లిఫ్ట్ లో లవ్ - తాత మోహన కృష్ణ

Lift lo Love

అదొక మహానగరం. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు చాలా సహజం. అలాంటి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లో, ఫ్లాట్ కొనాలని, ఉద్యోగం వచ్చినప్పటి నుంచి సునీల్ కల.

ఇంకా పెద్దగా డెవలప్ గాని ఏరియా లో, ఒక గేటెడ్ కమ్యూనిటీ చూసాడు. అది ౩౦ అంతస్తుల అపార్ట్మెంట్. అలాగ, ఆ కమ్యూనిటీ లో రెండు టవర్స్ ఉన్నాయి. టవర్ A అండ్ టవర్ B. రెండు టవర్స్ ఎదురుగా ఉంటాయి. అంటే ఒక ఫ్లాట్ బాల్కనీ నుంచి, ఇంకొక టవర్ ఫ్లాట్ బాల్కనీ కనిపిస్తుంది.

సునీల్ టవర్ A లో 29 ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకున్నాడు. అది రెడీ టూ మూవ్ ఇన్ అపార్ట్మెంట్. రిజిస్ట్రేషన్ అయ్యాక, సునీల్ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాడు.

ఇల్లు అందంగా సర్దుకున్నాడు. బ్యాచలర్ కాబట్టి, పెద్దగా సామాన్లు ఏమీ లేవు. బాల్కనీ లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఎదురుగా ఉన్న టవర్ లో బాల్కనీ లో ఒక అమ్మాయి - చూడడానికి చాలా అందంగా ఉంది. బట్టలు ఆరేస్తుంది. చూడడానికి కాలేజీ అమ్మాయి లాగా ఉంది. సడన్ గా ఆ అమ్మాయి చూసేసరికి, ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు. చూసి హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చాడు సునీల్. అమ్మాయి సీరియస్ గా లోపలికి వెళ్ళిపోయింది.

ఈలోపు ఫ్లాట్ బెల్ మోగింది. అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చిందేమో నని భయపడ్డాడు సునీల్. డోర్ ఓపెన్ చేసాడు. చుస్తే వాచ్‌మెన్ - "సర్, లిఫ్ట్ 1 లో కొంచం ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ చెప్పాడు. లిఫ్ట్ 2 వాడండి " అని చెప్పి వాచ్‌మెన్ వెళ్ళిపోయాడు.

ఈలోపు మళ్ళీ బాల్కనీ లోకి వెళ్ళాడు సునీల్. ఆకాశం మబ్బు పట్టి ఉంది. చల్లటి గాలి వీస్తోంది. టవర్ బి లో ఉన్న అన్నీ బాల్కనీ ల్లోకి తొంగి చూసాడు. చాలా వరకూ ఖాళీ గా ఉన్నాయి. కొన్ని బాల్కనీల్లో అయితే Mr. అండ్ Mrs. కూర్చొని కాఫీ సిప్ చేస్తూ, వెథర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో, తాను కూడా అలాగ ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాడు సునీల్.

సునీల్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సొంత ఇల్లు ఉంటే, మంచి అమ్మాయి వస్తుందని అమ్మ చెప్పడంతో ఫ్లాట్ తీసుకున్నాడు.

డిన్నర్ చేసాక నిద్ర లోకి జారుకున్నాడు. మర్నాడు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది.

మర్నాడు ఉదయం లేచి, ఆఫీస్ కు రెడీ అయ్యాడు. లిఫ్ట్ 2 దగ్గరకు వెళ్లి, పార్కింగ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు. ఆఫీస్ కు హడావిడి గా వెళ్ళిపోయాడు.

ఆఫీస్ లో మీటింగ్ బాగా జరిగింది. సాయంత్రం ఇంటికి రిటర్న్ బయల్దేరాడు. బేస్మెంట్ లో బండి పార్క్ చేసి, లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు. లిఫ్ట్ 2 ఎక్కడో ఆగిపోయింది. వెంటనే లిఫ్ట్ 1 లో కి వెళ్ళాడు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మళ్ళీ ఆగింది. ఓపెన్ అయిన లిఫ్ట్ లోకి బాల్కనీ అమ్మాయి ఎక్కింది.

"హలో అండి అన్నాడు" సునీల్. అమ్మాయి నో రెస్పాన్స్. లిఫ్ట్ చక చకా ఫ్లోర్ లు ఎక్కుతుంది. సడన్ గా పెద్ద సౌండ్ తో లిఫ్ట్ ఆగిపోయింది.

"అయ్యో లిఫ్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఎం చెయ్యాలి". అని ఏడుస్తున్నది అమ్మాయి.

"ఏమండీ! ఎందుకు ఏడుస్తారు? ఇంతకీ మీ పేరేమిటి?

"సునీత"

"హాయ్ సునీతా గారు, నా పేరు సునీల్!"

"లిఫ్ట్ ఏదో ప్రాబ్లెమ్ ఉందని వాచ్‌మెన్ నిన్న చెప్పాడు. మర్చిపోయాను."

"ఇద్దరం గట్టిగా అరుద్దాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం!"

ఎంత అరచినా, ఎవరూ రాలేదు. లిఫ్ట్ ప్రాబ్లెమ్ ఉందని, ఎవరు అటుపక్క కు రాలేదు. లిఫ్ట్ 1 అండ్ లిఫ్ట్ 2 కొంచం దూరంగా ఉంటాయి.

"రాత్రి అయిపోయింది. ఇంక ఎవరూ రారు సునీత గారు."

"ఇంతకీ మీరు ఎక్కడకు వెళ్ళి వస్తున్నారు సునీత గారు? చేతిలో బ్యాగ్ ఉంది."

"సునీల్ గారు! నేను మార్కెట్ కి వెళ్ళాను. కూరలు, పళ్ళు, స్వీట్స్ కొన్నాను"

"ఏమైనా స్పెషల్ ఇంట్లో?"

"రేపు నా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు."

"ఎవరో ఆ అదృష్టవంతుడు?" అనుకున్నాడు సునీల్.

"మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ?"

"ఆఫీస్ నుండి సునీత గారు"

"మీది టవర్ బి కదా! ఇక్కడకు ఎందుకు వచ్చారు?"

"నిజం చెప్పనా? మీకోసమే." అంది సునిత.

సునీల్ షాక్ అయ్యాడు.

"నా కోసమా?. మీరు ఎవరో నాకు తెలియదు."

"మీరు నాకు తెలుసు సునీల్. మీరు ఆఫీస్ నుంచి రావడం చూసి, లిఫ్ట్ ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అదే టైం కు నేను మార్కెట్ నుంచి వస్తున్నాను."

"మరి మొన్న బాల్కనీ నుంచి నన్ను చూసినప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వలేదు?"

"నేను మిమల్ని చూసాను. ఈలోపు అమ్మ లోపలికి పిలిచింది. అందుకే వెళ్ళాను".

"మ్యాట్రిమోనీ నుంచి ఆంటీ కొన్ని అబ్బాయిల పిక్స్ పంపించారు. అవి చూస్తుంటే, మీ ఫోటో కనిపించింది. మీ వివరాలు పూర్తి గా చదివాను. మీ గురించి అప్పుడే తెలిసింది."

"అయితే నన్ను లిఫ్ట్ లో కలవాల్సిన అవసరం ఏమిటి?"

"మీరు చదివిన స్కూల్ పేరు రాసారు కదా! "

"అవును నేను అక్కడే చదివాను."

"మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎవరైనా అమ్మాయి కి ప్రపోజ్ చేసారా?"

"అది మరిచిపోయిన విషయం సునీతా గారు!"

"మీరు నన్ను సునీతా అని పిలవొచ్చు."

"సునీతా! నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయి స్కూల్ ఫస్ట్ . గర్ల్స్ క్యాంపస్ వేరే చోట ఉండడం చేత, నేను ఆ అమ్మాయి ని చూడలేదు. ఆ అమ్మాయి గురించి ఫ్రెండ్స్ చెప్పగా విన్నాను. మంచి అమ్మాయి, అందంగా ఉంటుందని, చెప్పారు.

"మరి ఆ అమ్మాయి ని ఎప్పుడూ కలవలేదా?"

"లేదు. తాను వేరే కాలేజీ కి వెళ్లిపోయిందని విన్నాను."

"ఇదంతా మీరెందుకు అడుగుతున్నారా? మీరు సునీతా కాదు కదా!"

"ఎస్! సునీత నే. మీ ఫ్రెండ్స్, నీ గురించి నాకు మార్కెట్ లో కనిపించినప్పుడు చెప్పారు.

"మరి బాయ్ ఫ్రెండ్ అన్నావు సునీతా?"

"ఆ బాయ్ ఫ్రెండ్ మీరే సార్!"

"ఓహ్ సునీతా! ఇది నిజమేనా? నా ముందు నా సునీత! నువ్వు చాలా అందంగా ఉన్నావు సునీతా! మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగానే. ఇంకెందుకు లేట్, చెప్పేస్తా, ఎప్పటినుంచో మనసులో ఉన్న మాటలు. " ఐ లవ్ యు" సునీతా!

సునీత ఒక స్మైల్ తో " నేను ఎప్పుడో నా మనసు నీకు ఇచ్చేసాను సునీల్"

"లెట్స్ సెలెబ్రేట్ సునీతా! చాలా ఆకలి వేస్తుంది. షాపింగ్ చేసావు కదా! ఏమి తెచ్చావ్?"

"టైం 12 అయ్యింది. "హ్యాపీ బర్త్ డే సునీల్"

"థాంక్యూ సునీతా"

"లక్కీ గా కొన్ని పళ్ళు, కేక్ కూడా కొన్నాను."

"సునీతా! చాలా సార్లు కల లో నీతో ముద్దు పెట్టుకున్నట్లు అనిపించేది!" అన్నాడు సునీల్.

"మరి ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా!" అంది సునీత.

అంటూనే సునీత ముందుకొచ్చి సునీల్ పెదవులని గట్టిగా కిస్ చేసింది. అలాగే, వాళ్లిద్దరూ ముద్దులలో మునిగారు. ఈలోపు తెల్లారింది. లిఫ్ట్ మెకానిక్ వచ్చాడు. లిఫ్ట్ ఓపెన్ అయ్యింది.

లిఫ్ట్ లో లవ్ బర్డ్స్ -సునీల్- సునీత బయటకు నవ్వుకుంటూ వచ్చారు.

ఇద్దరి పెళ్ళి గ్రాండ్ గా జరిగింది. టవర్ A బాల్కనీ లో Mr. & Mrs. సునీల్ కూర్చొని కాఫీ సిప్ చేస్తూ, వెథర్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు