సుగుణ - విద్యాధర్ మునిపల్లె

Suguna

ఒకరోజు నేను ఆఫీసుకు బయల్దేరుతుండగా టెలిగ్రాం వచ్చింది. సంతకం పెట్టి చేతిలోకి తీసుకొని చదువుతుంటే......నా కాళ్ళక్రిందనేల కంపిస్తున్నట్లు అనిపించింది. ఏం చెయ్యాలో క్షణంపాటు అర్ధంకాలేదు. కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. చుట్టూ ఉన్న వస్తువులన్నీ బూజరబూజరగా కనిపించాయి. తల తిరిగిపోతోంది. చిన్నగా కుర్చీలో కూలబడ్డాను........

-----------------------

నేను ఒక ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పని చేస్తున్నాను. తమ్ముడు కృష్ణారావు. మా తాతగారి పేరే వీడికి ప్టోరు. అదే మేంచేసిన తప్పేమో! ఆయన కాలంలో సంఘసంస్కరణలు చేస్తే , వీడిప్పుడు ఆయనగారి బాటలోనే సంఘాన్ని సంస్కరించాలని బయల్దేరాడు. పైసా సంపాదించకపోగా సంస్కరణల పేరుతో ఇంిచుట్టూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పోలీసుల్ని తిప్పటం.... ఎవరు పడితే వాళ్ళు ఇంికి రావటం.... వీికి తోడు ఇరుగు పొరుగులు గుసగుసలు....పరువుగా ఇంో్ల ఉంటూ గుట్టుగా కాపురం చేస్తూ గౌరవంగా బ్రతికే మమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తున్నాడు.....అందుకే ఒక రోజు

'' ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో..... ఆ తర్వాత సంఘంగురించి ఆలోచిద్దాం.... ఎన్నాళ్ళని నేను పోషించను నిన్నూ నీ పెళ్ళాంపిల్లల్ని.... సంఘసంస్కరణ కూడుపెట్టదురా.... పనిచేస్తేనే నాలుగు వేళ్ళు నోిదాకా వెళ్ళేది....'' అంటూ వాణ్ణి మందలించాను. మాటా మాటా పెరిగింది. ఆవేశంగా వాడు ఇల్లొదిలి సమాజోద్ధరణకు వెళ్ళానికి సిద్దపడ్డాడు....వాడి వెంటే వాడి భార్య సుగుణ,వాడికూతురు....రోజుల పిల్ల ఇంకా పేరుపెట్టలేదు......

'' అమ్మా ! సుగుణ. వాడిని నీకిచ్చి కట్టబ్టెిన పాపానికి , వాణ్ణే నమ్ముకొని వెళుతున్నావా.... ఇది నీ ఇల్లు ..... పెళ్ళి చేస్తేనన్నా మారతాడనుకున్నా....నాకిక నమ్మకం నసించింది...వాణ్ణి వెళ్ళనీమ్మా....'' అంటూ బ్రతిమాలాను. తన భర్తతోడిదే తనజీవనమంటూ వాడితో వెళ్ళిపోయిందాపిల్ల...

సంసారంకన్నా సమాజ సంస్కరణల పట్ల ఆసక్తి గల కృష్ణారావు ఇంో్ల పెళ్ళాం పిల్లల్తో కన్నా బయి వారితోనే ఎక్కువగా గడిపేవాడు. ఎప్పుడింకి వస్తాడో తెలీదు.....అతని మూలాన పైసాసంపాదనలేదు. కుటుంబపోషణ చాలా భారంగా వుంది. అయినా సుగుణ అతన్ని పల్లెత్తుమాట అనలేదు. మొద్లో ఒంిమీద నగలమ్మి ఇల్లుగడిపింది. తన భర్తకు భాద్యత తెలియచెప్పే ప్రయత్నాలు చేసింది. ప్రయోజనం శూన్యమనిపించింది. అందుకే నాలుగిళ్ళల్లో పనులు చేసి భర్తనీ,కూతుర్నీ పోషిస్తోంది. వేళకి తిండిదొరుకుతుందనే కానీ, ఆ తిండి ఎక్కడినుండి వస్తోందోనన్న ఆలోచనే వీడికి కలుగలేదు. ఆలోచించే తీరికా లేదు. ఎప్పుడు చూసిన ఉపన్యాససభలు, ధర్నాలు వండి వాితోటే అతని రోజులు గడిచిపోతున్నాయి. ఒకసారి వాడు ఇంికి రాలేదుట.....సుగుణ ఖంగారుపడుతూ అందర్నీ అడుగుతూ కంప్ల్‌ైం ఇద్దామని పోలీసు స్టేషన్‌కు వెళ్తూ , ఆఫీసు పనిమీద బ్యాంకు కెళుతున్న నాకు ఎదురైంది. విషయం తెలుసుకొని నేనూ ఆమెతో కలిసి స్టేషన్‌కు వెల్తే కటకాలు లెక్కబెడుతూ కనిపించాడు.....నేనే ఎలాగో విడిపించాను.....సుగుణ చేతులెత్తి నమస్కరించబోతే నేనే వద్దన్నాను. '' ఇంక మీదన్నా బుద్ధితెచ్చుకొనుండు'' అని మందలించాను. కనీసం వాడు నాతో ఏమీ మ్లాడలేదు.... మ్లాడాలని వాడికి అనిపించలేదేమో.........అలాగే వెళ్ళిపోయాడు......
కొన్నిరోజులకి మళ్ళీ ఇదే తంతు....ఎవరో చెబితే తెలిసింది సుగుణకు....రోడ్డుమీద జనాన్ని పోగుచేసి విప్లవగీతాలు పాడినందుకు పోలీసులు అరెస్టుచేశారని. మళ్ళీ సుగుణ వాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టుకొని కృష్ణారావుని విడిపించి తెచ్చిందట... నాకు విషయం తరువాత తెలిసింది....బంగారమిం పిల్లను బడుద్దాయిలాిం వాడికిచ్చి పెళ్ళిచేసి అనవసరంగా ఆమె గొంతుకోశానని నాకు అనిపించింది.....ఇప్పుడిలా బాధపడి ప్రయోజనం శూన్యం .........
ఇలా ఎన్నోసార్లు వాడిని పోలీసులు అరెస్టు చెయ్యటం,నేనో.....సుగుణో విడిపించి తీసుకెళ్ళటం.....కొన్ని రోజులకు ఇద్దరికీ విసుగు వచ్చింది......కృష్ణారావు ఇంిముఖం చూసి రెండునెలలు. మళ్ళీఈరోజు ఇంికి వచ్చాడు. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావని అడిగేధైర్యం ఆమెకు లేదు. ఎక్కడున్నాడో చెప్పే ఉద్దేశ్యం ఇతనికి లేదు. కృష్ణారావు ఏకాంతంగా గదిలో కూర్చొని వున్నాడు....సమయం పన్నెండు గంటలు.....గదిలో లైటు వెలుగుతోంది......
'' నేను నమ్మిన సిద్దాంతాలు కూికి,గుడ్డకి కొరగావని అన్నయ్య అన్న మాటలు ఇప్పుడు అక్షరసత్యాలు అనిపిస్తున్నాయి. మహాత్ముల సిద్దాంతాల్ని ఆచరణలో ప్టిె సంఘసంస్కరణోద్యమం చేప్టినందుకు, చివరకా సంఘమే నన్ను దోషిగానూ, విప్లవవాదిగానూ చిత్రించింది. మహాత్ముల మాటలకు, చూపించిన బాటలకు కాలమేనాడో చెల్లిపోయి, వాికి వక్రభాష్యాలు వెతికే రోజులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకునే సరికి సమయం మించిపోయింది.....''అంటూ కాగితం మీద రాసుకుంటుండగా.......ఎవరో బైినుండి కృష్ణారావుగారూ అంటూ పిలిచారు. కాగితం పక్కన ప్టిె బయటకు వెళ్ళిన అతను ఆ రాత్రి అంతా ఇంికి రాలేదు..... దూరంగా ఎక్కడో తుపాకీ మోత వినిపించింది......మరునాి పొద్దునే సుగుణకు తెలిసింది తనభర్తనెవరో కాల్చి చంపారని..........
-----------------
''బ్రదర్‌ డెడ్‌ స్టార్‌ ఇమ్మీడియ్‌లీ''. మెల్లెగా కుర్చీలోంచి లేస్తూ నా భార్య అపర్ణని పిలిచి విషయం చెప్పాను. వాడి భార్య,కూతురు (పేరు కృష్ణవేణి)ని ఇంికి తీసుకొద్దామనుకుంటున్నాను.ఇదే విషయం అపర్ణతో చెబితే ఆమె ఒప్పుకోలేదు. '' ప్రస్తుతం ఆ పల్లికు మనంతప్ప మరెవరున్నారు'' అని బ్రతిమాలి చూశాను. నా కొడుకు దిలీప్‌ని గడపకడ్డంగా పడుకోబ్టెి దాి వెళ్ళి వారిద్దర్నీ ఇంికి తెచ్చుకోమంది.నేను తనకు నచ్చచెప్పాలని చూశాను.ఉరేసుకొని చస్తానని బెదిరించి తన తమ్ముడికి ఫోన్‌ చేసి పిలిపించే ఏర్పాట్లు చేస్తోంది.......
దానిమాట కాదని నిర్ణయం తీసుకొనే ధైర్యంనాకు లేదు. '' చిం పిల్లను పెట్టుకొని బర్తలేని ఆపిల్ల ఎన్ని పాట్టు పడుతుందో కదా భగవంతుడా!'' అనుకుంటుండగా నా బావమరిది రంగనాధం ఉన్నట్లుండి ఊడిపడ్డాడు. వాడిఅక్క అపర్ణకి అన్యాయం చెయ్యాలని చూస్తే సహించేది లేదన్నాడు. '' సుగుణని, ఆమె కూతుర్ని ఇంికి తెచ్చే ప్రయత్నం చేస్తే అక్కమొగుడువని కూడా చూడను....ప్రాణాలు తీసేస్తా'' అని వార్నింగ్‌ ఇచ్చాడు నాకు.
'' బంగారంలాిం సుగుణని వాడికిచ్చి పెళ్ళి చేసి ఆ పిల్ల భవిష్యత్తుని నా చేతులారా నాశనం చేశాను. ఆ పాపం నన్ను ఊరికే వదలదు. భర్త చచ్చిపోయింతర్వాత ఆ పిల్ల ఎటుపోతుంది. మనం తప్ప ఆపిల్లకు ఎవరున్నారు...'' అని రంగనాధాన్ని అడిగాను.
'' మీరన్నది నిజమే....కానీ ఇప్పుడామెను ఇంికి తీసుకొస్తే మనిళ్ళచుట్టూ పోలీసులు తిరుగుతుాండు. అయినా ఒక విప్లవవాది పెళ్ళాన్ని ఇంో్ల పెట్టుకుంటే మనపరువేంకావాలి...పైగా వాడు చచ్చింది ఎన్‌కౌంటర్‌లో.....'' అన్నది అపర్ణ.
'' చనిపోయినవాడు స్వయానా నాకు తమ్ముడే.....అయినా వాడు చచ్చిపోయింది పోలీసుల ఎన్‌కౌంటర్లో కాదు...''
'' ఎలాగోలా చచ్చాడు. అన్న అన్నబంధమేనాడో కాదనుకోని ఇల్లువదిలెల్లాడుగా......'' అన్నాడు రంగనాధం....
'' ఎందుకు వెళ్ళాడు....సంఘసంస్కరణలకోసం.... వీడు జనానికి జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగంగా గొంతెత్తి చెప్పి, సంఘంలో సంస్కరణలు తీసుకు వద్దామని వెళ్ళాడు. వాడికి మీరిచ్చిన బిరుదు విప్లవవాది. వాడు చెప్పేదితప్పు కాదు, చెప్పే పద్దతిలో చెప్పలేదు. అందుకే వాడొక విప్లవవాదైనాడు.''
'' ఇంతకు నువ్వనేదేిం బావా....'' గంభీరంగా అన్నాడు రంగనాథం.......
'' చెప్పానుగా.....సుగుణని, ఆమె కూతుర్ని ఈ ఇంికి తీసుకు వస్తున్నా......'' అన్నాను......
'' ఆ మాటే వద్దంటున్నా...ఇంతమంది చెపుతున్నా మళ్ళీ వాళ్ళనింకి తెస్తానాంరిేం..'' అంటూ అపర్ణ నామీదకు లేచింది.......
'' వాళ్ళనింకి తెస్తే నీకు ఇబ్బందేిం?''
'' ఇబ్బంది కాక...మరిేం? వాడి పెళ్ళాన్నింకి తెస్తే వాణ్ణి కాల్చిన వాళ్ళు రేపు ఇంో్ల వుంచుకున్నందు మిమ్మల్ని కాలుస్తారు....'' అంటూ ఒక్క సారిగా కుండబద్దలు క్టొినట్లు చెప్పింది.....
'' సంతోషంగా బలౌతా.......మీరనే ఈ విప్లవ వాది కడుపున పుట్టటమేనా వాడికూతురు చేసిన నేరం....మీరనే ఆ విప్లవవాదిని పెళ్ళిచేసుకోవటమేనా సుగుణ చేసిన నేరం.....పెళ్ళిచేసుకున్న సుగుణ, కడుపున పుట్టిన కృష్ణవేణి ఇద్దర్నీకూడా నేరస్తులుగా మీరు భావించినట్లైతే వారికన్నా మొట్టమొదట పెద్దనేరస్తులం మనం అవుతాం అపర్ణ......ఎందుకంటే పెళ్ళి చేస్తే మారతాడంటూ పీటలమీద కూర్చొని వారిద్దరి జీవితాలకి ముడిపెట్టిన మనిద్దంరంకూడా దోషలమే....! ఎవరో పరాయి వాళ్ళ మాటలు పట్టుకొని అమాయకులైన వారిని వెలివేయటం మంచిదికాదు....రెడీ అవ్వు వెళ్ళి వాళ్ళను తీసుకు వద్దాం......''అన్నాను. నిజమేనన్నట్లుగా తలవూపుతూ బయల్దేరింది. రంగనాధం మమ్మల్ని అనుసరించాడు........
'' ఇలా ఎందరో సుగుణలాంటి బాదితులీ సమాజంలో వున్నారు. వారివారు ఒక్కసారి ఆలోచించండి.....

---------------------------

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న