పట్టుచీర - బి.రాజ్యలక్ష్మి

Pattucheera

ఏడేళ్ల వయసులో నిమ్మి ఒక పేరంటానికి అమ్మ తో వెళ్ళింది .అక్కడ నిమ్మి కి ఒకావిడ కట్టుకున్న నీలం పట్టు చీరె నచ్చింది .
“అమ్మా నాకు పట్టుచీర కొనవా “అంటూ తల్లి గౌరి ని అడిగింది .అందరూ గొల్లున నవ్వేసారు.గౌరి “అలాగే “అంటూ అప్పటికి నచ్చచెప్పింది
ఇంటి కి రాగానే నాన్న దగ్గరి కి వెళ్ళి తన పట్టు చీర కోరిక చెప్పుకుంది. నాన్న రామం నవ్వేసాడు.
“నిమ్మీ ,నువ్వు యింకా చిన్ని పిల్లవు పెద్దయ్యాక కట్టుకోవాలి”అని నచ్చచెప్పారు.

“సరే నాన్నా , అమ్మా కానీ నాకుఅలాంటి పట్టు చీరే కొనివ్వాలి “అంటూ నవ్వుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది .

నిమ్మి కోరిక కు పదేళ్ళు వచ్చాయి.చీర కట్టుకునే వయస్సు వచ్చింది .నిమ్మి అక్కయ్య రాజీ కి పెళ్ళి కుదిరింది .
నిమ్మి కి పట్టు పరికిణి ,ఓణీ పట్టుజాకెట్‌ కొన్నారు . నిమ్మి అలిగింది .
“నిమ్మీ , పరికిణీ కట్టుకోలెదెందుకు”అడిగారు నాన్న
“మీ ముద్దుల కూతురు అలిగింది అన్నది గౌరి .
నాన్నా ,అక్కయ్య పెళ్ళి కి పట్టు చీర కొంటానన్నారు గా ?” అడిగింది

“అక్కయ్య వెళ్ళిపోతుంది కదా ,నీ పెళ్ళి కి తప్పకుండా కొంటా”అన్నది గౌరి .
“నేనెప్పుడు అడిగినా యిదే మాట అంటారు”విసుక్కుంది నిమ్మి .
ఎప్పుడూ అమ్మా నాన్నా తెచ్చిన బట్టలు కట్టుకోవడం తప్ప యెప్పుడూ యేదీ అడగలేదు .పట్టుచీర కోరిక అలాగే వుండిపోతున్నది .కనీసం పట్టుచీర కోసం అయినా పెళ్ళయితో బాగుటుంది అనుకున్నది నిమ్మి .
ఒక సాయంత్రం ఆఫీసు నుంచి వస్తుూనే గుమ్మం దగ్గర వాలిపోయాడు నిమ్మీ తండ్రి .
నిమ్మి పధెనిమిదేళ్ళమ్మాయి .గౌరి కి కూతురి పెళ్ళి చింత పట్టుకుంది .ఆరోగ్యం చెడింది .ఆ యింట్లో నిమ్మి దిగులు దిగులు గా తిరుగుతున్నది .పెద్దకూతురు రాజీ వచ్చి కొన్నాళ్ళుండి పోయింది .దూరపు బంధువు ,అన్నయ్యవరుసాయన నిమ్మి ని తన కొడుకు రఘు కు చేసుకుంటానని హామీ యిచ్చాడు .రఘ చిన్న కంపెనీ లో కొద్ది జీతం తెచ్చుకుంటాడు .గౌరీ అతికష్టం మీద పెళ్ళి జరిపించింది .మగపెళ్ళి వాళ్లు కూడా వన్నవాళ్ళు కాదు .నిమ్మి పట్టుచీర కోరిక నెరవేరలేదు గౌరి నిమ్మి పెళ్ళి చూసి
చనిపోయింది.
నిర్మలమ్మ కు కొడుకు శ్రీనివాస్‌,కూతురు గిరిజ వున్నంతలో చదివించారు .భర్త రఘు జీతం తో పొదుపు
చేసి చిన్న యిల్లు కట్టుకున్నారు.పట్టుచీర సంగతి మనసు లో నే నిలిచి పోయింది .. శ్రీనివాస్‌ డిగ్రీ అవుతూనే ప్రభుత్వవుద్యోగం కోరని వరం లా లొభించింది. నిర్మల రఘు దంపతుల కష్టాలు నెమ్మదిగా తీరుతాయన్న తృప్తి ఆ కుటుంబం లో కలిగింది .గిరిజ పెళ్లి తన పెళ్లి లాగా కాకుండా వున్నంతలో హాయిగా చెయ్యొచ్చు అనుకున్నారు .గిరిజ డిగ్రీ ఫైనల్ చదువుతున్నది .నిర్మల గిరిజ పెళ్లి లో అయినా తన కోసం తాను కావాలనుకున్న పట్టుచీర కొనుక్కోవాలని వువ్విళ్ళురుతున్నది .శ్రీనివాస్ ఉద్యోగం వేరే వూళ్లో అవడం వల్ల తనకు కావాల్సిన సామాను తీసుకుని వెళ్లాడు .నిర్మల కొడుక్కు కావాల్సిన పచ్చళ్లు ,బియ్యం ,పప్పు ,నూనె వగైరా వగైరా ప్యాక్ చేసింది .అమ్మ హడావిడి శ్రీనివాస్ కు నవ్వొచ్చింది .
“అమ్మా ,నేను గదివెతుక్కోవాలి ,అప్పుడు కదా వంట ! నాకు తెలిసిన ఫ్రెండ్ రూమ్ లో కదా యిప్పుడు వుండేది !”అన్నాడు శ్రీనివాస్
“ఒరేయి శ్రీనూ అమ్మ యెప్పుడూ కొడుకు ఎంతపెద్దవాడయినా తనకు పిల్లవాడే కదరా “అంటూ రఘు కొడుకును మురిపం గా నవ్వుతూ చూసాడు .నిర్మల చెమర్చిన కళ్లతో భర్తను ,కొడుకును చూసింది .శ్రీనివాస్ వుద్యోగస్తుడయ్యాడు.ఇప్పుడు నిర్మల కు గిరిజ చదువు అవగానే పెళ్లి చేసెయ్యాలని అనిపించింది .రఘు కొద్ది జీతం తో చిన్న యిల్లు ఏర్పరచుకున్నారు .దేవుడి దయవల్ల కొడుకు వుద్యోగస్తుడయ్యాడు .గిరిజ డిగ్రీ యింకో యేడాదిలో ముగుస్తుంది .భర్త రఘు అప్పుడప్పుడు నీరసం గా కళ్లు తిరిగిపడిపోతున్నాడు .
ఒకరోజు రఘు ఆఫీసు నించి రాగానే కాఫీ యిస్తూ “ ఏమండీ ,అమ్మాయి చదువు అయిపోతుంది కదా పెళ్లి చేద్దాం ,యిప్పటినించి వెతికితే కనీసం వచ్చే వైశాఖం లో చెయ్యొచ్చు “అన్నది నిర్మల .
“ఇంకా టైముందిగా ,మన గిరిజ బంగారు తల్లి ,అల్లుడే వెతుక్కుంటూ వస్తాడు ,ఇంతకీ అమ్మాయి పెళ్లవుతే నీకు పట్టుచీర వస్తుందని కదూ “అంటూ తమాషాగా నవ్వాడు రఘు .
“మీకు ఆ శ్రమ అక్ఖర్లేదులెండి ,నా కొడుకు వాడి మొదటి జీతం తో కొనిస్తానన్నాడుగా “గర్వం గా నవ్వింది నిర్మల .అప్పుడే కాలేజీ నించి వచ్చిన గిరిజ అమ్మా నాన్నలను చూసి తనూ నవ్వేసింది .

ఇంతలో “కొరియర్ “ అంటూ తలుపు తట్టారు .

“నిర్మల “ అంటూ కొరియర్ కుర్రాడు పిలిచాడు .
నిర్మల సంతకం చేసి కొరియర్ తీసుకుని ఓపెన్ చేసింది .అంతే తాను చిన్నతనం నించి కోరుకున్న నీలం పట్టుచీర !!
“చూసారా నా కొడుకు పంపిన చీర “అంటూ భర్త చేతికో పెడుతూ చీరను ఆప్యాయం గా ముద్దుపెట్టుకుంది .” మన గిరిజ పెళ్లి లో కట్టుకుంటానండి” అంటూ నిర్మల చెమర్చిన కళ్లతో గిరిజ చేతిలో పెట్టింది .


.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ