గతించిన కాలంలో ఎన్నో జ్ఞాపకాలు... అందులో కొన్ని తీపి సంఘటనలైతే.. మరెన్నో చేదు అనుభవాలు. కలలు కంటుంటే ఎంతో హయిగా వుంటుంది.. కానీ జీవితమే ఓ కలగా మిగిలిపోతే ... నా జీవితంలో అదే జరిగింది.
మాది ఒక పల్లె టూరు . ఆ ఊరిపేరు చెప్పను. ఆరోజు రాత్రి అరుణను శివాలయం కోనేరు గట్టువద్దకు రమ్మన్నాను. ఆమె రావటానికి ఇంకా సమయం పడుతుందేమో.. ప్రతిరోజూ తనూ.. నేనూ ఇక్కడే కలుస్తాం.. చుట్టూ కోనేరు.. మధ్యలో శివాలయం.. ఎత్తైన నంది బొమ్మ.. విశాలమైన ప్రాకారం.. రాజులు కట్టించిన గుడి రాజగోపురం.. చాలా చరిత్రే వుంది మా ఊరి శివాలయానికి.. తురుష్కుల దండయాత్ర సమయంలో శివలింగాన్ని ధ్వంశంచేశారట... రాత్రికి రాత్రే మళ్ళీ శివలింగం దానంతటదే అతుక్కుందట.. అప్పటి నుంచీ మా ఊరి శివాలయం పర్యాటక క్షేత్రమైంది. ఆ శివాలయంలో అర్చన వంశపారంపర్యంగా వస్తోంది.
అరుణకోసం ఎదురు చూసే ఎదురుచూపులూ మధురంగానే వుంటాయి. ఎందుకో తెలీదు. ఆమె అంత అందంగా వుండటం వల్లనో.. నలుగురితో మాట్లాడకుండా మౌనంగా తనపనేదో తను చూసుకోవటం వల్లనో.. ఎప్పుడో కానీ పళ్ళు కనిపించకుండా నవ్వటం వల్లనో.. లేక ఆమె గంభీరమైన చూపువల్లనో... ఏదో... ఎందుకో... తెలీదు కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం.
చిన్నప్పటి నుంచీ చూసిన అరుణే.. అప్పట్లో తనంటే నాకు సరిపడేది కాదు.. అన్ని ఆటల్లోనూ.. చదువులోనూ తనే ఫస్టు.. స్కూల్లో మాస్టర్లు తనని ఉదాహరణగా చూపించి పిల్లల్ని నేర్చుకోమనేవారు. చదువు అంతగా అబ్బని నాకైతే రోజూ అరుణని ఉదహరిస్తూ పంతుళ్ళు బెత్తంతో బడితె పూజ చెయ్యటం నిత్యకృత్యం. అందుకే అరుణంటే నాకు కోపం.. ఎన్నోసార్లు తనని ఏడిపించేవాడిని. అల్లరి పెట్టేవాడిని.
ఒకసారి నాకు బాగా గుర్తు.. నేను ఏడోక్లాసు చదువుతున్న రోజులు.. ఒక బల్లిని పట్టుకొని ఆమె జామెంట్రీ బాక్సులో ఎవ్వరూ చూడకుండా వుంచాను. ఆ బాక్సు తెరిచిన తను భయంతో కెవ్వుమని అరుస్తూ కేకపెట్టి క్లాసులోంచి బయటికి పరుగుతీసిన సంఘటన నాలోని మరోమనిషిని తృప్తిపరిచింది. ఆరోజు నాకు అర్థమైంది అరుణని ఏడిపిస్తే నాకు ప్రశాంతత లభిస్తుందని.. అరుణ ఏడిస్తే నాకు ఆనందం.. తన ఏడుపులో నేను ఆనందాన్ని వెతుక్కునేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టాను..
ఒకరోజు తన ఇంటి పడకగదిలో ఉదయాన్నే లేచి చదువుకుంటోంది.. నేను ఆ ఇంటి కిటికీ దగ్గర నల్లటి దుప్పటి ముసుగులా వేసుకొని దెయ్యంలా భయపెట్టాను. పెద్దగా అరిచిన అరుణ మరుసటిరోజు స్కూలుకి రాలేదు.. భయపడి జ్వరం వచ్చి వుంటుందని నేను సంబరపడ్డాను. కానీ నాకు తర్వాత తెలిసింది..మా అమ్మ చెప్పింది అరుణ పెద్దదైందని.. నాకు అప్పుడు అర్థంకాలేదు.. తను పెద్దదైందంటే.. నా అంత వుండే అరుణ నాకంటే పెద్దది ఎలా అయిందా అని... అమ్మని ఈ విషయమే అడిగాను.. నా తలమీద ఒక్కటిచ్చి అవన్నీ ఆడవారికి సంబంధించిన విషయాలని నవ్వేసింది.. నాకు అర్థంకాలేదు..
అప్పటి నుంచీ నాకు అరుణంటే భయం.. నాకంటే తను పెద్దదైందని భయమేసింది. ఇక అరుణ భయపడదు.. అరుణని భయపెట్టటం మానేసి నేను భయపడటం మొదలు పెట్టాను. అప్పటి వరకూ ఆటల్లో ఫస్టుండే అరుణ ఆటలకి దూరమైంది.. నలుగురితో నవ్వుతూ మాట్లాడే అరుణ గంభీరంగా వుండటం మొదలుపెట్టింది. ఆమె చూపుల్లో చురుకుదనం నాకు నా హద్దులు గుర్తు చేసింది. ఆమె చదువుల్లో మాత్రం ఎప్పటికీ స్కూలు ఫస్టులోనే వుండేది. నాకూ అనిపించింది... అరుణమీద యావతగ్గించి చదువుమీద దృష్టి పెట్టాలని.. అందుకే నేను కూడా పొద్దున్నే నిద్రలేచి చదవటం మొదలుపెట్టాను. ఎంత చదివితే ఏం ఉపయోగం... అరాకొరా మార్కులతో పాసవ్వటమే ఎక్కువ... పోనీలే అసలు పాసే అవ్వనని అనుకునే నేను మొత్తానికి టెన్త్ క్లాసు పరీక్షలు గట్టెక్కించాను. మొత్తానికి మాస్టర్ల పుణ్యం కూడా లేకపోలేదు.
ఇంతలో ఏమైందో.. ఏంటో తెలీదు కానీ అరుణంటే భయం పోయింది.. తనతో మాట్లాడాలనీ, మాట్లాడలేకపోయినా తననే చూడాలనీ అనిపించేది.. ఇంతలో అరుణ కాకినాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరుతుందని తెలిసింది. మా ఇంట్లో అన్నయ్యలూ, నాన్న అందరూ వద్దంటున్నా వినకుండా పట్టుపట్టి నేను అదే కాలేజీలో వేలకివేలు పోసి కాలేజీలో ఎంపిసీలో చేరాను. అయితే నాకు అందిన సమాచారం తప్పు.. అరుణని పదితోనే చదువు మానిపించారని తెలిసింది.
నాకు మాత్రం కాకినాడ వెళ్ళి చదవక తప్పలేదు. అరుణ దర్శనభాగ్యం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. చదువు మానేసినప్పటి నుంచి నేను అరుణని చూసింది చాలా తక్కువ. ఏదైనా పండుగలకి పబ్బాలకీ శివాలయానికి వచ్చి వెళ్ళేది.. మేము బ్రాహ్మణేతరులం కావటం వల్ల వారింటికి వెళ్ళే అవకాశం లేదు. ఇన్ని సంవత్సరాలుగా అరుణని చూస్తే చాలనుకునేవాడిని.. అరుణతో ఎలాగైనా మాట్లాడాలని.. తనని గట్టిగా పట్టుకోవాలని అనిపించింది. దసరా సెలవలు కావటంతో మా వూరికెళ్ళాను. అమ్మవారి ఉత్సవాల్లో అరుణని చూశాను. చాలా పవిత్రంగా కనిపించింది. నా ప్రేమ దేవతలా నాకు అనిపించింది. ఎర్రటి లంగా మీద తెల్లటి ఓణీ వేసుకొని కోనేరులోని నీళ్ళు తీసుకెళ్ళటానికి వచ్చింది. కోనేరులో పాచి వుండటం వల్ల తను జారి పడిపోతుంటే ఆమె నడుము పట్టుకున్నాను. అంతే మరోమాట లేకుండా నా చెంప ఛెళ్ళుమనిపించింది. నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘ అమ్మాయిల్ని పట్టుకోవటం మీదున్న శ్రద్ధ చదువుమీద పెట్టు.’’ అంటూ చురుకుగా చూస్తూ.. తనలో తనే ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. నాకు భరించలేని అవమానంగా అనిపించింది. అంతమందిలో నన్ను కొట్టటం అందరూ నన్ను చూడటం.. ఆమెపై నాకున్న ప్రేమ గురించి తెలిసిన నా ఫ్రండ్స్ నన్ను చూసి నవ్వటం... వెరసి నాలో తెలియని ఆవేశం.. క్రోదం.. ఆవేదన.. అన్నీ ఒక్కసారిగా ఆ క్షణాన ఆవరించాయి.
అంతే... నేనూ తగ్గలేదు.. అదే ఆవేశంతో వెళ్ళి అరుణ చెంపమీద నేనూ కొట్టాను.
ఎవ్వరూ ఊహించని సంఘటన.. అక్కడున్న వాళ్ళు చాలామంది నన్ను తిట్టారు..
‘‘ఆడపిల్లని కొట్టటమేంటిరా యదవా...’’ అని..
‘‘పూజారిగారి అమ్మాయిని కొడతావా’’ అంటూ ఇంకొంతమంది నన్ను కొట్టటానిక్కూడా వచ్చారు.
‘‘ఆగండి.. తనేదో జారిపడుతుంటే పట్టుకున్నాను. అంతమాత్రానికే నన్ను కొడుతుందా..? అందగత్తెనని పొగరా..? కాకినాడలో ఇంతకంటే గొప్పగొప్పోళ్ళనే చూశాను. అబ్బాయిలందరూ ఒకేలా వుండరు.. నాలాంటి వాళ్ళు కూడా వుంటారు.’’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
ఆతర్వాత పూజారి గారింటి నుంచి మా ఇంటి మీదకి గొడవకొచ్చారు. కొంతమంది పూజారిగారి అమ్మాయి వైపు మాట్లాడితే.. నా వైపు కొందరు మాట్లాడుకున్నారు. మాటా మాటా పెరిగింది. మొత్తానికి నాకు అరుణ-నేను అరుణకి క్షమాపణలు చెప్పుకున్నాం.. గొడవ సద్దుమణిగింది.
దసరా సెలవులైపోయాయి..
అరుణమీద ప్రస్తుతం నాకు మనసు లేదు.
ఇక నా చదువు విషయానికొస్తే ప్రైవేటు కాలేజీ కావటం వల్ల స్టడీ అవర్లపేరుతో చేపని తోమినట్లు తోమేవాళ్ళు. మార్కులు కూడా బరువుగా వస్తుండేవి..
అప్పుడప్పుడూ నాకు అరుణ తరచుగా గుర్తొస్తుండేది..
అయినా అరుణ ఆలోచనల్ని పక్కనపెట్టి కాంపిటీషన్ వల్లనేమో చదువుమీద ధ్యాసపెట్టేవాడిని.
మంచి మార్కులతో ఎగ్జామినేషన్స్ పాసయ్యాను.
ఎంసెట్ లో మంచి ర్యాంకు కూడా వచ్చింది. కాలేజీ టాపర్.
ఎండాకాలం సెలవలకి మా ఊరికెళ్ళాను. అప్పుడే నేను మళ్ళీ అరుణని చూడటం. అరుణ నాకు శివాలయం వీధిలో ఎదురైంది. శివాలయం వీధిలో నా ఫ్లక్సీ కూడా ఒకటి కట్టించారు. బహుశ అది చూసి కాబోలు నా దగ్గరికి వచ్చి నన్ను విష్ చేసింది. నేనూ విష్ చేశాను.
తర్వాత ఒకటి రెండు సార్లు సాధారణంగా ఎదురు పడ్డాను.
ఒకరోజు అరుణ నా ఫ్లక్సీని చూస్తూ నిలబడి పోయింది.. నేను తనని గమనిస్తున్న సంగతి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. అరుణ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. నేను వెంటనే తనదగ్గరికి వెళ్ళి ఓదార్చాలని అనుకున్నాను. కానీ అప్పటికే మా రెండిళ్ళమధ్య గతంలో మా వల్ల జరిగిన గొడవ గుర్తుకొచ్చింది. అందుకే ఆగిపోయాను. తర్వాత తనని పర్సనల్ గా కలిసే ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నాను.
ఒకరోజు అరుణే నా దగ్గరికి వచ్చింది. నేను తనకి నచ్చానని చెప్పింది. ఎందుకో.. ఏంటో అర్థం కాలేదు. కారణం అడిగాను. తను నాకు చెప్పలేదు..
నేను కోరుకున్న అరుణ.. నా దగ్గరికొచ్చి నేను నచ్చానని చెప్పటంతో నాకు చాలా ఆనందమేసింది. నువ్వంటేనాకిష్టం అని చెప్పటంతోనే నేను భూమ్మీద కాదుంది.. ఆకాశంలో విహరిస్తున్నానని అనిపించింది. ఉన్నట్లుండి నాకు రెక్కలు మొలిచినట్లు అనిపించాయి. ఆ రెక్కలతో నేను ఎంతో ఎత్తుకి ఎగురుతున్న అనుభూతి.. అయితే నాకు ఇప్పటికీ అనుమానమే తను నన్ను ఎందుకు ఇష్టపడిందో..
కాల క్రమంలో నేనూ అరుణా తరచూ మా శివాలయం కోనేరుగట్టున ఎవ్వరికీ తెలియని ఒక రహస్యమైన ప్రదేశం.. అదే ఈ రాయి దగ్గర కలవటం మొదలుపెట్టాం.. రాత్రిళ్ళు తను కేవలం నన్ను కలవటానికే వస్తుండేది.. నేనూ తనని కలవటానికి వస్తుండేవాడిని.. అలా రాత్రిళ్ళు.. ఎంతసేపు ఏవేవో మాట్లాడుకుంటుండేవాళ్ళం.. ఏం మాట్లాడుకున్నామో.. కూడా సరిగా గుర్తుండేది కాదు..
మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం..
ఊళ్ళో మా రెండిళ్ళమధ్యా వున్న గొడవ... అదీ కాకుండా కులాలు వేరు.. ఈ కారణంగానే నేను అరుణని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నా.. అరుణ కూడా అందుకు సిద్ధపడింది.
ఇప్పుడు నేను అరుణకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా.. మా భవిష్యత్ జీవితంపై ఎన్నో ఆశలు.. ఎన్నోకలలు పెట్టుకొని.. తనింకా రాలేదు..
అదిగో.. ఆమే అనుకుంటా...
ఏంటి తనలా చీకట్లోనే దూరంగా నిలబడిపోయింది.. దగ్గరికి వెళ్ళాను. తనే..
‘‘ఏంటి ఇక్కడే ఆగిపోయావ్ రా అరుణా..’’ అంటూ చెయ్యి పట్టుకున్నాను.
‘‘ చెయ్యి వదులు’’అంది సీరియస్ గా
నేను ఆమె చెయ్యి వదల్లేదు.. తనే బలవంతంగా నా చెయ్యి విదిలించుకుంది..
‘‘ మన పెళ్ళి జరగదు.. కట్టుబాట్లు.. ఈ కట్టుబాట్లు దాటి మా వాళ్ళు రారు.. నేనూ వారిమాట దాటి బయటికి రాలేను. ’’
‘‘ మరి నన్నెందుకు ప్రేమించావ్.. అన్నీ మర్చిపోతున్న నాలో ప్రేమను ఎందుకు రగిలించావ్. పెళ్ళి చేసుకుందామని నాలో ఆశలెందుకు రేపావ్..? ’’ అన్నాను.
‘‘ నేనూ నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి.. నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం.. కాదు.. ప్రాణం.. కానీ నేనిప్పుడు ప్రాణం వున్న శవాన్ని.. ఈ శవంతో నీ జీవితం ముడిపడదు.’’
‘‘ ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా..? ’’ అన్నాను ఆక్రోశంగా..
‘‘ అవును.. నాకూ ఈ రోజే తెలిసింది. కారణాలు అడక్కు.. ప్లీజ్.. నీకు నేనేమీ చెప్పలేను. నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తే మర్చిపో’’
‘‘ ఎందుకు? కులాంతర వివాహాలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయ్.. మన వివాహమూ జరుగుతుంది.. వాళ్ళు జీవిస్తున్నట్లే మనమూ జీవిస్తాం.. నాతో కలిసి ఒక్క అడుగు.. ఒక్క అడుగు వెయ్యి.. మిగిలిన ఆరడుగులూ నేను వేయిస్తా.. జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అరుణా ’’ అంటూ ఆమె చెయ్యిపట్టుకొని బ్రతిమాలాను.
తను వినలేదు.. ఏడుస్తూ అక్కడే నిలబడింది.
అలా చాలాసేపు నిశ్శబ్దం....
ఆమె గొంతులోంచేకాదు నా గొంతులోంచీ మాట రావటంలేదు.
ఆమె కళ్ళలోంచిమూగ భావం తొంగి చూస్తోంది. అది నాకు స్పష్టంగా అర్థమౌతోంది.. కానీ ఆ భావమేంటో తెలీలేదు.
తన ముక్కు పుాలను తాకి వచ్చే వెచ్చని శ్వాశ అక్కడ ఆవరించిన నిశ్శబ్దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తోంది.
ఆమె గుండె చప్పుడు వేగంగా ఉంది.
ఆది నాకు స్పష్టంగా వినబడుతోంది.
తర్వాతే తెలిసింది అది నాగుండె చప్పుడని..
చివరిగా తను అక్కడినుండి కదలాల్సిన సమయం వచ్చినట్లుంది... ఆమె వెళుతూ నా చెక్కిళ్ళు తడిమింది. నా పెదవులని వేళ్ళతో మీటింది.. నా జుట్టులోకి చేతులు పోనించి నా తలని తన గుండెలకి గట్టిగా హత్తుకుంది. ఆమె కన్నీరు నా వీపుపై అగ్నికీలల్లా తాకాయి. ఆమె భారమైన నిట్టూర్పులు, గుండెలో అలజడి ఒక్కసారిగా నన్ను డిస్టబ్ చేశాయి.
నా మనసులో అగ్నిపర్వతాలు బద్దలౌతున్నాయి. మొట్టమొదటిసారిగా కులంమీద నాకు కోపం వచ్చింది. కులాన్ని కనిపెట్టిన వాడ్ని కాల్చిపారెయ్యాలనిపించింది. కులం మా ఇద్దరి మధ్యా పెద్ద అగాధంలా అనిపించింది. నాకు బ్రతకాలని కూడా అనిపించలేదు. వెంటనే కోనేటిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అనిపించింది.
వెంటనే కోనేరువైపు ఆవేశంగా అడుగులు వేస్తున్ననన్ను పట్టుకొని ఆపింది అరుణ.
చావద్దని తన మీద ఒట్టేసుకుంది. తనను మర్చిపోమని చెప్పింది. మాట తీసుకుంది.
ఆమె చేతిలో చెయ్యి వేసి అక్కడి నుండి అరుణని వదిలి వెళ్ళిపోయాను.
అలా వెళ్ళిపోతున్ననాకు తెలీదు.. నా ప్రయాణం ఎక్కడిదాకో.. ఎంతకాలం ప్రయాణిస్తానో అని..
తర్వాత నేను అరుణని కలవలేదు..
కాలం గడిచిపోయింది..
బెనారెస్ లోని ఓ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను.
అమ్మానాన్నలు, బంధువులు అందరూ నన్ను పెళ్ళి చేసుకోమని బలవంతం చేశారు.
కానీ పెళ్ళి అనే పేజీ నా జీవితంలోంచి ఆ రోజు రాత్రే చించేశాను.
అరుణ గురించి మర్చిపోవాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కావట్లేదు..
పదేళ్ళు గడిచిపోయాయి.
చాలాకాలం నాకు అనిపించింది అరుణని, అరుణ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి వుంటే బాగుండేది. అరుణతో నా జీవితం ఈ రోజు హ్యాపీగా గడిచిపోతుందని చాలాసార్లు అనుకున్నాను. కానీ తిరిగి వెళ్ళేందుకు నాకు మనస్కరించలేదు.
గతించిన కాలంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో ఛేదు అనుభవాలు.. అరుణకి సంబంధించిన ఎటువంటి సమాచారం నాకు లేదు.
శుభం కాని నాకథకి శుభం ఎలా వెయ్యగలను..?

*********
అరుణ ఆలోచనలు ఎంత మర్చిపోదామన్నా పదేపదే గుర్తుచేస్తూ మానని గాయంలా నా మనసుని బాధిస్తునే వున్నాయి. అనుకోకుండా ఒకరోజు నేను మా ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నయ్యని పొలంలో పాము కరిచిందట. వెంటనే బయల్దేరి రమ్మని నాకు ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్ నుంచి మా ఊరు బస్సులో వెళుతున్నాను. అలా బస్సులో వెళుతున్నంతసేపూ నాకు అరుణ గురించిన ఆలోచనలే వస్తున్నాయి.
అరుణ తన భర్త పిల్లలతో ఎలా వుందో.. అరుణకి ఎంతమంది పిల్లలు పుట్టారో.. వాళ్ళాయన అరుణని ఎలా చూసుకుంటున్నాడో.. ఇలాంటి ఆలోచనలు.. నా గత స్మృతులు నన్ను వెంటాడుతున్నాయి.
ఇన్ని సంవత్సరాలకు ఆమెను కలవానికి మా వూరు వెళ్తున్నాను. ఇన్ని రోజులు ఆమెను గురించిన వివరాలు తెలుసుకోవాలని అనిపించినా తెలుసుకోలేదు. మా వూరు చేరుతున్నానని ఆనందం ఓప్రక్క, అన్నయ్యపరిస్థితి ఎలావుందోనన్న ఆలోచన ఓ ప్రక్క, అరుణ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం ఓ ప్రక్క నన్నావరించాయి... మా వూరుడొంకలో బస్సుదిగాను. నా కోసమే నా ఫ్రండ్ పాపిగాడు అక్కడ తన ట్రాక్టర్ పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఇద్దరి మధ్యమౌనం. నేను ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాను. కొంత సేపటి తర్వాత నేనే

''అరుణ ఎలా వుందిరా'' అని అడిగాను. వాడేం మాట్లాడలేదు.
''ఏరా రక్తసంబంధం గురించి ముందు అడుగుతావనుకున్నాను. అరుణగురించీ.....'' అని వాడు మాట్లాడలేదు. ముఖం సీరియస్‌గా పెట్టి ట్రాక్టర్ తోలుతున్నాడు.
'' పొరపాటేరా...ఇప్పుడడుగుతున్నాను. అన్నయ్యకెలావుంది.''
''ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. ఆచారిగారిచ్చిన ఆకుపసరుతో ప్రాణం నిలబడింది.''
''ఒరే పాపిగా....అరుణ ఇప్పుడు తన భర్తతో హాయిగా వుందా...''పాపిగాడు ట్రాక్టర్ ఆపేసాడు. నాకు అర్దం కాలేదు.
'' దిగరా ఇక్కడ '' అని నన్ను గదమాయించాడు. నాకేం అర్ధంకాలేదు. నా లగేజి పట్టుకొని దిగాను.
'' అరుణతో మ్లాడుతావా...?'' అని అడిగాడు. నేను కొద్దిగా మొహమాట పడుతూ అవును అన్నట్లు తలూపాను.
'' అయితే రా .... మాట్లాడు....'' అంటూ నన్ను మా వూరి చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. నాకేం అర్దం కాలేదు. వాడివంక ప్రశ్నార్థకంగా చూశాను.
'' అదిగో ఆ చెట్టుకింద పిచ్చిదానిలా వుందే . ఆమె నీ అరుణ. గుర్తుపట్టలేదా...చూడు...దగ్గరకు వెళ్ళి చూడు. నువ్వు వస్తావని ..నీకోసం ప్రతిరోజు ఇక్కడే ఎదురు చూస్తోందిరా.....కొంతకాలం ఊళ్ళో ఎవరికీ కనబడలేదు.మన ఊరి పొలిమేరల్లో ఒక రోజునా కంటబడింది. కనబడిన వాళ్ళని నువ్వే అనుకొని తనను పెళ్ళిచేసుకొమ్మని అడుగుతోందిరా..... ఎవడో అరుణను పాడుచేసి వదిలేశాడు. ఆరోజునుండీ చాలా మంది ఈ పిచ్చిదాన్ని ...'' అని వాడినోట మాటరాలేదు. ఆవేశంతో నా చెంపమీద కొట్టాడు. నా కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. అరుణ పరిస్థితిచూసి.
నిప్పులా గంభీరంగా వున్నఅరుణని చూశాను. నవ్వుతూ నన్ను పలకరించే అరుణను చూశాను. కానీ ఇప్పుడిలా తయారైన అరుణని చూసి తట్టుకోలేక పోతున్నాను. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగలేదు. అరుణ వద్దకు వెళ్ళాను. ఆమె నన్నుచూస్తూనే వచ్చి వచ్చేశావా... అంటూ ఆప్యాయంగా పలకరించింది. తనకు సర్వం నేను అయిపోయాను. తన తలపుల్లో అంతా నేనే నిండి వున్నాను. ఆ విషయం నాకు ఇప్పటికి తెలిసింది. మెల్లగా ఆమె ప్రక్కనుండి లేస్తుంటే ఆమె నా చెయ్యి పట్టుకుని దగ్గరకి లాక్కుంది.
''నేనొదలనమ్మానిన్ను .వదిలితే నువ్వెళ్ళిపోతావ్. మనం ఇప్పుడే పెళ్ళిచేసుకుందాం...'' అంటున్నట్లు ఆమె ఫీలింగ్ నాకనిపించింది. నేను ఆమెను వదిలి వుండలేక పోయాను.
కులాలు.. కట్టుబాట్ల వల్ల అరుణకిలాంటి పరిస్థితి వచ్చిందా.. కులాన్ని ఎదిరించి ఆనాడు ఆమెని నాదానిగా చేసుకుంటే బాగుండేది. నాకోసం అరుణ ఆరోజు ఎదిరించి వచ్చి వుంటుంది. అదే రోజు నేనూ తెగించి అరుణని నాతో తీసుకుపోయి వుంటే ఈరోజు అరుణకిలాంటి పరిస్థితి వచ్చి వుండేది కాదు. అరుణ జీవితం ఇలా అవ్వటానికి కారణం నేనే.. మొమ్మాటికీ నేనే అనుకుంటూ రకరకాలుగా నన్ను నేను నిందించుకున్నాను. ఎంత నిందించుకున్నా ఉపయోగం శూన్యం. అరుణ జీవితం బాగుపడాలి. తను కోరుకున్న జీవితం తిరిగి తనకివ్వాలి. నిజమైన ప్రేమికుడిగా అది నా బాధ్యత.. కాదు.. అది బాధ్యత కాదు.. అరుణపై నాకున్న ప్రేమ. పాపిగాడి వైపు చూస్తూ...
‘‘ రేయ్.. అరుణని ఇలాంటి పరస్థితుల్లో పూజారిగారు మాత్రం ఎలా వదిలేశార్రా.. ఊరంతా ఏం చేస్తోంది.. గొడ్డుబోయిందా..?’’ఆర్ధ్రత నిండిన గొంతుతో ఆవేశంగా ప్రశ్నించాను..
'' అరుణ కనబడక పోయే సరికి పూజారిగారు కొన్నిరోజులు ఈ విషయాన్ని గుట్టుగా వుంచారు. తర్వాత ఆనోటా.. ఈనోటా అరుణ కనిపించటంలేదని ఊరంతా పాకింది.. అరుణని నువ్వే లేపుకు పోయావని ఊళ్ళో పెద్ద గొడవ జరిగింది. మీ అన్నయ్యే ఈ విషయం నీకు చెప్పద్దన్నాడు. కనీసం నువ్వన్నా గొడవలకి దూరంగా కోరుకున్న అమ్మాయితో జీవితం గడుపుతావని అన్నాడు. నేనూ అదే అనుకున్నాను. పరువు పోయిన పూజారిగారింట్లో అందరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అరుణని ఈ స్థితిలో చూసింతర్వాత కానీ నాకు అర్థంకాలేదు. తను అనాధగా మారిందని.'' అంటూ విషయం చెప్పాడు.
అరుణని చూసిన నాకు జాలివేసింది. ఆమెను తీసుకొని మా ఇంటికి బయల్దేరాను. ఊరు ఊరంతా నన్ను దోషిని చూస్తున్నట్లు చూస్తోంది. అరుణ చిటికిన వేలు పట్టు నడిపిస్తున్నాను. పాపిగాడు నా వెనుకే వస్తున్నాడు. శివాలయం ముందుగా వెళుతున్నాను... అరుణ ఆగిపోయింది.. దేవాలయం వైపు కన్నార్పకుండా చూస్తోంది. కోనేరు గట్టువైపు నన్ను లాక్కెళుతోంది.. అలా కొన్నిసంవత్సరాల తర్వాత...... ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. అరుణ తిరిగి మామూలు మనిషవ్వానికి చాలాకాలం పడుతుందంటున్నారు డాక్టర్లు.

ఎవడో కామాంధుడి వల్ల అరుణ గర్భంపొందింది. ఎర్రగడ్డ మానసికవికలాంగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పేష్‌ంతో ఏదో విషయమై గొడవ పడింది. ఆటైంలో ఆ పేష్‌ం ఆరుణని బలంగా తోసింది. అంతే అరుణ వెళ్ళి గోడకు గుద్దుకుంది. ఆమె పొట్ట గోడకు తగలటం వల్ల గర్భసంచి తొలగించక తప్పలేదు.
అరుణను అక్కడ వుంచటం క్షేమం కాదని డాక్టర్ల పర్మిషన్ తో నా ఇంటికి తెచ్చుకున్నాను. అయితే తను ఇంటికొచ్చిన దగ్గర నుండి ఇప్పుడిప్పుడే మన లోకంలోకి వస్తోంది. అదే చిలిపిదనం. అంతే గాంభీర్యం. అప్పుడప్పుడూ ఎడతెగని మౌనం....ఆమె మాటల్లో మునిపికన్నా లోతైన భావం కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తను పాత అరుణమాత్రం కాదు. సమ్‌థింగ్ స్పెషల్.
అందుకే గతించిన గతంలో ఎన్నో జ్ఞాపకాలు అందులో కొన్ని తీపివి మరెన్నో చేదు సంఘటనలు. కలలుకంటుంటే ఎంతో హయి గా వుంటుంది కానీ జీవిత”మే ఓ కలగా మిగిలిపోయింది... ప్రస్తుతం సమాజం దృష్టిలో నేను ఒక పిచ్చిదాని ఉంచుకున్న వాణ్ణి.ఎవ్వరేమనుకున్నా తను నాకు చిన్న పిల్లతో సమానం. మేమిద్దరం ప్రేమామృత సాగరంలో ఉంటున్నామన్నది మాత్రమే నిజం.....
అరుణ చక్రిలు విడిపోయిన రోజు అరుణ జీవితంలో ఏం జరిగింది? తాళిబొట్టు ఆమె ఎందుకు చూబించింది? ఈ ప్రశ్నకు సమాధానం అరుణనే అడిగి తెలుసు కోవాలి. అరుణని అడగాలంటే తను మామూలు మనిషి అయ్యేదాకా ఆగాల్సిందే...
శుభం