దొంగ - VEMPARALA DURGA PRASAD

Donga

రఘుపతి తన కూతురు రమ్యని తీసుకుని ఉదయం 7 గంటలకు అనకాపల్లి స్టేషన్ కి వచ్చేడు. అనకాపల్లి లో రైల్వే స్టేషన్ వాళ్ళ ఇంటికి దగ్గిర. వైజాగ్ లో ఎంసెట్ EXAM ఆ రోజు 9 గంటలకి. వైజాగ్ లో స్టేషన్ కి దగ్గిరలో exam సెంటర్ వుంది. TRAIN దిగి, టిఫిన్ చేసి, EXAM సెంటర్ కి కొద్దిగా ముందుగా చేరుకోవాలని వాళ్ళ PROGRAM.

Train చాలా రద్దీ గా వుంది. సాధారణం గా ఎక్కువ మంది అనకాపల్లి నుండి విశాఖపట్నం shuttle చేస్తూ వుంటారు ఆ రైలు లో. అదే convenient TRAIN అని రఘుపతి ఆ TRAIN కి బయలు దేరాడు. మనుషులు కూర్చోవడానికి చోటు లేదు. ఎలాగో లాగ ఓ గంట నుంచుంటే చాలు, విశాఖపట్నం వెళ్లి పోవచ్చు అనుకున్నారు. రమ్య కి అదృష్టవశాత్తూ ఓ పెద్దావిడ పక్క చోటు దొరికింది. రఘుపతి మాత్రం నుంచోవలసి వచ్చింది. బాగ్ భుజానికి తగిలించుకుని నుంచున్నాడు. కొంత దూరం వెళ్లే సరికి, బాగ్ బరువు అనిపించింది. తీసి, పైన హుక్ కి తగిలించేడు. గేట్ కి దగ్గర గానే వున్నారు వాళ్ళు. దువ్వాడ వరకు పక్క వాళ్ళ తో పిచ్ఛా పాటీ కబుర్లు చెప్పు కుంటూ గడిపేసేడు. రమ్య మాత్రం బుద్ధి గా పుస్తకం లో మునిగి పోయింది. ఇంతలో దువ్వాడ స్టేషన్ నుండి కదిలిన TRAIN ఎందుకో మళ్ళీ ఆగిపోయింది. 15 నిముషాలు ఆగిపోయింది, ఇంకా కదలడం లేదు. ఉక్క పోస్తుండడం తో అందరికీ చికాకుగా వుంది. రఘుపతి మాటి మాటికీ వాచ్ చూసుకుంటున్నాడు. Exam టైం కి వెళ్లగలమా అని అతనికి బెంగ. ఆగిన రైలు లోంచి, గాలి కోసం చాలా మంది కిందకి దిగేసేరు. ఆదుర్దాగా వున్న రఘుపతి కూడా గేట్ దగ్గర కొచ్చి నుంచున్నాడు. ఇంతలో TRAIN నెమ్మదిగా కదిలింది. రైలు కదలడం చూసి బిల బిల మంటూ జనం మళ్ళీ ఎక్కుతున్నారు. అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఎవరో ఒక ఆతను రఘుపతి బాగ్ తీసుకుని సైలెంట్ గా బండి దిగేసేడు. దిగిన వాడు, నెమ్మదిగా కదులుతున్న రైలు వెనుక వైపు పరిగెడుతూ వెళ్లి ఓ 6 బోగీల తర్వాత మళ్ళీ ఎక్కేడు. ఈ విషయం రఘుపతి తో సహా, ఎవరూ గమనించలేదు. ఎవరి గోల లో వాళ్ళు వున్నారు. అసలే బండి ఆగుతూ వెళ్తోంది అని తిట్టు కుంటున్నారు జనం.

రైలు వేగంగా వెళ్తోంది. ఇంక విశాఖ పట్నం చేరుతుంది అనుకుంటుండగా అప్పుడు గమనించుకున్నాడు రఘుపతి..." తన బాగ్ పోయింది అని ". అతనికి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడేం చేయాలి. రమ్య పారేసు కుంటుందేమో అని, తన హాల్ టికెట్ కూడా తన బాగ్ లో పెట్టుకున్నాడు. బాగ్ లో 2 వేల రూపాయల కాష్, తన సెల్ ఫోన్, అమ్మాయి హాల్ టికెట్ వుంచు కున్నాడు. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ, సెల్ ఫోన్ మరియు హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్.

హాల్ టికెట్ లేక పొతే, exam సెంటర్ లో అడుగు పెట్టనివ్వరు. కూతురి భవిష్యత్తు ఇబ్బంది పడకూడదు. టిఫిన్ చేయక పోయినా పర్వాలేదు, ముందు నెట్ సెంటర్ కి వెళ్లి, మరో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని, EXAM సెంటర్ కి వెళ్ళాలి. టైం 1 నిముషం లేటు అయినా, లోపలి వెళ్ల నివ్వరు. ఇలా పరి పరి విధాలు గా ఆలోచిస్తున్నాడు రఘుపతి.

కానీ విషయం అప్పటికి రమ్య కి చెప్పలేదు. ఆ పిల్ల ఇంకా కంగారు పడిపోతుంది... బండి దిగేక, చెప్పచ్చు అనుకున్నాడు. స్టేషన్ కి 1 km దూరం లో రైలు సడన్ BRAKE తో కీచు మంటూ మళ్ళీ ఆగిపోయింది.

అప్పటికి చాల మందికి సహనం చచ్చి పోయింది. దిగి, పట్టాల వెంబడే నడుచుకుంటూ స్టేషన్ కి వెళ్లి పోతున్నారు. రఘు పతి కూడా, రమ్య ని తీసుకుని, రైలు దిగేసేడు. రైలు ఎందుకు ఆగిందో అనుకుంటూ ఉంటే, ఎవరో చెపుతున్నారు. వెనకాల ఎవరో స్తంభం తగిలి రైలు నుండి పడిపోయి, అక్కడి కక్కడే చని పోయాడుట. జనం కొంత మంది వెనుకకు పరిగెడుతున్నారు, ఆ సంఘటన చూడ డానికి. రైలు కొంత సమయం కదపక పోవచ్చు, RPF వాళ్ళు రావాలి, పంచనామా జరగాలి అని అర్ధం వుతోంది.

అసలే సమయం అయిపోతోంది అని కంగారు పడుతున్న రఘు పతి ఇంక చేసేదేమీ లేక,

కూతురు రమ్య తో కలిసి కాళ్ళకి పని చెప్పేడు.

ఒక కిలోమీటర్ దూరం పట్టాలు పట్టుకుని నడుచుకుని స్టేషన్ కి చేరుకున్నారు. అప్పటికి 8.15 అయింది. ఆటో మాట్లాడుకుని, RTC కాంప్లెక్స్ దగ్గరికి చేరుకొని, దగ్గర్లో నెట్ సెంటర్ లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని, PRINT తీసుకున్నారు . అక్కడి నుండి దగ్గర్లోనే వుంది EXAM సెంటర్. వెళ్లేసరికి, 5 నిముషాలు తక్కువ 9 అయింది. రమ్యని EXAM సెంటర్ లోకి పంపించి, రిలీఫ్ ఫీల్ అయ్యేడు రఘుపతి. రమ్య సెల్ ఫోన్ తన వద్ద వుంచు కున్నాడు. ఇంటికి ఫోన్ చేద్దాము అనుకున్నాడు కానీ, దొంగతనం జరిగింది అని తెలిస్తే సుధ కంగారు పడుతుంది అని చెప్పలేదు. అమ్మాయి పరీక్ష అయ్యేక ఏకంగా మాట్లాడదామని అనుకున్నాడు.

రమ్య టిఫిన్ చేయలేదు కనుక, తనకీ టిఫిన్ చేయాలని అనిపించలేదు. టీ తాగి దగ్గర్లో చెట్టు కింద కూర్చున్నాడు.

3 గంటలు గడిచేయి. మరికాసేపట్లో రమ్య exam నుండి బయటకి వస్తుంది.

ఇంతలో రమ్య ఫోన్ మోగింది.

" అమ్మా రమ్యా ఎక్కడ వున్నావ్ ?" అవతల ఎవరిదో స్త్రీ గొంతు.

" రమ్య ఎంసెట్ EXAM రాస్తోంది అండి, నేను వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను " అని, ఇంతకీ మీరెవరు ? అని ప్రశ్నించేడు రఘుపతి.

"రఘుపతి గారా? సర్, మీరు బానే ఉన్నారా? " ఆశ్చర్యం ధ్వనిస్తోంది ఆమె గొంతులో.

"బాగానే వున్నాను, ఇంతకీ మీరెవరు" అని మళ్ళీ ప్రశ్నించేడు.

“ సర్, నేను మీకు తెలియదు, చెప్పేది ఒక్కసారి ధైర్యం గా వినండి. మీ భార్యకి మీరు TRAIN ఆక్సిడెంట్ లో చనిపోయారని ఎవరో చెప్పేరుట. ఆ విషయం పక్కింటి ఆవిడతో చెప్పి ఆవిడ స్పృహ కోల్పోయేరుట. ఆవిడ షాక్ కి గురి అయిపోయేరు. పక్కింటి వాళ్ళు ఆమెని ఇక్కడ కి తీసుకొచ్చి జేర్పించేరు. ప్రస్తుతం మా హాస్పిటల్ లో ICU లో వుంచేము. నేను ఇక్కడ నర్స్ ని, డాక్టర్ గారు INFORM చెయ్యమంటే చేస్తున్నాను.

మీ పక్కింటి సుజాత గారి తో మాట్లాడండి” .. అని, సుజాత కి ఫోన్ ఇచ్చింది నర్స్.

రఘుపతి కి పిచ్చెక్కి నట్లు అయింది.

సుజాత ఆశ్చర్యం నిండిన గొంతుతో ఇలా చెప్తోంది:

" అన్నయ్య గారు, మీరు TRAIN నుండి పడి పోయి చనిపోయారని, మీ సెల్, బాగ్ దొరికేయని, బాగ్ లో విసిటింగ్ కార్డు చూసి, ఇంటి నెంబర్ కి RPF వాళ్ళు ఫోన్ ఫోన్ చేసేరుట. మీ భార్య ఆ వార్త వింటూనే పెద్దగా అరిచి పడి పోయేరు. అరుపు విని, నేను పరిగెత్తుకుని వచ్చెను. ఆవిడ “ మీరు పోయేరని... ఆక్సిడెంట్ ట” "RPF వాళ్ళు ఫోన్ చేసేరు" ... అని విషయం నాకు ఏడుస్తూ చెప్తూ, తల వాల్చేసేరు. ముందు ఆవిడని కాపాడాలి అని, వెంటనే, దగ్గర్లోని "తిరుమల హాస్పిటల్" కి తీసుకుని వచ్చేము. ఆవిడకి ఇంక స్పృహ రాలేదు. ICU లో ఉంచి TREAT చేస్తున్నారు”..

"ఇప్పుడు సుధ కి ఎలా వుంది".. ఆందోళన గా అడిగేడు రఘుపతి.

“మరో గంటలో స్పృహ రావచ్చని చెప్తున్నారు. TREATMENT కి RESPOND అవుతున్నారు. మీరేమీ కంగారు పడద్దు. త్వరగా వచ్చేయండి”. అంది సుజాత.

అప్పటికి అర్ధం అయింది రఘుపతి కి ... "అంటే, తన బాగ్ కొట్టేసిన వాడు

విశాఖపట్నం వచ్చే ముందు రైలు లోంచి కింద పడి చచ్చి పోయేడన్నమాట".

అయ్యో యెంత ఘోరం జరిగింది... అనుకున్నాడు.

అతనికి సుధ ని తలుచు కుంటే చాలా ఆదుర్దాగా వుంది.

ఇంతలో బెల్ మోగింది. EXAM అయిపొయింది. మరో 5 నిముషాల లో రమ్య బయటికి వచ్చింది.

ఆమె ముఖం వెలిగి పోతోంది... పరీక్ష బాగా రాసేను అని చెప్పింది.

రఘుపతి మొఖం లో ఆనందం కనపడ లేదు. ఫాదర్ ఎందుకు ముభావంగా ఉన్నాడో ఆమెకి అర్ధం కాలేదు.

బయటికి వచ్చి, వెంటనే రైల్వే స్టేషన్ కి ఆటో చేయించుకుని వచ్చేసేరు.

ఆటో లో ఉండగా, జరిగిన విషయం రమ్యకి చెప్పేడు.

రమ్య చాలా బెంగ పెట్టుకుంది తల్లి గురించి. స్టేషన్ వచ్చింది. ఆటో దిగేరు. టికెట్స్ తీసుకుందామని వెళ్తుంటే, రమ్య కి ఫోన్ వచ్చింది. సుజాత గారు మళ్ళీ చేసేరు.

" సుధ కి తెలివి వచ్చిందిట, ఆవిడకి భర్త, కూతురు బాగానే ఉన్నట్లు చెప్పేక, స్థిమిత పడింది" అని చెప్పేరు.

రఘుపతి కి, రమ్య కి కొంత రిలీఫ్ వచ్చింది. రైలు బయలు దేరడానికి 15 నిముషాలు వుంది. ఆకలి దహించేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇద్దరికీ టిఫిన్ ప్యాక్ చేయించుకున్నాడు.

టికెట్ తీసుకుని, రైలు ఎక్కేసేరు.

ఒక గంట గడిచేసరికి రైలు అనకాపల్లి చేరింది. ఎప్పుడెప్పుడు సుధ ని చూస్తామా అని రఘుపతి, రమ్యా ఆదుర్దాగా వున్నారు.

రైలు దిగి, నేరుగా హాస్పిటల్ కి వెళ్లి సుధని చూసేరు. ఆమె కోలుకుంది...మాట్లాడుతోంది. జరిగిన విషయం అంతా వివరంగా చెప్పేడు. ముగ్గురి హృదయాలు తేలిక పడ్డాయి.

ఆరోజు NIGHT సుధ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేరు. సుధ ని ఇంటికి తెచ్చేక, ల్యాండ్ లైన్ లో కాల్ లాగ్ వెతికి, RPF ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ పట్టుకున్నాడు రఘుపతి.

జరిగిన విషయం అంతా వివరంగా ఆయనకీ చెప్పేడు. మర్నాడు, తన బాగ్, ఫోన్, తిరిగి తీసుకోవడానికి విశాఖపట్నం వస్తానని చెప్పేడు.

ఐడెంటిఫికేషన్ PROCESS ఉంటుంది అని, మరో ఇద్దరు WITNESSES ని కూడా తెచ్చుకోమన్నాడు ఇన్స్పెక్టర్.

సరే అన్నాడు రఘుపతి.

...END...

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao