ఆ రోజు హాస్పిటల్ లో కట్లు విప్పు తారని అందరూ ఎదురు చూస్తున్నారు. గోపాల్ కి మళ్ళీ చూపు వస్తుందని, ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పేడు. అమ్మ నీరజ, నాన్న చంద్ర శేఖర్ లు గోపాల్ మంచం పక్కన ఆందోళన గా నిలబడ్డారు. గోపాల్ కళ్ళ మీద ఉంచిన దూది పట్టీలు తొలగించి, నెమ్మదిగా కళ్ళు తెరవమని చెప్పేడు డాక్టర్. కళ్ళు నెమ్మదిగా తెరిచిన గోపాల్ కి అమ్మ సంతోషంగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ కనపడింది. నాన్న మొహం లో ఆతృత, మరియు ఉద్వేగం కనిపిస్తోంది. చూపు వచ్చిన సంతోషం లో వున్నాడు గోపాల్.
“తను మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు”.
డాక్టర్ కి థాంక్స్ చెప్పి, కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని, అమ్మ, నాన్న ల తో టాక్సీ లో ఇంటికి బయలు దేరాడు గోపాల్.
గతం గుర్తుకు వస్తోంది అతనికి.
సరిగ్గా, 3 సంవత్సరాలకి పూర్వం ఇదే రోజు ఆక్సిడెంట్ అయింది.
అమ్మ, నాన్న చెల్లి తో కలిసి ఫామిలీ అందరూ వాళ్ళు కొనుకున్న కొత్త కారు లో భద్రాచలం వెళ్తున్నారు. సగం దూరం పైనే ప్రయాణం అయిపొయింది. సరిగ్గా ఇంకో గంట ప్రయాణం ఉందనగా, ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలి, వర్షం తో ఒక్క సారిగా చీకటి పడిపోయింది. చంద్ర శేఖర్ DRIVING సీట్లో వున్నాడు, ప్రక్క సీట్లో గోపాల్ చెల్లి , వెనుక సీట్లో ఎడమ వైపు గోపాల్, కుడి వైపు నీరజ కూర్చుని వున్నారు. చీకటి పడిపోయిందని, హెడ్ లైట్స్ వేసేడు చంద్రశేఖర్. అనుకోకుండా అప్పుడు జరిగిన సంఘటన వాళ్ళ జీవితాలని మార్చేసింది.
రోడ్డు వంపులో ఆగి వున్న వాన్ ని ఓవర్ టేక్ చేయబోయాడు చంద్రశేఖర్. సడన్ గా దెయ్యం లా వచ్చిన లారీ ని తప్పించడానికి కార్ ని ఎడమ ప్రక్కకి వేగంగా తిప్పాడు. కార్ అదుపు తప్పి ప్రక్కన వున్న లోతయిన ప్రదేశం లోకి దొర్లి పోయింది. దట్టమయిన తుప్పలు, గోతుల్లోకి పల్టీ కొట్టింది. ఎడమ ప్రక్కన వున్న గోపాల్ కి, అతని చెల్లి కి తీవ్ర గాయలయ్యేయి. లారీ DRIVER పోలీసులకి ఫోన్ చేసి, 108కి ఫోన్ చెయ్యడం తో కుటుంబం మొత్తాన్ని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ముళ్ళు కళ్ళలోకి గుచ్చుకుని గోపాల్ కళ్ళు పోయాయి. అతని చెల్లి మృత్యువుతో పోరాడి 4 రోజులు తర్వాత కన్ను మూసింది. చంద్రశేఖర్, నీరజ లకు FRACTURES అయ్యేయి కానీ, బ్రతికి బయట పడ్డారు.
కూతురు మరణం, కొడుకు గుడ్డివాడు అవడం ఆ దంపతులకు తీరని వేదన మిగిల్చింది.
ఆక్సిడెంట్ స్పాట్ నుండి ఇన్సురెన్స్ కంపెనీ వాళ్ళు కార్ రిపేర్ చేసి తెచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళేరు. కానీ కూతురి జ్ఞాపకాలు ఆ దంపతులని ఇబ్బంది పెడుతున్నాయి. కార్ నడపలేక లక్ష్మీ CARS అనే సెకండ్ హ్యాండ్ షోరూం లో అమ్మేశాడు చంద్రశేఖర్. సెంటిమెంటల్ గా మళ్ళీ కార్ కొనుక్కోలేదు.
2 సంవత్సరాల వరకూ వాళ్ళు మామూలు మనుషులు అవలేక పోయేరు. గోపాల్ ని ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పారు, కానీ చూపు మళ్ళీ వచ్చే ఆశ కనపడ లేదు.
2 నెలలుగా హైదరాబాద్ లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అమెరికా నుండి వచ్చి CRITICAL EYE ఆపరేషన్స్ చేస్తున్నారని తెల్సి సంప్రతించారు. ఆయనని కలిసాక గోపాల్ కి కళ్ళు తిరిగి వస్తాయని ఆశ వచ్చింది. 15 రోజులు TREATMENT అయ్యాక , 3 రోజుల ముందు ఆపరేషన్ జరిగింది. ఈ రోజు గోపాల్ కి చూపు వచ్చింది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు.
ఆపరేషన్ జరిగి 2 నెలలు గడిచాయి . గోపాల్ కి ఇప్పుడు చూపు చక్కగా వుంది. 2 రోజులుగా బయటికి రావడం, FRIENDS ని కలవడం చేస్తున్నాడు. చాలా కాలానికి సుధీర్ ని కలిసాడు. ఆ సమయంలో సుధీర్ వాళ్ళింటికి చుట్టాలు వచ్చేరు. గోపాల్ కి త్వరగానే FRIENDSHIP అయి పోయింది వాళ్లతో. సుధీర్ కజిన్ అపర్ణ చాలా కలుపుగోరు మనిషి. గల గలా మాట్లాడుతుంది. ఎవరయినా FRIENDS అయిపోతారు ఆ అమ్మాయి తో.
వాళ్ళ అమ్మ సుజాత, గోపాల్ ని కూడా మరునాడు అపర్ణ పుట్టినరోజు ఫంక్షన్ కి వాళ్ళ ఇంటికి పిలిచింది. వాళ్ళు ఉండేది బేగం పేట లో. గోపాల్ కి కళ్ళు పోయిన దగ్గర నుండి, సోషల్ MOVEMENT తగ్గిపోయింది. ఇప్పుడు చూపు రావడం తో చాలా ఉత్సాహం గా వుంది.
మరునాడు సుధీర్ ఇంటికి METRO లో వెళ్ళేడు. సుధీర్ ఇంటి నుండి స్కూటర్ మీద ఇద్దరూ అపర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళేరు. అది ఒక ఇండిపెండెంట్ హౌస్, పక్క పక్కనే రెండు PORTIONS గా కట్టి వుంది. ముందు పోర్టికో లో కార్ నిలిపి వుంది.
సుధీర్ గబ గబా లోపలి వెళ్ళేడు. కానీ గేట్ తీసుకుని లోపలి వెళ్లిన గోపాల్ ఆశ్చర్య పోయాడు. కారణం, వాకిట్లో పార్క్ చేసి వున్న కార్ వాళ్ళు అమ్మేసినదే. కార్ కొత్తదానిలా మెరిసిపోతోంది.
వాళ్ళు రావడం చూసి బయటకి వచ్చిన అపర్ణ .. " అక్కడే ఆగి పోయావేం గోపాల్ " అంది.
"ఏం లేదు, ఈ కార్ .." అంటూ ఆగేడు.
"బావుందా ?" ఉత్సాహం గా అంది ఆమె. " బావుంది " అన్నాడు గోపాల్.
" కొని ఏడాది అయిపొయింది , అది మా లక్కీ కార్ కూడా... నాకు ఆ కార్ అంటే చాలా ఇష్టం" అంది.
"లక్కీ కార్ అంటే".. అర్ధం కానట్లు అన్నాడు గోపాల్
ఇలా చెప్పింది అపర్ణ :
" ఇది ఏడాది పూర్వం మేము దీనిని 2ND HAND SHOWROOM లో సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రోజు మా డాడీ కార్ తీసుకుని ఇంటికి వస్తున్నట్లు చెప్పేరని, నేను అమ్మ బయలు దేరి బయటకి వచ్చేము. కార్ లో ఒక TRIP వేసి వచ్చే సరికి మా కిచెన్ మొత్తం కూలిపోయింది. కారణం మా ప్రక్క ఇంట్లో జరిగిన సిలిండర్ బ్లాస్ట్. పక్కింట్లో 2 గదులు కూలిపోయేయి, ఒక గది కి మా వంట గది అనుకుని ఉండడం తో మా వంటిల్లు కూడా కూలి పోయింది. మేము కార్ లో బయటికి వెళ్లక పోయి ఉంటే ఆ రోజు ఆ ఆక్సిడెంట్ కి బలి అయి పోవాల్సింది. నిజానికి ఆ రోజు, నేను అమ్మ కేక్ తయారు చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. కిచెన్ లో అమ్మకి నేను సాయం చేస్తున్నాను. ఆ PROGRAM ని రద్దు చేసుకుని, ఈ కార్ వచ్చింది కదా అని బయటికి వచ్చేసాం.
షాక్ అయినట్లు చూసారు గోపాల్ సుధీర్ లు. మరింత ఉత్సాహం గా చెప్తోంది అపర్ణ...
“అంతే కాదు మరో సంఘటన కూడా జరిగింది. మరో నెల తర్వాత, నేను అమ్మ షాపింగ్ కి వెళ్ళేము. మధ్యాహ్నం 1 గంట సమయం లో ఇంటికి తిరిగి వద్దామని బస్సు స్టాప్ లో వెయిట్ చేస్తూ వున్నాం. డాడీ ఆఫీస్ పని మీద లాయర్ దగ్గరకి వచ్చేరుట. ఆయన బస్సు స్టాప్ ఎదురు రోడ్ లోకి వచ్చేరు., మమ్మల్ని బస్టాప్ లో చూసి ఫోన్ చేసి పిలిస్తే, రోడ్ దాటి వచ్చి కార్ ఎక్కేము. అప్పుడే అంతకు ముందు మేము వున్న బస్సు స్టాప్ లో ఆక్సిడెంట్ అయింది. BRAKES ఫెయిల్ అయిన ఒక వాన్ బస్సు స్టాప్ లోకి దూసుకుని వచ్చింది. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన లో కూడా మమ్మల్ని ఈ కార్ కాపాడింది. “
“ఆ విధం గా మా జీవితాలు నిలిపిన కార్ ఇది. అందుకే ఇది మా లక్కీ కార్ అంటాను” అంది.
గోపాల్ కి ఏమి అనాలో తొచ లేదు.
"అవునవును లే" అనేశాడు. అది తాము ఇదివరకు వాడిన కార్ అని, తాము అమ్మేశామని అనలేదు. అలాగే తమ ఇంట్లో జరిగిన విషాదం గురించి కూడా చెప్పలేదు.
“విధి యెంత విచిత్ర మయినది? తమ ఇంట్లో విషాదం నింపిన అదే కార్ ఇంకొకరి జీవితం లో వెలుగులు నింపింది” .. అనుకున్నాడు
ఇప్పుడు అతనికి అనిపిస్తోంది " మనిషి జీవితం లో వచ్చే ఆనందాలయి నా, విషాదాలయినా
భగవంతుడి లీల తప్ప యింకేమీ కాదు... కానీ మనిషి మాత్రం నమ్మకాల లో బతికేస్తూ ఉంటాడు... అదే జీవితమంటే..అని.