కస్యపుని సంతతి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kasyapuni santathi

కస్యపుని సంతతి.(పురాణకథ) .

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.

ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు.ఈవివస్వతమనువుకుతండ్రికశ్యపుడువాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి. ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

అదితి కస్యపులకు విశ్వవంతుడు,ఆర్యముడు ,పూషుడు,త్వష్ట,సవిత ,భగుడు,దాత,విధాత,వరుణుడు,మిత్రుడు,ఇంద్రుడు,వామనుడు అనే పన్నెండుమంది ఆదితిత్యులు జన్మించారు.

సూర్యుడు సంధ్యాదేవిలకు శ్రధ్ధాదేవుడు అనేమనువు,యముడు,యామి అనేకవలలు,అశ్వరూపంలోఉండగా అశ్వనిదేవతలుజన్మించారు. సూర్యునికి ఛాయదేవి అనే మరోభార్యఉంది. ఆమెకు శనైశ్చరుడు,సావర్ణి అనేమనువు,తపతి అనే కుమార్తెకలిగారు.తపతిని సంవరుణుడు వివాహం చేసుకోగా వారికి కురువు జన్మించాడు.ఇతనే కురు,పాండవులకు మూల పురుషుడు.

ఆర్యమునికి మాత్రుక అనేభార్యవలన చర్షణులు జన్మించారు.పూషుడు సంతాన హీనుడు.త్వష్ట దైత్యుల చెల్లెలైన రచన అనేకన్యను వివాహం చేసుకోగా వారికి విశ్వరూపుడు జన్మించాడు.సవిత పృశ్ని దంపతులకు సావిత్రి,వ్యాహృతి,త్రయ అనే పుత్రికలు,అగ్నిహాత్రము ,పశుయాగము, సోమయాగము,పంచమనోయజ్ఞాలు అనేపుత్రులు జన్మించారు.

భగువు సిధ్ధకి దంపతులకు మహిముడు,విభుడు,ప్రభుడు అనేపుత్రులు,ఆశీష అనేకుమార్తే జన్మించారు.ధాతకు కుహువు,సినివాలి,రాక,అనుమతి అనే నలుగురు భార్యలు.వీరిలో కుహువుకు సాయంకాలం.సినివాలికి ధర్ముడు.రాకకు ప్రాతఃకాలము. అనుమతికి పూర్ణామాఖ్యుడైన పుత్రులు కలిగారు.

విధాత క్రియదంపతులకు పురీష్యాదులైన అగ్నులు జన్మించారు.

వరుణుడు చర్షిణి దంపతులకు ఉత్సర్గుడు,అరిష్టుడు,పిప్పలుడు జన్మించారు.ఉర్వసి మిత్రవరేణ్యులకు అగస్త్యుడు,వసిష్టుడు జన్మించారు. ఇంద్రుడు శుచిదేవి దంపతులకు జయంతుడు,బుషబుడు,విధుషుడు అనేపుత్రులు జన్మించారు.వామనుడు కీర్తి దంపతులకు బృహుత్శ్లోకుడు, అతనికి సౌభగుడు జన్మించాడు.

దితి కస్యపులకు హిరణ్యకసిపుడు,హిరణ్యాక్షులు అనేఇరువురు పుత్రులు కలిగారు.హిరణ్యాక్షుడు జంభాసురుని కుమార్తె లీలావతిని వివాహంచేసు కోగా వారికి ప్రహ్లదుడు,అనుహ్లదుడు, సంహ్లదుడు,అనేపుత్రులతోపాటు, సింహక అనే పుత్రిక జన్మించింది.ఈమె విప్రచిత్తి అనేదానవుని వివాహం చేసుకుంది.వీరికి రాహువు,కేతువులు జన్మించారు. రాహువు కుమారుడు మేఘహొసుడు.సంహ్లదునిభార్య గతి వీరికి పంచజనుడు, జన్మించాడు.హ్లాదునిభార్య దమని వీరికి వాతాపి,ఇల్వలుడు అనేవారు జన్మించారు.(వీరు అగస్యునిచే సంహారింపబడ్డారు ) అనుహ్లాదునిభార్య పేరు సూర్మ్య వీరికి భాష్కలుడు,మహిషుడు జన్మించారు.ప్రహ్లాదుని భార్యపేరు దేవి వీరికి విరోచనుడు అతని కుమారుడు బలి చక్రవర్తి. ఇతనిభార్య ఆశన వీరికి బాణాసురుడు బాణాసురుని భార్య కండల.వీరికుమార్తె ఉషా.ఈమె అనురుధుని ప్రేమిస్తుంది. అదితెలిసిన బాణాసురుడు అనిరుధ్ధుని బంధిస్తాడు.

అదితెలిసిన శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదు వంశ సైన్యంతో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యాదవసైన్యం బాణాసురిడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమధ గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది. ఈ యుద్ధాన్ని యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషాదులు గగనతలం నుండి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయవ్యా స్త్రాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆంధ్రాస్త్రం సంధించాడు.శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారింది. అప్పుడు నారాయణుడు (శ్రీకృష్ణుడు) సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోయాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పుడు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వెంటనే బాణుడు పలాయనమంత్రం పఠిస్తాడు. పరమ శివుడు మూర్ఛ నించి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. నారాయణుడు వైష్ణ్వ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించడంతో ఉపశమనం పొందుతుంది. నారాయణుడు ప్రయోగించిన వైష్ణ్వ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉండటంతో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలో నాలిగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకలదేవతలతో శ్రీకృష్ణుడి వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను. బాణుడు శివభక్తులలో అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు