ప్రియవ్రతుని సంతతి - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Priyavrathuni santathi

స్వయంభువ మనువు శతరూపని వివాహమాడాడు . అతనికి ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు మరియు ఆకూతి, దేవహూతి మరియు ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు . వీరిలో ప్రసూతి దక్షుడిని వివాహంచేసుకుంది.వారికి ఇరవై నాలుగుమంది కుమార్తెలు.ఇందులో శ్రధ్ధ,లక్ష్మి,ధ్రుతి,తుష్టి ,పుష్టి,మేథ,క్రియ, బుధ్ది,లజ్జ, వపువు,శాంతి,సిధ్ధి,కీర్తి,త్రయోదశి అనే పదమూడుమంది ధర్ముని వివాహం చేసుకున్నారు.సతీదేవి శివుని వివాహం చేసుకుంది. మిగిలిన వారిలో ఖ్యాతి భృగువుని,సంభూతి మరీచిని,స్మతి అంగీరసుడిని,ప్రీతి పులస్త్యుడిని,క్షమ పులహని,సన్నాతి కద్రవును,అనసూయఆత్రిని,ఊర్జ వశిష్టుని,స్వాహ అగ్నిని,స్వధా పితృదేవతల్ని వివాహం చేసుకున్నారు. ధర్మునికి శ్రధ్ధా ద్వారాకాముడు జన్మించాడు.లక్ష్మికి దర్పుడు,ధృతికి నియముడు,తుష్టకు సంతోషుడు,పుష్టకు లాభుడు,మేధకు శ్రుతుడు, క్రియకు నయుడు,దణండు,సమయుడు,బుధ్ధికి అప్రమాధుడు, బోధుడు, లజ్జకు వినయుడు,వపువుకు వ్యవసాయుడు,శాంతికి క్షేముడు,సిధ్ధికి సుఖుడు,కీర్తికి యసుడు,కాముని భార్యరతి వీరికి హర్షుడు జన్మించారు. ప్రియవ్రతుడు ప్రజాపతి పుత్రిక బర్హిష్మతి ని వివాహం చేసుకున్నాడు.వీరికి అగ్నీధ్రుడు,ఇధ్మజిహ్వుడు,యజ్ఞబాహువు,మహావీరుడు,ఘృతపృఘ్టుడు, సవనుడు హిరణ్యరేతసుడు, మేథాతిథి, కవి, వీతిహాత్రుడు, వపుష్మాన,మేధ,విభు,జ్యోతిష్మాన,ద్యుతమాన,హవ్య,సవన,సర్వ, అనేకుమారులు, ఊర్ణస్వతి అనేకుమార్తె జన్మించారు.ఊర్జస్వతిని రాక్షసులగురువు శుక్రాచార్యుడు వివాహం చేసుకున్నాడు.ప్రియవ్రతునికి మరోభార్యకు ఉత్తముడు, తామసుడు, రైవతుడు, అనేకుమారులు కలిగారు. అగ్నిధ్రుడు పూర్వచిత్తఅనే అప్సరసను వివాహంచేసుకున్నాడు. వారికి హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు,కింపురుషుడు,నాభి, కేతుమాలుడు. అనే తొమ్మిదిమంది కుమారులు కలిగారు.మేరువు పుత్రికలు నాభి,మేరుదేవినికింపురుషుడు, ప్రతిరూపను హరివర్షనుడు, ఉగ్రదంష్టృను ఇలావంతుడు,లతను రమ్యకుడు, రమ్యను హిరణ్మయుడు, శ్యామను కేతుడు,నారిని,భద్రాశ్వడు భద్రను వివాహంచేసుకున్నారు. ప్రియవ్రతుని సంతతిలో కొందరు రాజభోగాలపై విముఖతతో తపోవనాలకు పోయారు.

ప్రియవ్రతుడు తపోవనాలకు వెళుతూ,తనరాజ్యాన్ని ఏడు భాగాలుచేసి, అగ్నిధ్రునికి జంబూద్వీపం,మేధాతికి ప్లక్షద్వీపం,వపుష్మానకి శాల్మిలిద్వీపం, జ్యోతిష్మానకు కుషాద్వీపాన్ని,ద్యుతిమానకు క్రౌంచద్వీపాన్ని, హవ్యషాకాద్వీపాన్ని,సవనకిపుష్కరద్వీపాన్ని పాంలించసాగారు. జంబు ద్వీపరాజు అగ్నిధ్రుడునికి నాభి,కింపురష ,హరి, ఇలావ్రత,రమ్య ,హరిణ్మాన, కురు,భద్రాశ్వ,కేతుమాల అయిన,తనతొమ్మిదిమంది సంతతికి తనరాజ్యాన్ని హిమాలయానికి దక్షణదిక్కున ఉన్నరాజ్యం నాభికి.దీన్నేతరువాత కాలంలో (భరతవర్షం) అన్నారు.(వర్షం అంటే ప్రదేశమని అర్ధం)కింపురుషునికి హేమకూట వర్షం,హరికి నైషద వర్షం, రమ్యకి నీలవర్షం,హరిణ్మానికి శ్వేతవర్షం,భద్రాశ్వునికి మాల్యవనవర్షం, కేతుమాలకి గంధమాదనవర్షం,ఇలావ్రతునికి సుమేరు పర్వతప్రాంతం, కురుకి శృంగవనపర్వతానికి ఉత్తరదిక్కున ఉన్న ప్రాంతాలు రాజ్యాలు అయ్యయి.నాభికి రిషభ అనేకుమారుడు అతనికి భరతుడు కలిగారు .

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు