అవంతిరాజ్యాన్ని గుణశేఖరుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.అతని మంత్రి సుబుధ్ధి వృధ్ధాప్యంతో ఉన్నందున కొత్తమంత్రిని ఎంపికచేసి కొద్దిరోజులు పరివేక్షించే బాధ్యత సుబుధ్ధికే అప్పగించాడు గుణశేఖరుడు.
ఈవిషయం రాజ్యం అంతటా దండోరా వేయిచాడు. మంత్రిపదవికొరకు వచ్చిన వారందరిని పరిక్షించి ఐదుగురిని ఎంపికచేసి వారిని రాజ సభలోప్రవేశపెట్టి " నాయనలారా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగినవారికే మంత్రి పదవి లభిస్తుంది " అని మొదటి యువకునివద్దకు వెళ్ళ " నాయనా ఒకతోటలో ఇద్దరు తండ్రులు, ఇద్దరు కుమారులు పనిచేస్తున్నారు. వారు భోజనం చేయడానికి ఎన్ని అరటి ఆకులుకావాలి ?"అన్నాడు. " మంత్రివర్య తమరే చెప్పారు ఇద్దరు తండ్రులు,ఇద్దరుకుమారులు అని కనుక నాలుగు అరటి ఆకులు వారికి కావాలి " అన్నాడు మెదటి యువకుడు. " తప్పు " అన్నమంత్రి సుబుధ్ధి రెండోయువకునివద్దకు వెళ్ళి " ఆవు ఎలాఉంటుంది? " అన్నాడు.
" మంత్రివర్య నలుపు ,తెలుపు ,గోధుమవన్నెలో ఉంటుంది ,నాలుగు కాళ్ళు, రెండుచెవులు,తోక,పాలపొదుగు కలిగిఉంటుంది " అన్నాడు.
" తప్పు " అన్నమంత్రిసుబుధ్ధి ,మూడో యువకుని వద్దకువెళ్ళి " చెరువు ఎలాఉంటుంది "? అన్నాడు. " వర్షాకాలంలో నిండుగాను, వేసవిలో కొంతనీరుకలిగి ఉంటుంది " అన్నాడు ఆయువకుడు.
" తప్పు " అన్న మంత్రి సుబుధ్ధి నాలుగో యువకునివద్దకువెళ్ళి
" రాముడు,భీముడు , పోతూ ఉండగా వారికి మూడు జామకాయలు లభించాయి వాటిని వారు ముక్కలు చేయకుండా ఎలా పంచుకు తినాలి ?" అన్నాడు. జామకాయలను ముక్కలు చేయకుండా వారు తినడం అసాధ్యం " అన్నాడు. " తప్పు "అన్నమంత్రిసుబుధ్ధి, అయిదవ యువకుని వద్దకు వెళ్ళి " నాయనా ఈనలుగురిని అడిగిన ప్రశ్నలలో నువ్వు దేనికైనా ఒకప్రశ్నకు సమాధానం చెప్పగలవా? " అన్నాడు.
"పాలకులైన ప్రభువులు, పెద్దలు తమరు అనుమతిస్తే నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను " అన్నాడు ఆయువకుడు.
చిరునవ్వుతో తలఊపాడు రాజుగుణశేఖరుడు. " ఏది నాలుగు ప్రశ్నలకు సమాధానాలు సభాసదులు అందరికి అర్ధమైయేలా వివరించు " అన్నాడు మంత్రి.
" అయ్య మొదటి ప్రశ్నఇద్దరు తండ్రులు,ఇద్దరుకుమారులు. ఆతోటలో సోమయ్య అతని కుమారుడు చంద్రయ్య లతోపాటు చంద్రయ్య కుమారుడు లక్ష్మయ్యకూడా పనిచేస్తున్నాడు.సోమయ్య, చంద్రయ్య ఇద్దరు తండ్రులు,అలాగే సోమయ్యకుమారుడు చంద్రయ్య అతని కుమారుడు లక్ష్మయ్య అనే ఇద్దరుకుమారులు ఉన్నారు.అంటే వెరసి వాళ్ళు ముగ్గురే కనుక వారికి మూడు అరటి ఆకులు చాలు " అన్నాడు.
సభలో కరతాళధ్వనులు వినిపించాయి. " రెండో ప్రశ్న ఆవుఎలాఉంటుంది? పలుపు కట్టేవంటిదానికి కట్టివేస్తేనే ఆవు అక్కడే ఉంటుంది" అన్నాడు. ఆనంద కేరింతలలో సభవిల్లివిరిసింది. "మూడవ ప్రశ్న కట్టవేస్తేనే చెరువు ఉంటుంది " అన్నాడు. సభలో నవ్వులు వినిపించాయి.
" నాలుగోప్రశ్న రాముడు, భీముడు,పోతూ అనేముగ్గురు వెళుతుంటే మూడుజామకాయలు లభించాయి తలాఒకటి పంచుకుతిన్నారు " అన్నాడు. "నాయనా నీకుచివరి ప్రశ్న బావిలో నీతలపాగావేసి నీవు పడుకోగలవా? " అన్నాడు మంత్రి." అలాగే పదండి అని రాజుగారి ఉద్యానవనంలోనిబావి వద్దకువెళ్ళితన తలపాగాబావిలోవేసి బావిగట్టుపై పడుకుని "తమరు తలపాగా బావిలో వేసి పడుకోగలవా? అన్నారు. తలపాగపైన పడుకోమనలేదుగా! అన్నాడు.అక్కడ ఉన్నవారంతాఅతని సమయ స్పూర్తికి అభినందించారు .ఆయువకుని
నూతన మంత్రిగా నియమించాడు గుణశేఖరుడు.