" తూర్పు కొండల్లో ఉదయ భానుడు స్వర్ణ కాంతుల్తో వెలుగుతున్నాడు," "చెట్ల కొమ్మల పై పక్షులు సరి కొత్తగా జీవితం ఈ రోజే మొదలు అన్నంత సంతోషంగా నింగిలోనికి ఎగురు తున్నాయి". "చిన్న కోడెదూడ సంతోషాలన్ని తనవే అంటూ చెంగ్ చెంగ్ న ఎగురుతుంటే. వాటినే చూస్తున్నాడు మురిపంగా వీరబాబు." " ఇన్ని సంతోషాలను ఎలా దూరం చేసుకోగలడు తను, అయ్య ఇనుకోడు, అమ్మకు చెప్పితే నానేటి చేయలేను"అనేసి గమ్మున ఉండి పొద్ది" ఏటి సేయాలో తెలియని పసితనమైపోయే వీరబాబుది". అదే అడగాలను కున్నాడు వీరబాబు. " దూరంగా దూడ కోసం తాడు పేనవేస్తున్న మల్లన్న దగ్గరకు అడుగులో అడుగేసుకుంటూ వెళ్లి దగ్గర నిలబడిపోనాడు వీరబాబు" " నీడ తన పై పడడంతో తల ఎత్తి చూసిన మల్లయ్య తో! "అయ్య.. ఈ నేల తల్లితో బంధం తెంపుకు ఎల్లటం అంత తేలికంటావా" అడిగేసాడు. చేతిలో ఉన్న నారతాడు, పక్కన పెట్టేసి, చేతులు దులుపు కుంటూ, "ఇలారా.. కుకో.." అంటూ పక్కన ఉన్న రెల్లుగడ్డి సరి చేసిండు మల్లయ్య . పక్కనే వచ్చి కూకోక తప్పలేదు వీరబాబుకు. . "చుడరా కన్న! ఇప్పుడు నువ్వు చూసే ఈనేల ఒకప్పుడూ రాళ్లు రప్పలేరా." "మా అయ్య కష్టపడుతుంటే నే చూడలేకపోయేటోన్ని, అంత కష్టపడి నేలను గుల్లచేసి, సాగు భూమి చేసి నాచేతికిచ్చిన రోజు మా అయ్య కన్నులలో సంతోషం నే మరవలేదురా." "బిడ్డా.. నిన్ను మంచిగా చదివించుకోవాలనే నా కోరిక తీరకపోయిందిరా. " " నీకోడుకుని మంచిగా చదివించరా"అంటూ ఈ నేల వదిలి పోయిండు" "అటు వంటి నేలపై వ్యవసాయం రోజురోజుకు సమస్య గా మారిపోయే గందా!, " సకాలంలో వర్షం లేక, ఇంత పొలం ఒక్కడినే సాగు చేయలేక, బీడుగా మారుతున్న నేలతల్లి ని చూసి, ఇక తప్పదేమో తనకు మనకు ఋణాను బంధం అనుకున్నా" , అందుకే ఈ కాస్త అమ్మేసి నీతో పాటు పట్నం వచ్చి ఏదో ఒకటి చేసుకుందామని అమ్మా నేను ఒక నిర్ణయంకు వచ్చినాము రా" " "అంటూ చెప్పడం ఆపేసాడు మల్లయ్య . ****** "అయ్య! " నువ్వనుకుటెతంగా పట్నం బతుకులు చల్ల గుండవే," "ప్రతిదీ డబ్బులుతోనే ముడిపడి ఉంటదే" "అన్నీ కల్తీలేనే, పాలు, నీళ్లు, చివరకు మనుషుల పలకరింపులు కూడా కల్తీ, కల్తీలేనిది ఏటీ లేదే అక్కడ." " నామాట ఇనుకోయే. "ఒకప్పుడు నీవొక్కడ వేనే, ఇప్పుడు నేను నీతోడు గుంటానే," " ఇద్దరం కలిసి చేద్థామే ఎగసగాయం, ఏటంటావ్, అలా గమ్మునుంటే ఎలాగే ఏటో ఒకటి చెప్పే," బతమాలసాగాడు వీరబాబు. "ఒరేయ్! వీరబాబా! " ఎగసాయమంటే మాటలు కాదురా, వంటిలోని పతి రక్తపుబోట్టు చెమటగా చిందించాలిరా, ఆకలి దప్పిక, అన్నీ మరచిపోవాలరా! ఆకాశం వేపు ఆశలు నింపుకుని, పాణాలను కాపాడమంటూ మొక్కుకుంటూ గడపడమేరా," "పంట పండించడం ఒకటైతే, దానిని మంచి రేటు వచ్చేవరకు నిల్వచేయడం ఒక ఎత్తురా." " మన దగ్గర శక్తి ఉంది పండించగలం, మరి దాపెట్టలేము గందా, నాకా శక్తి సన్న గిల్లుతుంది. నీకేమో ఏటీ తెలియదు. ఎట్టారా మనం కలసి ఎగసగాయం చేసేది. " " నువ్వు అనుకున్నంత సులువు కాదురా ఎదైనా," "ఈ బంజర భూమిలో మొలక మొలవడమే గగనమైపోయిందిరా, చిగురించే మొక్క పలకరింపు చూడక సంవత్సరం అయిందిరా!" " మొక్క పలకరిస్తే నా జవసత్వాలు ఒడ్డి మరీ ఈ బీడు భూమిలో దిగిపోతారా వీరబాబు." " కానీ అది కలమాత్రమేరా... ఇంతే రా మన బతుకులు.. ఆశగా ఆకాం వైపు చూపులు అంతే." " అంటూ గట్టిగా నిట్టుర్చాడు మల్లయ్య". **** తన పనుల్లో తాను మునిపోయాడు మల్లయ్య. "రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎన్నాలిలా కష్టాలు, పట్నం పోతే ఏదో ఒకటి చేసుకు బతికేయవచ్చు" అనే ఆలోచన బలంగా నాటుకు పోయింది మనసులో. అదే ప్రయత్నం లో ఉండిపోయాడు మల్లయ్య. " ఏదో ఒకటి చేసి అయ్య ఆలోచన మరల్చి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ, సొంత ఊరిలో ఉండిపోవాలనే ఆలోచన వీరబాబుది. వీర బాబు ప్రయత్నం ఆగలేదు, "ఉదయమే లేస్తాడు ఎక్కడి కెళతాడో ఏటో, సాయంత్రం మల్లయ్య వచ్చే సమయంకు ఇంట్లో ఉండి పోవడం దిన చర్యగా సాగుతుంది". ఒక నెల గడిచి పోయింది.. **** "ఒక రోజు ఉదయం... " అయ్య... నాతో మన చెలకదాక ఒక్కసారి రాయే,చివరి సారిగా చూసేసి ఇక రేపు పట్నం ఎల్లపోదామే. ఇక్కడ ఉండి మనం చేసేది ఏది లేదని తెలిసి పోనాదే" అంటూ మౌనంగా ఉండిపోయాడు వీరబాబు. " నాను అప్పుడే చెప్పాను గందా, ఇక్కడ మనం చేయనికి ఇక ఏటీ లేదని, " " సరే పదా.. ఒక్కసారి తృప్తిగా నేలతల్లిని చూసుకుని వచ్చేద్దాం" అంటూ. ముళ్ళుగర్ర అందుకని, నడకసాగించాడు మల్లయ్య. ***** "ఎదురుగా ఉన్నది చూసి నమ్మలేకపోతున్నడు మల్లయ్య , " తను చవుడు నేల అన్న చోట, బారులు బారులుగా, చిగురులు తొడిగి చిరునవ్వులు చిందిస్తూ జామాయిల్ మొక్కలు." " మరో పక్క.. కాస్త ఇసుక తట్టిన నేలలో, టమాటా, దోసకాయ తీగలు, మరో పక్క బెండకాయ మొక్కలు," " చిన్న నందన వనంలా ఉంది, ఒకప్పుడు చవుడు నేల అని తను వదిలేసిన నేల.." వీరబాబు వైపు విస్మయంగా చూశాడు మల్లయ్య.. "అయ్య.. నువ్వు చెప్పేటోడివి మనిషి మోసం చేస్తాడేమో కానీ, మనం నమ్ముకున్న నేల ఏనాడు మనకు లేని లోటు రానివ్వదని, "అదే నేను నమ్ముకున్న. " పంట పండలేదని దిగులు పడితే ఎట్టాగే, మరో మార్గం చూడాలా, కాలానికి తగ్గట్టుగా మార్పు చేసుకుంటారు ముందుకు సాగాల, రోజు రోజు కడవలతో నీళ్ళు అందిస్తేనే, నేలమ్మ ఇలా పచ్చని పంటను అందించడానికి సిద్దమౌతుంటే, మరి ఈ తల్లిని వదలి ఎలాగే ఎల్లగలం.." " చూడు చూడు, ఆ దోసతీగ చివరన పూసిన పువ్వ చూడు, ఎలా ఆశగా మనవైపు చూస్తుందో." " కడివడు నీళ్లు చాలు.. నేను ఎదిగి నిన్ను ఆదుకుంటానంటుంది." " ఇది నీకు తెలియదని కాదు, కాలంకు అనుగుణంగా మన వ్యవసాయ విధానం కూడా మారాలని," నేలను అనుసరించి పంట సాగు చేయాలి." "నువ్వు ఒప్పుకుంటే, నా చదువుకు బ్యాంక్ లోనిత్తది, ఒక బావి తీయించుకుని, ఓ చిన్న ట్రాక్టర్ తీసుకుంటే, మరో పదేళ్లలో అప్పులు అన్నీ తీర్చేసి.. మనతో మరో పదిమందికి పని చూపిస్తూ ఇక్కడే బతికేయవచ్చు, ఏటంటావ్" అంటూ మల్లయ్య వైపు చూశాడు విరబాబు. "మారు మాటాడకుండా ముందుకు సాగుతున్న అయ్యను చూస్తున్న వీర బాబు ముఖం వికశించింది. మల్లయ్య కడవతో. మొక్కలకు నీళ్లు పోస్తూ.. ప్రేమగా వాటివైపు చూస్తున్నాడు.. ముసిముసిగా నవ్వుతూ తల ఊపుతుంది బెండచెట్టు.. ఇక పట్నం ఊసు రాదుకదా నీకంటూ *శుభం*