మన కథ అందమైన వైజాగ్ నగరం లో -
కొన్ని సంవత్సరాల ముందు మొదలైంది.
రవి చాలా తెలివైన విద్యార్థి. చిన్నప్పటి నుంచి చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉండేవాడు. టెన్త్ లో టాప్ 10 లోపు స్టేట్ రాంక్ వచ్చింది. రవి కు ఇంటర్ లో కూడా మంచి మర్క్స్ వచ్చాయి. ఇప్పుడు డిగ్రీ కాలేజీ లో జాయిన్ అవ్వాలి. కౌన్సిలింగ్ లో వైజాగ్ సాగర తీరానికి చేరువలో పేరున్న డిగ్రీ కాలేజీ లో సీట్ వచ్చింది.
కాలేజీ మొదలైంది. రవి మొదటి రోజు టిప్ టాప్ గా రెడీ అయి వెళ్ళాడు. కాలేజీ 5 అంతస్తుల పెద్ద భవనం. కొత్తగా రంగులు వేసి అందంగా ఉంది. పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, దూరం నుంచి వీచే చల్లటి సముద్రపు గాలి. ఎన్నో ఆశలతో, హుషారుగా అబ్బాయిలు, అమ్మాయిలు కాలేజీ గేట్ దాటి లోపలికి వస్తున్నారు.
కో-ఎడ్యుకేషన్ కాలేజీ అవడం వలన, అబ్బాయిలు చదువు కోసమే కాకుండా, వాళ్ళ కలల రాణి దొరుకుతుందేమో నని మనసులో ఒక ఆశ తో కాలేజీ లో అడుగు పెట్టారు. రవి చదువులో టాప్ ఐన, వయసులో ఉన్నాడు కాబట్టి, తన కలల రాణి కోసం ఆరాటం అయితే మనసులో ఉంది. తనకు రాత్రి వచ్చిన కల గుర్తుకొచ్చింది.
రాత్రి, అమ్మ పెట్టిన భోజనం చేసిన తర్వాత పడుకున్నాడు. రవి గాఢ నిద్రలో ఒక అందమైన కల లోకి జారుకున్నాడు. కల లో ఒక అందమైన అమ్మాయి:
ప్లైన్ కలర్ చూడీదార్ వేసుకొని,
గుండ్రటి మోము తో,
విశాలమైన నుదురు,
మరీ పెద్దది కాకుండా నుదిటి పై బొట్టు,
పద్మము లాంటి కళ్ళు,
లిప్స్టిక్ లేని మృదువైన దొండ పండు లాంటి పెదాలు,
నాజూకు మెడ,
ఇంపుగా వక్ష సౌందర్యం,
వాలు జడ,
కొంచం హీల్స్ ఉన్న చొప్పులు వేసుకొని, హంస లాగా తన వైపు నడచుకుంటూ వస్తోంది.
సడన్ గా, రవి కి తెలివొచ్చి చుస్తే తెల్లారింది. కాలేజీ మొదటి రోజు కు రెడీ అవ్వాలి అనుకున్నాడు.
కాలేజీ మొదటి రోజు క్లాసులు లేవు. సరదాగా గడిచింది. రవి కి రాజు, రాము ఇద్దరు కొత్త స్నేహితులు. అందరిది, ఒకటే వయసు, అభిరుచులు కావడం తో మొదటి రోజే మంచి స్నేహితులయ్యారు. ఎక్కడకు వెళ్లిన ముగ్గురు కలసి వెళ్ళేవారు. కాలేజీ తర్వాత, బస్టాప్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ లో కలిసేవారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సమోసా తినేవారు. రవి కి సమోసా అంటే చాలా ఇష్టం.
డిగ్రీ మొదటి సంవత్సరం చాలా సంతోషంగా గడచింది. ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది. పేపర్స్ చాలా టఫ్ గా వచ్చాయి ఆ సంవత్సరం. రవి కూడా చాలా కంగారు పడ్డాడు. మార్క్స్ తక్కువ వస్తాయేమో నని భయపడ్డాడు. అయినా సరే, ఎగ్జామ్స్ బాగా వ్రాయడానికే ప్రయత్నించాడు.
ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. రవి భయపడ్డట్టుగానే మర్క్స్ తక్కువ వచ్చాయి. కొంచం డిప్రెషన్ కి గురి అయ్యాడు. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంట్లో చెప్పిన పనులు చేయాలనిపించేది కాదు. ఇంతటి పరిస్థితి లో కూడా తనకి ఉన్న ఆనందం ఇంట్లో ఉన్న ఆక్వేరియం. ఆ చేపల్ని చూస్తూ, కొంచం రిలాక్స్ అయ్యేవాడు.
కాలేజీ సెలవుల తర్వాత ఓపెన్ చేసారు. డిగ్రీ రెండవ సంవత్సరం లోకి వచ్చాడు రవి.
డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. రెండవ అంతస్తులో సెకండ్ ఇయర్, మొదటి అంతస్తులో ఫస్ట్ ఇయర్ క్లాసులు. అంతవరకూ దిగులుగా ఉన్న రవి కి, కాలేజీ మెట్లు ఎక్కుతుండగా, వస్తున్నా ఫస్ట్ ఇయర్ అమ్మాయిలలో తాను కలలో చూసిన అమ్మాయి అచ్చంగా తనకు ఎదురుగ వస్తోంది. మనసులో దిగులు అంతా గాల్లోకి ఎగిరిపోయింది. ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాడు. తన తో ఎలా మాట్లాడాలో తెలియదు. కొందరు సీనియర్స్, ఫ్రెషర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నారు. రవి కి ర్యాగింగ్ అంటే ఇష్టం లేకపోయినా, వేరే దారి లేక ఆ అమ్మాయి ఉన్న క్లాస్ దగ్గరకి వెళ్ళాడు.
"లతా! తొందరగా రావే!" అని తన కలల రాణి ని పిలవడం విన్నాడు.
"లత! ఆహా! ఎంత మంచి పేరు. లత కి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ కలసి ఈ కాలేజీ లో జాయిన్ అయ్యారని తెలిసింది.
రవి తనని లత కు పరిచయం చేసుకున్నాడు. లతను దగ్గరగా చూడడం అదే మొదటి సారి.
ఏమి అందం! అందానికి తగ్గట్టు అమాయకత్వం, నెమ్మదిగా నడచుకొనే ఆ స్వభావం!
"ఓ మంచి దేవుడా! నా కోసం ఇంత మంచి అమ్మాయిని కాలేజీ కి పంపించినందుకు ధన్యవాదాలు!"
లత తక్కువగా మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ లాగ కాదు.
రోజూ, అలా ర్యాగింగ్ పేరుతో లతని కలసి, కబుర్లు చెబుతూ ఉంటే రవి కి అసలు ఈ ప్రపంచం తో సంబంధం లేనట్టుగా ఉండేది. లత కూడా రవి తో ఇష్టంగానే మాట్లాడేది.
ఇలా, ఒక రోజు రవి బస్టాప్ లో కాలేజీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. అనుకోకుండా లత అక్కడకు వచ్చింది. లత ఫ్రెండ్స్ తో రాలేదు. ఇదే మంచి అవకాశమని, రవి లత తో పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకున్నాడు. లత కి ఇష్టమైన రంగులు, ఇష్టమైన ఫుడ్, పుట్టినరోజు, ఇష్టాలు - అన్నీ తెలుసుకున్నాడు.
లత తనకి ఇంట్లో ఇంజనీరింగ్ లో సీట్ కోసం ట్రై చేస్తున్నారని చెప్పింది. ఒకవేళ వస్తే, మా ఇంట్లో పంపించేస్తారు అని చెప్పింది. లత కి సీట్ రాకూడదని రవి కోరుకున్నాడు.
కొన్ని రోజుల్లో,ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. రవి కంప్యూటర్ ల్యాబ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్ వర్క్స్ లో లత కు, వాళ్ళ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేసేవాడు.
ఫ్రెషర్స్ పార్టీ కాలేజీ అనౌన్స్ చేసింది. ఆ పార్టీ టైం లో రవి లత కోసం చూసాడు. లేడీస్ వరసలో బాగా ఫ్రంట్ లో కూర్చుంది. రవి "హాయ్" పాస్ చేసాడు లత కి. లత వెనకకు తిరిగి "హాయ్ అని చిరునవ్వుతో చెప్పింది." ఆ నవ్వు ఎక్కడో గుచ్చుకుంది రవి కు. ఇంతవరకు లత అలాగా స్మైల్ ఇచ్చింది లేదు. ఒక స్లిప్ రాసి పాస్ చేసాడు. లత ఓపెన్ చేసి చూసింది. అందులో " లతా! నీతో మాట్లాడాలి! బస్టాప్ లో కలుద్దాం!" అని ఉంది.
అలాగే అని సైగ చేసింది లత.
రవి మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు!
పార్టీ తర్వాత లత బస్టాప్ కు వచ్చింది. " జిగేల్మనే హాఫ్ సారీ లో, క్లాసిక్ లుక్ లో ఉంది లత. హాఫ్ సారీ లో నాజూకు నడుము కనబడుతుంది.
" రవి! ఏమిటి రమ్మన్నావు? నేను నీకు ఒక విషయం చెప్పాలి అన్నది లత! రవి ఎదో అనుకోని చాలా ఆశ పడ్డాడు.
" నువ్వు నాకు క్లోజ్ కాబట్టి, నీకే ఈ విషయం చెబుతున్న. నాకు ఒక అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చాడు, అని లెటర్ ఇచ్చింది." మా ఇంట్లో లవ్ అంటే ఇష్టం ఉండదు. ఆ అబ్బాయి కి గట్టిగా చెప్పు అన్నది. ఒక రకంగా రవి కి ఆనందం, ఒక రకంగా బాధ కలిగాయి. నేను చెబుతానని చెప్పాడు రవి."
లత వెళ్ళిపోయింది. రవి ఒంటరిగా కూర్చొని అలోచిస్తున్నాడు.
లత ఈ లెటర్ విషయం నాకు చెప్పిందంటే, నేనంటే ఇష్టమే, కానీ ఇంట్లో లవ్ అంటే ఇష్టం లేదని చెప్పడం బాధగా ఉంది. నేను ఎలాగా ప్రపోజ్ చెయ్యడం మరి? మా ఫ్రెండ్ షిప్ కట్ అయ్యిపోతుందా? లత వచ్చిన తర్వాతే నా డిప్రెషన్ దూరంగా పారిపోయింది. ఎగ్జామ్స్ కూడా బాగా రాసాను. అలాంటి లత నాతో జీవితాంతం ఉంటె, అంతకన్నా అదృష్టం లేదు! ఇలాగ ఎన్నో ఆలోచనలు రవి మెదడులో పరిగెత్తుతున్నాయి.
రవి తన ఇష్టాన్ని లత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చెప్పడానికి చూసాడు, కానీ కుదరలేదు.
లత తన బర్త్‌డే పార్టీ ఇచ్చింది. లత తన ఇద్దరి ఫ్రెండ్స్ ను పిలిచింది. అలాగే, నా ఇద్దరి ఫ్రెండ్స్ ని కూడా పిలిచింది. రాజు కి, రాము కు లత గురించి తెలుసు. రవి-లత కు రాము ఎప్పుడూ హెల్ప్ చేసేవాడు. కానీ రాజు, ఎప్పుడూ లత ముందు రవి ని చులకనగా మాట్లాడేవాడు. అందుకే రవి రాజు ని దూరంగా ఉంచేవాడు.
ఒక రోజు రవి లత తో! నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగా నచ్చుతుంది. ఇప్పటి వరకు నువ్వు 15 డ్రెస్సెస్ వేశావు అన్నాను. గ్రీన్ కలర్ చుడీదార్ లో నువ్వు చాలా బాగుంటావు అన్నాడు.
థాంక్స్! 15 కాదు 17 అన్నది లత.
మర్నాడు, బస్టాప్ లో లత కోసం వెదికాడు రవి. అప్పుడే గ్రీన్ కలర్ హాఫ్ సారీ లో వచ్చింది లత! నా డ్రెస్ బాగుందా? అన్నది లత నవ్వుతూ!
సూపర్! అని చేతితో సైగ చేశాడు రవి దూరం నుంచి.
ప్రపోజ్ చేయడానికి ఇది మంచి టైమా? అని ఆలోచించాడు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది రవి కి.
మర్నాడు సాయంత్రం, లత ఇల్లు వెతుకుంటూ బయల్దేరాడు. ఏరియా తెలుసు గాని, ఆ కాలనీ లో హౌస్ తెలియదు. రాము తో కలసి ఆ రోజు సాయంత్రం ఆ కాలనీ లో ఎక్కడైనా లత కనిపిస్తుందేమో నని వెదికారు. లత బయటకు రావాలి అని రవి మనసులో కోరుకున్నాడు.
చాలా సేపు వెదికారు కాలనీ అంతా. కానీ ఫలితం లేదు.
సడన్ గా ఒక ఇంటి లోంచి వైట్ నైటీ వేసుకొని, ఒక అమ్మాయి బయటకు వస్తున్నది. అల్లంత దూరంలో, లత లాగా కనిపిచింది రవి కు. దగ్గరకు రాగానే కంఫర్మ్ అయ్యింది.
రవి లత ని చూస్తూ " నువ్వెంటి ఇక్కడ ఉన్నావు" అని అడిగాడు.
"ఇక్కడే మా హౌస్ " అని స్మైల్ తో చెప్పింది లత.
ఇలా ఉంటుండగా, రవి బర్త్ డే కి అందర్నీ పార్టీ కి పిలిచాడు ఒక పెద్ద హోటల్ లో. లత కోసం ప్రపోజ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు - ఆ రోజు.
కానీ, లత గాని, వాళ్ళ ఫ్రెండ్స్ గాని పార్టీ కు రాలేదు. లత కూడా రవి తో మాట్లాడడం లేదు. ఒక రోజు రవి లత వెనుకే వెళ్లి, "ఏమైంది లత? ఎందుకు మాట్లాడడం లేదు?" అని అడిగాడు.
లత సమాధానం చెప్పలేదు.
కొన్ని రోజుల తర్వాత, లత కాలేజీ కు రావడం మానేసింది. ఎందుకో తెలియలేదు? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావట్లేదు. తెలిసింది ఏమిటంటే, ఫ్రెండ్స్ అందరూ, కాలేజీ మానేశారని.
అనుకోకుండా ఒక రోజు లత కాలేజీ కు వచ్చింది. ఆ విషయం తెలిసిన రవి పరిగెత్తుకుంటూ థర్డ్ ఫ్లోర్ ల్యాబ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చాడు.
ఎస్!!! ఎస్ !!! లత వచ్చింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో!
"ఎలా ఉన్నావు లత" అన్నాడు.
"బాగున్నాను అంది."
"నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఐ యాం గోయింగ్ అన్నాది" ఈలోపు సార్ పిలుస్తున్నారని నాకు ఎవరో చెప్పారు.
"ఇప్పుడే వస్తాను లతా" అని వెళ్ళాను.
మళ్ళీ తిరిగి వచ్చే సరికి లత అక్కడ లేదు.
అక్కడే ఒక మూలకు కుర్చీని గాట్టిగా ఏడ్చాడు. రవి ను చూసి, రాజు కుడా చాలా బాధ పడ్డాడు. రవి చేతిలో లత కోసం కొన్న గిఫ్ట్ ఉంది. అది ఇవ్వలేకపోయాడు. బర్త్ డే రోజు ప్రపోజ్ చేద్దామనుకున్న గిఫ్ట్ అది.
డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కానీ లత గురుంచి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. రవి కు ఫైనల్ ఇయర్ లో మార్క్స్ తగ్గాయి.
లత కోసం రవి చాలా చోట్ల వెతికాడు. విషయం తెలుసుకోవడం కోసం, ఇక తప్పక, రవి లత ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
ఒక రోజు ఉదయం వాళ్ళింటికి బయల్దేరాడు. ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. బెల్ రింగ్ చేసాడు. ఆంటీ వచ్చారు.
"ఎవరు కావాలి బాబు?"అని అడిగారు?
"ఆంటీ! నేను లత డిగ్రీ క్లాసుమేట్. నా పేరు రవి."
"ఓహ్ రవి ! లోపలి రా బాబు! లత నీ గురించి నాకు చెప్పింది. కానీ ఎప్పుడూ, నిన్ను చూడలేదు-ఇంటికి పిలవలేదు."
"లత కాలేజీ మానేసింది. తన గురించి నాకు ఏమిటి తెలియలేదు. మీరు ఇల్లు మారడం చేత, నాకు మీ కొత్త అడ్రస్ దొరకడానికి, ఇన్ని రోజులు పట్టింది"
"లత ఎక్కడ జాయిన్ అయ్యింది? లత నాతో కూడా ఏమి చెప్పలేదు - కాలేజీ కు వచ్చినప్పుడు. ఫోన్ చేస్తుందేమో చూసాను, కానీ లేదు. తన నెంబర్ నా దగ్గర లేదు. కోపం తగ్గాక చేస్తుందేమో నని చూసాను - కానీ చేయలేదు. అందుకే ఇంటికి వచ్చాను."
"లత నీ గురించి నాతో, అన్ని విషయాలు చెప్పింది రవి. నువ్వంటే దానికి ఇష్టమే.
నువ్వు చాలా హెల్ప్ చేసావని కూడా చెప్పింది. నిన్ను ఒక రోజు ఇంటికి పిలవమని నేను చెప్పను. కానీ అప్పుడే - ఇంట్లో పెద్ద గొడవ జరిగింది."
"ఒక రోజు అంకుల్ ఇంటికి చాలా కోపంగా వచ్చారు. లత ను పిలిచి బాగా తిట్టారు. కాలేజీ లో ఫ్రెండ్స్ గురించి అడిగారు. నిన్ను, లతా తో ఫ్రెషర్స్ డే రాత్రి బస్టాప్ లో చేసారంట! లతా ని బాగా తిట్టారు. ఆ రోజు చాలా ఏడ్చింది లత. అంకుల్ కి ఇలాంటివి నచ్చవు. నిన్ను ఇంకా ఇంటికి పిలుద్దామనుకొనే టైం లో ఇలా గొడవ జరిగింది."
"అదే టైం లో ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ కూడా వచ్చింది. దూరమైనా కూడా, ఆలోచించకుండా, పంపించడానికి డిసైడ్ అయ్యారు."
"నీతో ఇంక మాట్లాడొద్దని గట్టిగ చెప్పారు లతా తో"
"లత కొన్ని రోజుల పాటు చాలా దిగాలుగా ఉంది. అందుకే, నీతో కాలేజీ లో అలా మాట్లాడింది"
"గొడవైన రోజు రాత్రి లత ను ఓదార్చడానికి వెళ్ళినప్పుడు, అప్పుడే నీ గురించి తెలిసింది".
"లతా! ఏడవకు తల్లి! నాన్నగారి కోపం నీకు తెలిసినదే కదా! ఆ అబ్బాయి ఎవరు? ఎందుకు రాత్రి బస్టాప్ లో అతనితో మాట్లాడవు"
"థాంక్స్ అమ్మా! నువ్వైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు"
"ఆ అబ్బాయి పేరు రవి. కాలేజీ లో నా సీనియర్. చాలా మంచి అబ్బాయి. నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నన్ను ఎప్పుడూ హ్యాపీ గా ఉంచుతాడు."
"అయితే రవి మంచి బాలుడు! అంటూ నవ్వింది లత ని చూస్తూ"
"ఈ గొడవ అవకపోతే రవి ని ఇంటికి పిలిచేవాడిని"
"అమ్మా! నన్నుకాలేజీ మార్చేస్తారా?"
"అవును మరి! సీట్ వచ్చింది కదా."
"నాన్నగారు నిన్ను డిగ్రీ కాలేజ్ కు ఇంక పంపించరు."
"నాన్న గారికి తెలియకుండా ఒక్కసారి అందరికి చెప్పడానికి వెళ్తాను కాలేజీ కి"
"అలాగే లతా! నీ ఇష్టం"
" నిన్ను ఆఖరిసారి కలిసిన రోజు తర్వాతే కొత్త కాలేజీ లో జాయిన్ అయ్యింది. ఇక్కడకు దూరంలో కాలేజీ ఉంది. "
"నీకు తెలుసు గా బాబు! లత చాలా అమాయకురాలు. భయస్తురాలు కూడా. అందుకే నీతో ఏమీ చెప్పలేదు. కాలేజీ లో అందర్నీ లాస్ట్ కలిసిన రోజు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అందుకే నీతో ఎక్కువ మాట్లాడలేదు."
"ఇదీ బాబు జరిగింది"
ఆంటీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. రవి కు కూడా అదే పరిస్థితి.
"ఆంటీ! లత హాస్టల్ లో ఉంటుందా?"
"అవును రవి."
"అడ్రస్ ఇవ్వండి."
రవి అడ్రస్ తీసుకోని బయల్దేరాడు.
రాత్రంతా రవి ఆలోచించాడు. లత కు దగ్గర అవ్వాలి. నా అదృష్టాన్ని నేను వదులుకోను. లత ఉంటే, నా జీవితం చాలా హ్యాపీ.
మర్నాడు లత ను చూడడానికి ఊరు బయల్దేరాడు. బస్సు లో గతం గుర్తొచ్చింది.
ఒకసారి లత తో మాట్లాడుతున్నప్పుడు, లత అన్న మాటలు గుర్తొచ్చాయి.
"రవి! నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం"
"నాకు నీకన్నా కొంచం పొడవైన అమ్మాయి కావాలి"
లత ముఖం కొంచం మారింది.
ఇంతలో బస్సు హార్న్ సౌండ్ తో, ఈ ప్రపంచం లోకి వచ్చాడు రవి. బస్సు దిగి, హాస్టల్ వెతుక్కుంటూ వెళ్ళాడు. కాలేజీ దగ్గర హాస్టల్ లో రూమ్ తీసుకున్నాడు.
గర్ల్స్ హాస్టల్ నెంబర్ కి కాల్ చేసాడు. లత కోసం అడిగాడు. లత వస్తున్నది.
"హలో! ఎవరు?" అని అందమైన గొంతు. అది నా లత గొంతే!
"హలో SL అన్నాను"
వెంటనే లత " రవి! అని ఏడ్చేసింది. ఇప్పుడు గుర్తొచ్చానా?"
SL! నా మీద కోపం పోయిందా? మాట్లాడుతున్నావు?
"SL అని నువ్వు తప్ప ఎవరూ పిలవరు! శ్రీలత పేరు అందరికి తెలియకూడదని పబ్లిక్ లో SL అని పిలుస్తావు కదా!"
ఇంకొద్దు రవి! నన్ను ఏడిపించకు! ఐ యాం సారీ!
నా కంతా తెలుసు లత! ఆంటీ ని కలిసాను. అంతా చెప్పారు.
"నిన్ను కలవాలని ఉంది రవి!"
"గంట లో మీ కాలేజీ దగ్గర కలుద్దాం అన్నాడు రవి"
అది వినగానే లత కు ఒక డ్రీం సాంగ్ వేసుకోవాలనిపించింది. టైం ఉంది కదా! ఒక సాంగ్ వేసుకుంది మరి!
కాలేజీ కోసం లత గ్రీన్ డ్రెస్ కోసం వేసుకొని బయల్దేరింది. రవి ని చూడగానే, లత స్మైల్ తో హాయ్ చెప్పింది. రవి కూడా హాయ్ అన్నాడు.
"రవి! ఈ రోజు కాలేజ్ కు వెళ్లే మూడ్ లేదు. సరదాగా పార్క్ కు పోదాం"
"మరి మీ నాన్న తిట్టారా SL?"
"నువ్వు పక్కన ఉంటుండగా నాకు భయం లేదు"
పార్క్ లో లత రవి వొళ్ళో పడుకుని ఇలా అంటోంది :
"రవి! నన్ను పెళ్లి చేసుకో రవి. నువ్వుంటే నా లైఫ్ చాలా హ్యాపీ. మా అమ్మ కు కూడా నువ్వంటే ఇష్టమే"
"ఈ మాట డిగ్రీ కాలేజీ లోనే చెప్పి ఉంటే మన కథ ఎప్పుడో సుఖాంతం అయ్యేది కదా! డియర్"
"రవి! అప్పుడు కాలేజీ కొత్త, నువ్వు కొత్త, నీకు నేనంటే ఇష్టమో లేదో తెలియదు. భయంగా ఉండేది."
"నువ్వు చెప్పచ్చు గా "ఐ లవ్ యు" మరి ! అంటూ రవి బుగ్గ గట్టిగా గిల్లింది"
"నాకూ అదే ప్రాబ్లెమ్ SL . నన్ను రిజెక్ట్ చేస్తావేమోనని!"
"లతా! నేను ఇక్కడే వేరే కాలేజ్ లో కంప్యూటర్స్ పీజీ లో జాయిన్ అవుతాను. ఈ
రెండు సంవత్సరాలు మనం ప్రేమించుకోవచ్చు. తర్వాత జాబ్ వచ్చాక, మీ నాన్నగార్ని ఒప్పించి పెళ్ళి చేసుకుంటాను. ఎలా ఉంది ఐడియా డియర్"?
"ఓకే డియర్. పెళ్లి అయ్యేవరకు, నో టచింగ్, నో కిస్సింగ్స్! ఓన్లీ ఫ్లయింగ్ కిస్సెస్!"
పీజీ రెండు సంవత్సరాలు లవ్ బర్డ్స్ ఇద్దరి మధ్య లవ్ ఇంకా బాగా పెరిగింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో రవి సెలెక్ట్ అయ్యాడు. మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది.
లత చాలా హ్యాపీ! మంచి మూడ్ లో రవి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా లిప్ టు లిప్ కిస్ పెట్టింది.
రవి లత వాళ్ళ నాన్నగారితో మాట్లాడానికి ఇంటికి వెళ్ళాడు. లత బాల్కనీ నుంచి హాయ్ చెప్పింది.
రవి 2 ఇయర్స్ లత కోసం వెయిట్ చేయడం చూసి, లత పైన రవి కు ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకున్నాడు. తాను రవి ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు బాధపడి, రవి ని లతకిచ్చి పెళ్ళి చేయడానికి లత నాన్నగారు ఒప్పుకున్నారు.
లతా! నీ సెలక్షన్ సూపర్! " అన్నారు లత ఫాదర్.
"రవి! ఐ యాం సారీ! " అన్నారు.
రవి-లత పెళ్ళి చాలా గ్రాండ్ గా జరిగింది.