కోతిబావ కిచకిచలు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kothi bava kichakichalu

" అల్లుడూ అడవిఅంతా తిరిగి రేపు రాజుగారి పుటట్టినరోజుకు బహుమతులుఇచ్చి రెట్టింపు బహుమతులు పొందమని చాటింపు వేయడంతో బాగా అలసిపోయాను బాగా దాహంగాఉంది కొద్దిగానీళ్ళు ఇవ్వు "అన్నాడు కుందేలు.

కొద్దిసేపటికి కొబ్బరిబోండాం తెచ్చిఇచ్చినకోతి "మామా కొబ్బరి

కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు బదులుగా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది.నీఅలసట క్షణాలలోమాయమౌతుంది "అన్నాడుకోతి.

" అటవిశాఖ అధికారి వాళ్ళపిల్లలకు చెపుతున్న విషయాలు బాగానే గుర్తుఉంచుకున్నావు. రేపుఉదయం రాజుగారి పుట్టినరోజు బహుమతి ఇచ్చి,ఆయన ఇచ్చేబహుమతి పొందు "అన్నకుందేలు తనబొరియకు బయలుదేరాడు. అడవి అంతాగాలించిన కోతి ఏమిదొరకకపోవడంతో దారిలో కనిపించిన చిన్నరేగిపండు తీసుకుని ఆరాత్రి అందరికన్నాముందు రాజుగారిదర్శనం పొందాలని సింహరాజుగుహముందేఉన్నచెట్టుపైన నిద్రపోయాడు.

తెల్లవారుతూనే రాజుగారి దర్శనానికి తొలివాడిగా నిలబడ్డాడు. రాజుగారు గుహలోనుండి వెలుపలకు రావడంతోనే నమస్కరించిన కోతి వినయంగా చేతిలోని రేగిపండు సింహరాజు ముందు ఉంచాడు. అదిచూసిన సింహరాజు

కోపంతో మండిపడుతూ " ఎవరక్కడ ఈకోతికి నాలుగు తగిలించి ఈరేగిపండును వాడి చేతే మింగించండి "అన్నాడు. అదివింటూనే రాజుగారికి సమీపంలో రక్షకభటులుగా ఉన్నఎలుగుబంట్లు రెండు చేతిలోని చింతబరికతో కోతికి నాలుగుతగిలించి ఆరేగిపండును కోతినోట్లో పెట్టి బలంగా రెండు మొట్టికాయలు వేసారు. రేగిపండు మింగిన కోతి నేలపైపడి దొర్లుతూ ఎగిరి ఎగిరి పడుతూ సంతోషంగా కిచకిచలాడ సాగాడు. కోతి అంతగా ఎందుకు నవ్వుతుందో అక్కడ ఉన్న జంతువులకు అర్ధంకాలేదు. " ఏయ్ కోతి నీకేమైనా పిచ్చిపట్టిందా? ఎవరికైనా దెబ్బలు పడితే విలవిల లాడిపోతారు నువ్వేంటి కిలకిలలాడుతున్నావు "అన్నాడు సింహరాజు. "వాడంతే చలికాలంలో రాత్రులు ఏ.సి.గదిలో ఐస్ క్రీం తినేరకం "అన్నది పిల్లరామచిలుక.

పిల్లరామచిలుకవంక ఉరిమిచూసిన కోతి "ప్రభూ నేనుతెచ్చింది రేగిపండుకనుక సులభంగా తన్నిమింగించారు ,నావెనుక బహుమతితో వచ్చే గాడిద అన్న గుమ్మడిపండుతో ఉన్నాడు అతని పరిస్ధితి ఏమిటా అని నవ్వుతున్నాను "అన్నాడు కోతి. కోతిమాటల విని అక్కడ ఉన్న జంతువులన్ని ఫక్కున నవ్వాయి. వాటితో కలసి నవ్విన సింహరాజు

కోతి చమత్కారానికి మెచ్చి మోయగలిగినన్ని పలురకాలపండ్లు ఇచ్చి కొతిని సాగనంపాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న