతున్నాయి రా!" "అయినా తప్పదురా, ఇక్కడే ఉంటే నీ బతుకు కూడా ఇట్టా మట్టిలో మట్టి మనిషిగా మారిపోటమేరా, కాస్త నా మాటినుకోరా! నచ్చ చెప్పాలను కున్నాడు మల్లయ్య " " అయ్య...నీకులాగే మాతాత కూడా ఇలాగే అనుకోనుంటే, నువ్వు ఇక్కడ పెరగకుంటే, నాకు కూడా గీ నేలపై మమకారం కలిగేది కాదేమో"కదా? " ఎందుకో మనసు ఒగ్గటలేదే నీ మాటకి"అంటూ మనసులో బాధ బయటపెట్టే సాడు వీరబాబు". "నిజమేరా! " అప్పుడే మా అయ్య కూడా నన్ను పట్నం చదువుకోటానికి పోరా అయ్యా! అని ఎంతగా పోరుపెట్టినాడో, కానీ ఎందుకో మనసు ఇక్కడే ముడిపోనాది అదేంటో. " అందుకే మా అయ్య అనుకున్నట్టుగా నిన్ను చూసుకోవాలని ఆశరా" "పంటలు చూత్తే దిగుబడి లేదు, సకాలంలో వర్షాలు లేవు, ఎలా నెట్టుకు రావాలో అర్దమైతలే, అందుకే ఈ భూమి అమ్మేసి నీతో పాటు పట్నం వచ్చేసి, అక్కడే ఏదో పని చూసుకుంటే భాగనిపిత్తాందిరా" " అందుకే సెలక బేరం పెట్టిన, ఈ సంవత్సరం పంటలకు డబ్బుకూడ లేదాయే! మరేటి చేసేది" " అంటూ మనసులో దాచుకున్న బాధను కాస్త బయటకు తీసిండు మల్లయ్య. ****** " తూర్పున ఉదయ భానుడు స్వర్ణ కాంతులతో వెలుగుతున్నాడు," "చెట్ల కొమ్మలపై పక్షులూ సరి కొత్తగా జీవితం ఈ రోజే మొదలు అన్నంత సంతోషంగా గాలిలో ఎగురు తున్నాయి". "చిన్న కోడె దూడ సంతోషాలన్ని తనవే అంటూ చెంగ్ చెంగ్ న ఎగురుతుంటే. వాటినే చూస్తున్నాడు మురిపంగా వీరబాబు." " ఇన్ని సంతోషాలు ఎలా దూరం చేసుకోగలడు తను, అయ్య ఇనుకోడు, అమ్మకు చెప్పితే నానేటి చేయలేను"అనేసి గమ్మున ఉండి పొద్ది" ఏటి సేయాలో తెలియని పసితనమైపోయే వీరబాబుది". అదే అడగాలను కున్నాడు వీరబాబు. " దూరంగా దూడ కోసం తాడు పేనవేస్తున్న మల్లన్న దగ్గరకు అడుగులో అడుగేసుకుంటూ వెళ్లి దగ్గర నిలబడిపోనాడు వీరబాబు" " నీడ తన పై పడడంతో తల ఎత్తి చూసిన మల్లయ్య తో! "అయ్య.. ఈ నేల తల్లితో బంధం తెంపుకు ఎల్లటం అంత తేలికంటావా" అడిగేసాడు. చేతిలో ఉన్న తాడు, నార పక్కన పెట్టేసి, చేతులు దులుపు కుంటూ, "ఇలారా.. కుకో.." అంటూ పక్కన ఉన్న రెల్లుగడ్డి సరి చేసాడు మల్లయ్య . పక్కనే వచ్చి కూకోక తప్పలేదు వీరబాబుకు. . "చుడరా కన్న! ఇప్పుడు నువ్వు చూసే ఈనేల ఒకప్పుడు రాళ్లు రప్పలేరా." "మా అయ్య కష్టపడుతుంటే నే చూడలేకపోయేటోన్ని, అంత కష్టపడి నేలను గుల్లచేసి, సాగు భూమి చేసి నాచేతికిచ్చిన రోజు మా అయ్య కన్నులలో సంతోషం నే మరవలేదురా." "బిడ్డా.. నిన్ను మంచిగా చదివించుకోవాలనే నా కోరిక తీరకపోయిందిరా. " " నీకోడుకు నన్న మంచిగా చదివించరా"అంటూ ఈ నేల నిడిపోయిండు" "అటు వంటి నేలపై వ్యవసాయం రోజురోజుకు సమస్య గా మారిపోయే గందా!, " సకాలంలో వర్షం లేక, ఇంత పొలం ఒక్కడినే సాగు చేయలేక, బీడుగా మారుతున్న నేలతల్లి ని చూసి, ఇక తప్పదేమో తనకు మనకు ఋణాను బంధం అనుకున్నా" , అందుకే ఈ కాస్త అమ్మేసి నీతో పాటు పట్నం వచ్చి ఏదో ఒకటి చేసుకుందామని అమ్మా నేను ఒక నిర్ణయంకు వచ్చినాము రా" " "అంటూ చెప్పడం ఆపేసాడు మల్లయ్య రెండవ భాగం తదుపరి.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న