విదురుడు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Vidurudu

ధృతరాషృనికి విదురుడు,సంజయుడు,కణికుడు అనే ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు.విదురుడు ధృత రాష్ట్రుడికి తమ్ముడు అవుతాడు. అయితే అంధుడు కావడంతో ధృతరాష్ట్రుడికి మొదట రాజ్యం అప్పగించలేదు. పాండురాజు మరణించాక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం వస్తుంది. వాస్తవానికి అప్పుడు విదురుడికి బాధ్యతలు అప్పగించాలి కానీ విదురుడి పుట్టుక వెనుకున్న కథ వల్లే అతనికి రాజ్యాధికారం రాలేదు. దేవరన్యాయంతో తనకోడళ్ళకి సంతతి ప్రసాదించమని వ్యాసమహర్షిని సత్యవతి కోరుకుంటుంది.అంబికకు గుడ్డివాడు పుడతాడని వాళ్ల అత్తకు తెలుస్తుంది. దీంతో ఆమె మళ్లీ కోడల్ని వ్యాసమహర్షి దగ్గరకు పంపాలనుకుంటుంది. కానీ వ్యాసుడి వేషధారణ చూసి భయపడిన ఆ కోడలు తన దాసికి అసలు విషయం చెబుతుంది. దయచేసి నా కోరిక మన్నించి ఆ వ్యాసుడి దగ్గరకు నువ్వు వెళ్లు అని కోరుతుంది. తన మాదిరిగానే వేషం వేసి దాసిని వ్యాసుడి దగ్గరకు పంపుతుంది. ఆమె వ్యాసుడు చెప్పినట్లు శ్రద్ధగా అతనికి సహకరిస్తుంది.దీంతో ఎంతో జ్ఞానం కలిగిన విరుదుడు దాసికి జన్మిస్తాడు.ఎంతో జ్ఞానం ఉన్నా కూడా దాసికి పుట్టాడని అతనికి రాజ్యాన్ని అప్పగించలేదు. అయినా విదురుడు కూడా రాజ్యం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ధృత రాష్ట్రుడికి మంత్రిగా ఉంటూ తన సేవలు అందిచాడు.

అయితే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టగానే విరుదుడు అతని జాతకం మొత్తం అన్నకు చెబుతాడు. అన్నా.. దుర్యోధనుడు మన వంశాన్ని నాశనం చేసేస్తాడు.. ఇతనికి అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని చెబుతాడు. కానీ ధృతరాష్ట్రుడు కొడుకంటే అమితమైన ప్రేమ ఉండడం వల్ల విరుదుడి మాట అస్సలు లెక్కచెయ్యడు. ఇక ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి పిలుచుకురావడానికి కూడా విదురుడినే వాడుకుంటాడు. విదురుడంటే ధర్మరాజుకు ఎంతో నమ్మకం.ఇక ధృతరాష్ట్రుడు అంధుడుకావడంతోనే అతనికి అన్ని రకాలుగా అండగా నిలిచి రాజ్యపాలనతో సలహాలిస్తాడు విదురుడు. ధృతరాష్ట్రుడికి ఏ కష్టం వచ్చినా సరే మొదట విదురునితోనే చెప్పుకునేవాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక రాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నో సార్లు వివరిస్తాడు. విదురుడి నీతి సూత్రాల్లో కొన్ని....

"ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇతరుల విషయంలో ఎప్పుడూ ఈర్ష్య ఉండకూడదు. పొగడ్తలకు ఎప్పుడూ కూడా పొంగిపోకూడదు. పాలించే వాణ్ని, దేవుణ్ని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. తెలివి తక్కువ వాళ్లు ఏం చేస్తారంటే... తమను ఎక్కువగా ఇష్టపడే వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమను ఎక్కువగా ద్వేషించేవారిపై ఇష్టం పెంచుకుంటారు.

ఒంటిరిగా ఉండడం, ఒంటిరిగా ఆలోచించడం, ఒక్కడే తినడం, ఒక్కడే ప్రయాణాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఈ ప్రపంచంలో క్షమాపనకు మించినది ఇంకొకటి లేదు. ఇతరు స్త్రీల పట్ట వ్యామోహం ఉండకూదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు."మిత్రుడిని ద్వేషించకూడదు. అలాగే ఎవరి శ్రేయస్సు అయితే మనం కోరుకుంటామో వాళ్లకు మంచి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నా కూడా ధర్మాన్ని వీడకూడదు. విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలనే నమ్మాడు."పాండువులకు సహకరించాడనే కారణంతో ఒకసారి దృతరాష్ట్రుడు విదురుడిని తన దగ్గర నుంచి వెళ్లిపొమ్మని కోప్పడుతాడు. కానీ విదురుడు వెళ్లిపోగానే మళ్లీ పిలుపించుకుంటాడు. విదురుడి లేకుండా ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao