ప్రేమానందం - తాత మోహన కృష్ణ

Premanandam

రాత్రి 10 అయ్యింది. టీవీ లో సినిమా వస్తుంది. ఎదురుగా, సోఫా లో నేను కూర్చున్నాను. పక్కన, నా అందమైన శ్రీమతి నా వొళ్ళో పడుకొని టీవీ చూస్తుంది.

గుండ్రటి మొహం, చామన ఛాయా రూపం. చక్కటి ఎద సౌందర్యం ఆమె సొంతం. నైటీ వేసుకొని, నా వొళ్ళో పడుకొని, ప్రేమగా కబుర్లు ఆడుతోంది! నా ప్రేమ!

ఈ లోపు సినిమా లో ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది.

"ఏమండీ! కదలకండీ!"

"నేను ఎక్కడ కదిలానే!"

"నీకు విషయం తెలియదా ప్రేమా!"

"ఇలాగ నైటీ వేసుకొని వొళ్ళో పడుకొని, టీవీ చూస్తూవుంటే, ఈ టైం లో, మరి ఏమౌతుంది చెప్పు ప్రేమా!"

వెంటనే లిప్ కిస్ పెట్టేసి, బెడ్రూమ్ లోకి ఎత్తుకొని వెళ్ళడానికి రెడీ గా ఉన్నాను.

"ఏమండీ! సినిమా చూద్దాం కొంతసేపు ఆగండీ!"

"నీకు ఇంకా మంచి సినిమా చూపిస్తా పద!" అన్నాను.

ప్రేమ వోరగా చూసి ఒక నవ్వు నవ్వింది. ట్రైన్ కి సిగ్నల్ వచ్చినట్టు, నాకూ వచ్చింది.

అలా బెడ్రూమ్ లోకి వెళ్లే లోపే ఇద్దరం ముద్దులతో తడిసిపోయాము. బెడ్రూమ్ లో మంచి మసాలా సినిమా సెకండ్ షో స్టార్ట్ అయ్యింది.

ప్రేమ చాలా మంచి అమ్మాయి. నన్ను ఇష్టపడి పెళ్లిచేసుకుంది. నాకు నచ్చినట్టుగా అన్ని వండి పెడుతుంది. నా అభిరుచికి తగ్గట్టు నడచుకుంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. సరసం తెలిసిన శ్రీమతి కూడా.

పెళ్ళై 6 నెలలు అయ్యింది. ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకొని ఉంటున్నాము. నాది వర్క్ ఫ్రొం హోమ్ ఎక్కువ, అందుకే మా ఇద్దరి సరదాలు, ఆనందాలు కూడా ఎక్కువే.

నేను చూడడానికి ఛామన ఛాయా గా ఉంటాను. మంచి ఉద్యోగం. కల్మషం లేని మనసు. అన్నిటికి మించి, ప్రేమంటే చాలా ఇష్టం. ఇవన్నీ, చూసే కాబోలు, ప్రేమ నన్ను ఇష్టపడింది. నేను కూడా, అప్పుడప్పుడు ఇంట్లో వంట పనిలో, ప్రేమకు సాయం చేస్తాను. ప్రేమకు ఇబ్బంది రోజుల్లో అయితే, స్వయంగా నేనే వంట చేసి వడ్డిస్తాను.

ప్రేమ తో ఉంటే నా మనసు కు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే చాలా అదృష్టవంతుడను అనుకుంట. పెళ్ళైనప్పటి నుంచి, ప్రేమ ఎప్పుడూ రాత్రి పాలగ్లాసుతో నే గదిలోకి వచ్చేది.

ఎందుకు అంటే?

"మనకి ప్రతి రోజూ ఫస్ట్ నైట్ లాగా ఉండాలి" అంటుంది. రోజూ రాత్రి చాలా రొమాంటిక్ గా ఉంటుంది మాకు.

ఒక రోజు ప్రేమ కొంచం మూడీ గా ఉంది బెడ్రూమ్ లోకి వచ్చేటప్పుడు.

"ఏమైంది ప్రేమా!" అలా ఉన్నావు?

"మొన్న మనం సినిమా కి వెళ్ళాం కదా, అందులో హీరోయిన్ ని అదే పనిగా చూస్తున్నారు మీరు, నా మాట కూడా వినకుండా? నిజం చెప్పండి! నాకన్నా ఆ హీరోయిన్ అందంగా ఉందా?"

ప్రేమ దీనంగా నా వంక చూస్తూ, "నా దగ్గర లేనివి ఆ హీరోయిన్ కి ఏమున్నాయో! చెప్పండి?" . చెప్పాలంటే ఆ హీరోయిన్ బక్క పల్చగా ఉంటుంది.

"ఓ బంగారం! అదా నీ అలక! సినిమా కి డబ్బులిచ్చి టికెట్ కొంటాం, అందుకే చూస్తాం.
నీ కన్నా నాకు ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు. నీతోనే నాకు ఆనందం. నువ్వే నా జీవితం డియర్!"

"నేను చాలా అదృష్టవంతురాలిని కదండీ! నన్ను ఇంతగా ప్రేమించే భర్త దొరికాడు."

"చూడండీ! నా బ్రా హుక్స్ పట్టట్లేదు. కొత్తవి ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మన రొమాన్స్ ఎక్కువ అయిపోయింది మరి!"

"అలాగే లే తెప్పిస్తా".

"మంచం కూడా టైట్ చేయించండి. ప్రతి నెలకి లూజ్ అయిపోతుంది".

"అలాగే ప్రేమ! మరీ అలాగా అన్నీ చెప్పకు. దిష్టి తగుల్తుంది నా ప్రేమకి!"

"ఏమండీ! వచ్చే వారం మనం పెళ్ళికి వెళ్ళాలిగా. సెలవు పెట్టండి. కొత్త ఊరు. కనీసం త్రీ డేస్ లీవ్ పెట్టండి. అసలే దగ్గర చుట్టాలు కదా!"

అనుకున్న ప్రకారం, పెళ్ళికి బయల్దేరారు. ట్రైన్ లో ఫస్ట్ ఏసీ బుక్ చేసాడు వంశి. అసలే ప్రేమ రాత్రి పక్కన లేకుండా నిద్ర పట్టదు కదా మరి!

పెళ్లి మండపానికి చేరుకున్నారు ఇద్దరూ.

"ఏమండీ అల్లుడుగారు!" ఎలాగ చూసుకుంటున్నారు మా అమ్మయిని?

"బాగా చూసుకుంటున్నాను! గట్టిగా పట్టుకొని రోజూ!"

అల్లుడు బాగా రసికుడు లాగా ఉన్నాడు. అమ్మాయి అదృష్టవంతురాలు.

ఈలోపు వంశీ మరదలు అటుగా వచ్చి, "బావగారు! ఎలా ఉన్నారు? మీకోసం రెండు పళ్ళు తెచ్చాను. తీస్కోండి".

"నీ పళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాకు బాగా ఆకలి వేస్తుంది. వద్దు".

అటుగా ప్రేమ వచ్చింది. "ఏమండీ! నా పళ్ళు తీస్కోండి".

"ప్రేమా! నీ పళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. థాంక్స్ శ్రీమతిగారు!"

"మీ ఆకలి గురించి నాకు తెలియదా? శ్రీవారు!"

"బావగారు! ఇది చాలా అన్యాయం. ఎప్పుడూ అక్క పళ్ళు కావాలా? మావి వద్దా?"

ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. వంశీ ప్రేమ వెనుకే వెళ్ళిపోయాడు.

ప్రేమ కి వంశీ మీద ఎంత ప్రేమంటే, ఎవరైనా తన భర్తని ఒక్క మాటంటే చాలు, వాళ్ళని ఎదిరిస్తుంది ప్రేమ. బాడీగార్డ్ అనమాట!

పెళ్లి బాగా జరిగింది. రాత్రి ఆడవారంతా ఒక చోట పడుకున్నారు. వంశీ కేమో నిద్ర రావట్లేదు. ప్రేమా! ప్రేమా! అని కలవరిస్తున్నాడు.

అంతా చీకటి. బయట స్ట్రీట్ లైట్ లోంచి కొంచం వెలుతురూ లోపలికి వస్తుంది. ప్రేమ ఎక్కడుందో తెలియదు. అందరూ నైటీ లు వేసుకొని పడుకున్నారు.

నడుస్తున్నపుడు ఎవరో కాలు తగిలి, ఒక ఆంటీ మీద పడ్డాను.

"ఏమండీ రండి!" అని ఆంటీ గట్టిగా పట్టుకుంది వంశీ ని. వాళ్ళ అయన గుర్తొచ్చాడో ఏమో మరి!

వంశీ ఎంత రసికుడైనా వేరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు. ఎలాగో తప్పించుకొని బయట పడ్డాడు.

ఇదంతా ప్రేమ చూస్తున్నది. మా అయన మంచి వాడనుకొని మనసులో ఆనందపడింది. వేరే వాళ్ళైతే సిట్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకునే వారు కదా మరీ!

ప్రేమ కి వంశీ పరిస్థితి అర్థమైంది. వంశీ చేయి పట్టుకొని మేడ మీదకు తీసుకొని పోయింది.

ఎవరూ లేరు చుట్టుపక్కల. ప్రేమ వంశీ కి ముద్దు పెట్టి, వోరగా చూసి ఒక నవ్వు నవ్వింది. సిగ్నల్ వచ్చేసింది. ఇద్దరూ, చాలా సేపు సరస సల్లాపాల్లో తేలియాడారు.

ప్రేమ ప్రతి విషయంలో, వంశీ కి సహాయ సహకారాలు అందించేది. ఇద్దరూ పరస్పరం ప్రతివిషయం లో ఒకే అంగీకారం కి వచ్చేవారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనేది లేదు. ఎవరి ఆలోచన బాగుంటే, వారిది పాటించేవాళ్ళు - ఇంట్లో అయినా, బయట అయినా, బెడ్రూమ్ లో అయినా!

జీవితాంతం, వంశీ, ప్రేమ ను ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నాడు. వయసు పెరుగుతున్నా, వారి మధ్య ప్రేమ తగ్గకుండా జీవితం సాగింది. ప్రేమ తోనే వంశీకి ఆనందం.

అందుకే ప్రేమానందం.

ప్రతీ జంట, ఇలాగే, ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. ప్రేమా - అనురాగాల నడుమ, ఈర్ష్య - ద్వేషాలకు తావు లేకుండా, హ్యాపీ గా ఉండాలి.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న