అనంతపురం ఆచారికి, అణ్ణామలై అలివేలుమంగకు అంతర్వేదిలో అంగరంగవైభవంగా ఆరునెలల క్రితమే వివాహం జరిగింది. వారిద్దరికీ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే -- మనం వారి గతంలోకి చూడాలి.
అణ్ణామలైలో పుట్టి పెరిగిన అలివేలుమంగ తెలుగింటి ఆడపడచు అయినా, సవతితల్లి తమిళ మహిళ కావడంతో తమిళ సాంప్రదాయంలోనే పెరిగింది. స్కూల్ ఫైనల్ వరకూ అణ్ణామలైలో చదివి, తిరుపతిలో ఉండే పెద్దనాన్నగారింట్లో ఉండి సంగీత కళాశాలలో సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటూంది. అక్కడ పరిచయం ఏర్పడిన కొంతమంది తెలుగు స్నేహితురాళ్ళ సహవాసంతో, తెలుగు మాట్లాడడం అర్ధం చేసుకోవడం బాగానే అబ్బింది.
సంగీత కళాశాల పక్కన ఉండే వేదపాఠశాలలో వేదాభ్యాసం చేసే ఆచారి అక్కడ ఉన్న తమిళ సహాధ్యాయుల సహకారంతో తమిళం మాట్లాడడం అర్ధం చేసుకోవడం బాగానే నేర్చుకున్నాడు.
ఒక రోజు సాయంత్రం సంగీత కళాశాల బయట నిలబడి ఆటో కోసం వేచి ఉన్న అలిమేలుమంగకు ఎంతసేపటికీ ఆటో కానీ సిటీ బస్సు కానీ దొరకలేదు.
వేదకళాశాల బయటకు వచ్చి తన మోటార్ సైకిల్ మీద వెళ్ళబోయిన ఆచారి కళ్ళలో అలిమేలుమంగ చక్కగా చోటుచేసుకుంది.
అదే సమయంలో అలవోకగా ఇటు తల తిప్పిన అలిమేలుమంగ కళ్ళలో ఆచారి అందంగా ఆసనం వేసుకున్నాడు.
ఆచారికి -- 'వీరాభిమన్యు' సినిమాలో అభిమన్యుడు (శోభన్ బాబు) ఉత్తర (కాంచన) మధ్యన చిత్రీకరించబడిన – 'రంభా ఊర్వశి తలదన్నే' గీతం --- గుర్తుకి వచ్చి మౌనంగా మనసులో ఆలపించసాగేడు.
కాకతాళీయంగా అలిమేలుమంగకి కూడా అదే పాట జ్ఞప్తికి వచ్చి --‘ఇంద్రుని చంద్రుని అందాలు’ అంటూ మౌనంగా మనసులో ఆలపించసాగింది.
పది నిమిషాల తరువాత, ఆమె పరిస్థితి చూసి, పురుషుడైన తానే ముందు అడుగు వేయాలి అని నిర్ణయించుకున్న ఆచారి తన మోటార్ సైకిల్ ని ఆమె ముందు నిలబెట్టి –
"క్షమించండి, మీరు ఆటో కోసం కానీ బస్సు కోసం కానీ వేచి చూస్తునట్టున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆటో వారికి బస్సు వారికి జరిగిన గొడవలు ఇంకా తేలక, ఆ రెండు వాహన సదుపాయాలూ ఈరోజుకి మరి దొరికేటట్టు లేదు అని వార్త. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, నా మోటార్ సైకిల్ మీద దింపేస్తాను"
"ఆ వార్త నాకు తెలీదు, నేను నడిచి వెళ్తాను లెండి. నాలుగు కిలో మీటర్లు నడిస్తే, మా ఇల్లు వచ్చేస్తుంది. మీకెందుకు శ్రమ"
"భలేవారే, నాలుగు కిలోమీటర్లు నడుస్తారా. వేదాధ్యయనం చేస్తున్న నన్నే మీరు అనుమానిస్తే ఎలా చెప్పండి. నన్ను నమ్మి నావెంట రండి. మీకొచ్చే భయమేమీ లేదు"
"అది కాదండి, నేనెవరో మీకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. అందుకే ...."
-2-
"అంతేనా, నా పేరు ‘కూర్మాచారి’. అందరూ ‘ఆచారి’ అంటారు. ఇక్కడే ఉన్న వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నాను. మా ఊరు అనంతపురం. ఇదే నా పరిచయం. ఇంక, మీ పరిచయం తెలుపుతే, మనం ఒకరినొకరం తెలిసినవాళ్లమైపోతాము"
ఒక్కసారిగా ముత్యాలు కురిసినట్టుగా నవ్విన అలిమేలుమంగ "మీరు భలే చక్కగా మాట్లాడతారే, నా పేరు ‘అలిమేలుమంగ’, అందరూ ‘మంగ’ అంటారు. ఈ సంగీత కళాశాలలో సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్నాను. మా ఊరు అణ్ణామలై. ఇదే నా పరిచయం"
"ఇప్పుడు మన పరిచయాలు అయిపోయేయి కాబట్టి, ఇంకేమీ ఆలోచించక నాతో రండి. మీరెక్కడికి వెళ్ళాలో చెపితే మీకు దింపి, నేను కపిలేశ్వరమందిరంకి వెళ్తాను"
"మా ఇల్లు అలిపిరి దగ్గరున్న ఇస్కాన్ మందిరంకి దగ్గరే"
"మరేం, మన దారులు కూడా ఒకటే, పదండి" అని ఆమెని ఎక్కించుకొని వెళ్లిన ఆచారి మోటార్ సైకిల్ ని ఇస్కాన్ మందిరం దగ్గర ఆపి "ఇక్కడ మీరుండేది ఎక్కడ"
"నేను ఇక్కడ దిగిపోతాను. మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గరే"
"ఇక్కడే ఎందుకు, మీ ఇంటి దగ్గర దింపుతాను పదండి"
"వద్దండీ. నేను వెళ్ళిపోతాను"
"సరే. నేను అర్ధం చేసుకున్నాను. మిమ్మల్ని బలవంతపెట్టను. కానీ, ప్రతీరోజూ మీకు ఇలా సేవ చేసుకునే భాగ్యాన్ని కలగచేయమని వేడుకుంటున్నాడు ఈ దీనుడు" అని కాస్త నాటకీయంగా మాటాడిన ఆచరితో--
"మీకెందుకండీ రోజూ శ్రమ"
"శ్రమ ఏమిటండీ. నేనేమేనా మిమ్మల్ని మోస్తానా, ఎత్తుకుంటానా. ఆ భాగ్యం నా మోటార్ సైకిల్ ది మాత్రమే. నేనేలాగా రోజూ ఈ సమయాన మందిరంకి వెళ్ళేది ఉంది కాబట్టి, మీ సేవా భాగ్యం కోరుతున్నాను, అంతే"
"మీ మాటలు చాలా బాగుంటాయండీ."
"అంటే నా మాటలే కానీ నేను బాగుండనన్నమాట"
"అబ్బే, నా ఉద్దేశం అది కాదండీ. మీరు కూడా చాలా బాగున్నారు"
"ఏదో మాటవరసకన్నారు కానీ, మీ అంతగా నేను బాగులేనని నాకు తెలుసులెండి"
"అయ్యో అలా అనుకోకండి ప్లీజ్. మీరు, మీమాటలు, అన్నింటికీ మించి మీ సంస్కారం అన్నీనాకు నచ్చేయి" అన్న
అలిమేలుమంగ - నాలుక కరచుకొని సిగ్గుతో తలవంచుకుంది.
"మీ మనసులో మాట ఎంతో సూటిగా చెప్పిన మీరు కూడా నాకు చాలా నచ్చేరు. రేపటినుంచి, మీ సేవాభాగ్యం నాకు ప్రసాదించినట్టే కదా"
"ఒక్క కండిషన్ తో. ఆ అండీ గిండీ వదిలి, ‘అలిమేలు’ అనో ‘మంగ’ అనో పిలుస్తానంటేనే"
"మహద్భాగ్యం! ఆ రెండు పేర్లలో ఏ పేరుతో మిమ్మల్ని పిలవమంటారో మీరే చెప్పండి"
"అందరూ నన్ను 'మంగ' అంటారు, మీరు 'అలిమేలు' అని పిలవండి. అంతే కాదు, మీరు నన్ను బహువచనంతో కాకుండా ఏకవచనంతో పిలవాలి, సరేనా"
"జీ హుజూర్" అని 'అందమే ఆనందం' పాట పాడుకుంటూ హుషారుగా వెనక్కి బయలుదేరేడు ఆచారి.
-3-
ఆచారితో కలిగిన తొలి పరిచయాన్ని మనసులో మధురంగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళింది 'అలిమేలు'.
అలా ప్రారంభమైన ఆచారి మంగల పరిచయం దినదినాభివృద్ధి చెందినదై ఇరువురి మనసులు ఒకటై పెద్దలకు తెలియచేసి త్వరలో మనువాడే నిర్ణయానికి వచ్చేరు. ఇరువురూ వారి వారి ఇళ్లలో వారి ప్రేమని చెప్పి పెద్దల ఆశీర్వాదం అభిలషించేరు. ఇద్దరూ తెలుగు కుటుంబాలు అవడం ఆస్తిపాస్తులు కలిగి ఆచార వ్యవహారాలు పాటిస్తున్న కుటుంబాలు అవడంతో పిల్లల ప్రేమని కాదనడం ఇష్టం లేని పెద్దవాళ్లు ‘శుభస్య శీఘ్రం’ అన్నారు.
ఇలా వివాహం కుదరడం ఏమిటి, అలా ఆచారికి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడిలో అర్చకుడిగా నియామకం రావడంతో - అందరూ ‘పిల్ల వచ్చిన వేళ’ అని అలివేలుమంగని అందలం ఎక్కించేరు.
ఆచారికి కూడా తనకు అదృష్టం తెచ్చిన అలివేలు మీద ప్రేమ, అనురాగం, అభిమానం పెరిగేయి.
పెళ్ళికి ముందర ఆడపెళ్లివారింటికి వెళ్లిన ఆచారి తల్లి తండ్రులు పెద్దనాన్న దంపతులకు అలిమేలుమంగ ఇంట్లో ‘మధురై సాంప్రదాయం’ అనిపించింది. ఆ ఆలోచన నిజమే అని వారు రూఢి అయేటట్టుగా అలిమేలుమంగ సవతితల్లి తమిళ సాంప్రదాయంలోనే వివాహం జరిపిస్తామని పట్టుపట్టేరు. అలిమేలుమంగ తండ్రి 'అంతే అంతే' అంటున్నారు నెమ్మదిగా. ఆచారి తల్లి తండ్రులకు అప్పుడే తెలిసింది ఆమె ‘తమిళ మహిళ’ అని.
పెళ్ళైన తరువాత అత్తవారింటికి పంపిస్తూ అలమేలుమంగతో ఆమె సవతి తల్లి "మంగా, మన ఇంట్లో ఆడపెత్తనం అన్న సంగతి నీకు తెలిసిందే. నీ కుటుంబం కూడా అలాగే నడవాలని ఆశీర్వదిస్తున్నాను. భర్తని మొదటి నుంచి నీ చెప్పు చేతులలోనే ఉంచుకోవాలి, లేకపోతే, ఏకు మేకైన మొగుడితో వేగలేక నానా అల్లరి అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త" అని, అలా భర్తని చెప్పు చేతులలో ఉంచుకోవడానికి కావసిన కొన్ని చిట్కాలుకూడా చెవిలో నూరిపోసింది.
అమ్మ హితబోధతో కాపురానికి వెళ్లిన మంగ ఆ హితబోధ -- తనదైన ఇంట్లో అవసరానికి దాచుకొని --అత్తవారింట్లో ఉన్నన్ని రోజులూ అణుకువగా మసలుకొని, అత్తా మామల మనసులు గెలుచుకుంది. వారు కోరినప్పుడల్లా సాంప్రదాయ సంగీత కీర్తనలు వినిపిస్తూ ‘మా బంగారు కోడలు’ అనిపించుకుంది.
తరువాత, సఖినేటిపల్లిలో ఉన్న భర్తతో కాపురానికి వెళ్ళింది అలిమేలుమంగ - తనదైన ఇంటికి. ఆచారి సఖినేటిపల్లి అంతర్వేది మధ్య మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు.
భార్య కాపురానికి వచ్చిన రోజున ఆచారి మందిరంనుంచి ప్రసాదాలు తెచ్చేడు.
"ఏమండీ, మీరు మందిరంలో అర్చకులు కాబట్టి ఈ ఒక్క రోజుకి ఇలా తేగలిగేరా లేదా రోజూ తెచ్చుకోవొచ్చా"
"మనకి కావలిస్తే, రోజూ తెచ్చుకోవొచ్చు అలిమేలూ. ఎంత ప్రసాదమైనా రోజూ పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి అంటే తినడం కొంచెం కష్టమే. సరుకులు ఏమేమి కావాలో లిస్ట్ ఇచ్చేవంటే, సాయంత్రం అవన్నీ తెస్తాను. ఎంచక్కా నువ్వు వంట చేస్తూంటే, మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఇంటి భోజనం చేద్దాం. ఇక్కడ గుడిలో చేరిన దగ్గరనుంచి
-4-
ఈరోజు వరకూ మందిరం ప్రసాదాలు తింటున్నా, మధ్య మధ్యలో నాలుగేసి రోజులకోసారి చెయ్యి కాల్చుకునేవాడిననుకో. నువ్వు వచ్చేసేవు కాబట్టి, ఆ అవస్థ తప్పింది నాకు.
"ఏమిటీ, మీకు వంట చేయడం కూడా వచ్చా!" అంది అలిమేలు ఆశ్చర్యంగా.
"అదేమీ బ్రహ్మ విద్య కాదు కదా"
"ఏమో నాకైతే బ్రహ్మ విద్యే బాబూ"
ఉలిక్కిపడిన ఆచారి - "అంటే, కొంపతీసి నీకు వంట రాదేమిటి "
"అవునండీ, మీరు ఇట్టే పసిగట్టేసేరే! మావారు మహా తెలివైనవారు”
“నా తెలివి సంగతి అటుంచి నీకెందుకు వంట రాదో చెప్పు”
“మా పుట్టింట్లో మా పిన్ని వంట చేస్తూ నాకేమేనా దెబ్బలు తగిలితే లోకం అంతా సవతితల్లి వలననే అంటారని నన్ను వంట ఇల్లు దరిదాపులకే రానివ్వలేదు. ఇక అత్తవారింట్లో, మీ అమ్మగారు 'అబ్బాయి దగ్గరకి వెళితే ఎలాగా నీకు వంట తప్పదు, ఇక్కడుండే కొద్ది రోజులు వంటగది ఛాయలకి కూడా రావొద్దు' అని ఆర్డర్ వేసేరు. అత్తగారి మాట జవదాటకూడదు కదా. అందుకే, నేను అత్తవారింట్లో కూడా వంట ఇల్లు ఎక్కడుందో తెలుసుకోలేకపోయేను"
కొంచెంసేపు విచారించిన ఆచారి - "సరే, రేపటినుంచి నేను నీకు వంట ఎలా చేయాలో నేర్పుతాను, నేర్చుకుందువుగాని, బెంగపడకు." అనగానే, ‘పగటివేళ’ ఆ సంభాషణ అంతటితో ముగిస్తే మంచిది అనుకున్న అలిమేలు మౌనం పాటించింది.
ఆరోజు రాత్రి ఆలుమగల ఆతృత తీరి ఒకరినొకరు హత్తుకొని ఊసులాడుకుంటూంటే - ఆచారి గుండె మీద చేత్తో మెల్లిగా వ్రాస్తూ గోముగా అలిమేలు --
"ఏమండీ, నేనొక మాట చెప్తాను వింటారా"
కొత్త పెళ్ళాం అందించిన ‘మలి’ అనుభవం మనసుని కమ్మేస్తుంటే, మైకం కమ్ముకున్న ఆచారి -
"ఒకటేమిటి, నువ్వెన్ని చెప్పినా నేను వింటాను, వినవలసిందే"
"అలా అయితే, చెప్పమంటారా"
"నీ ఇష్టం వచ్చింది చెప్పు. చెప్పడం కాదు, శాసించు" అన్నాడు ఆచారి అలిమేలుని దగ్గరకి తీసుకుంటూ.
"మనకి రోజూ మందిరంనుంచి ప్రసాదాలు తెచ్చుకునే సౌలభ్యం ఉన్నప్పుడు ఇంట్లో వంట చేసుకోవడం, నాకు వంట రాదు కాబట్టి మీరు నేర్పడం, ఇన్ని కష్టాలెందుకండీ. హాయిగా రోజూ ప్రసాదసేవనం చేస్తూ తిండి ఖర్చు లేక గడుపుదాం. ఏమంటారు. అలాగేనా"
"అలాగేలే, నువ్వెలాగంటే అలాగే. ముందు నువ్వు ఇంకొంచెం దగ్గరకు రా. లేకపోతే, మనమధ్య చలిగాలి దూరిపోతుంది"
"మీ మాట నేనెందుకు కాదంటానండీ" అని - అలిమేలు భర్త మాటని శిలాశాసనంలా పాటించింది.
ఎప్పుడేనా అలిమేలుకు వంట నేర్పుదామని ఆచారి ప్రయత్నం చేయబోతే, అలిమేలు తన శృంగార చేష్టలతో సరస సల్లాపాలతో భర్తని వంటగదిలోనుంచి పడకగదికి దారి చూపేది.
-5-
అలా వ్యవహరించే భార్యతో - కాపురానికి వచ్చేముందర అప్పుడప్పుడేనా ఇంటి భోజనం చేసే ఆచారికి, పాపం భార్య కాపురానికి వచ్చిన తరువాత కూడా ఎప్పుడూ మందిరంలోంచి తెచ్చిన ప్రసాద సేవనమే ఇంటి భోజనంగా పరిగణించింది.
వారం రోజుల తరువాత మంగ తల్లితండ్రులు వచ్చేరు. వారికి కూడా మందిర ప్రసాదమే రోజువారీ భోజనం.
వారు వచ్చిన మూడో రోజు, మంగ నాన్నగారు బయటకు వెళ్లి వచ్చేసరికి – మంగ, సవతితల్లి మాటలు వినవచ్చి లోపలికి పోకుండా బయటే ఆగి వారి మాటలు వినసాగేడు.
"వంట పెంట అక్కరలేకుండా ప్రతీ రోజూ మందిర ప్రసాదాలు తినడం బాగుంది కదే మంగా. నాకైతే, కానీ ఖర్చు లేకుండా, ప్రతీ రోజూ మందిరం నుంచి అల్లుడు తెచ్చే ప్రసాదాలు, తింటూ హాయిగా మీ ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తోంది"
"కానీ ఖర్చు లేదు నిజమే కానీ, నేను కాపురానికి వచ్చిన తరువాత కూడా ప్రతీ రోజూ అవే తినలేక ఆయన పడుతున్న అవస్థ చూస్తూంటే, నాకు జాలి వేస్తోంది పిన్నీ. ఏదో ఒకరోజు ఆయన వచ్చేసరికి వంటచేసి భర్తకి తృప్తిగా తిండి పెట్టే ఇల్లాలిని అనిపించుకోవాలనిపిస్తోంది."
"అలాంటి తప్పు పొరపాటున కూడా చేయకు. నీకు వంట రాదని అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది"
"తెలిస్తే తెలియనీ పిన్నీ. నాలుగు తిట్లు తిడతారు, మరీ కోపం వస్తే ఓ దెబ్బ వేస్తారు, అంతేకదా. ఆయనని మోసం చేయడం భరించలేకపోతున్నాను. నీ మాటలు వినకపోవలసింది. నేను భరించలేకపోతున్నాను. పది రోజులకే ఇలా అనిపిస్తోందంటే, ఆయనని క్షమించమని అడిగితే కానీ నాకు ప్రశాంతత ఉండదు అనిపిస్తోంది"
"అప్పుడే కాదు ఇప్పుడు కూడా మళ్ళా చెపుతున్నాను, జాగ్రత్తగా విను. భర్తని పెళ్ళైన మొదటోనే దారికి తెచ్చుకోవాలి, లేకపొతే నీది బానిస బ్రతుకైపోతుంది. ఈ పిన్ని సవతితల్లి కాబట్టి నా బాగోగులు పట్టించుకోలేదు అని నన్నాడిపోసుకుంటే అప్పుడు లాభమేముండదు. ఆ పైన నీ ఇష్టం"
ఒక్క సారిగా లోపలి వచ్చిన మంగ తండ్రి భార్య జబ్బ పట్టుకుని నిలబెట్టి దబా దబా అని ఆవిడ వీపు మీద రెండు దెబ్బలు వేసి "అమ్మాయిని కాపురానికి పంపుతున్నప్పుడు 'నేను అమ్మాయి కాస్సేపు మాట్లాడుకోవాలి మీరు ఆవల గదిలోనే ఉండండి’ అని నాకు చెప్పి, అమ్మాయికి నువ్వు చెప్పినవి ఈ వెధవ బుద్ధులా. అమ్మాయి కాపురం పాడుచేస్తున్న నిన్ను ఏమి చేసినా పాపం లేదు. ఈ ఇంట్లో ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. నిన్ను అంతర్వేది వరకూ బాదుకుంటూ వెళ్లి అక్కడ ‘సంగమం’ లో కలిపేసి, స్నానం చేసి వస్తాను నేను" అని ఆ గది మూలన ఉన్న కర్ర ఎత్తి పట్టుకున్నాడు భార్యని కొట్టడానికి. వెంటనే, భర్తకి చిక్కకుండా 'ఆమ్మో బాబో' అని ఆవిడ ఇల్లంతా కలయతిరగనారంభించింది.
*****
--- మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు, Mob:9164543253, e-mail : [email protected]
శ్రీరామ
ఉద్బోధ