సీత - గీత మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నారు. స్కూల్ నుంచి కాలేజీ దాకా, ఒకే ఊరిలో చదువుకున్నారు.
సీత, పేరు కి తగ్గట్టుగా నెమ్మదిగా ఉంటుంది. ఓర్పు, సహనం ఎక్కువ. పెద్దల మాట కి గౌరవం ఇస్తుంది. అమ్మ-నాన్నలు చెప్పినట్టు నడచుకుంటుంది. స్వతంత్ర భావాలూ తక్కువే. డిగ్రీ సంపాదించి, మంచి ఉద్యోగం చేసి, తన కాళ్ళ పై నిల్చోవాలని కోరిక.
గీత చలాకీ గా ఉన్న అమ్మాయి. ఎక్కువగా మాట్లాడుతుంది. నవ్వూతూ ఉంటుంది. స్వతంత్ర భావాలూ ఉన్న అమ్మాయి. ఫాస్ట్ కల్చర్ అలవాటు పడ్డ అమ్మాయి. ఎంతసేపు లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అంటుంది. ఎప్పుడూ, విదేశాలు వెళ్లాలని, అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. అవసరమైతే NRI ని పెళ్లి చేసుకుని, అమెరికా లో సెటిల్ అవ్వాలి అనుకుంటుంది. సీత కి ఇవన్నీ నచ్చవు.
ఇద్దరు ఫ్రెండ్స్, రోజూ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, హ్యాపీ గా ఉంటారు.
కాలేజీ చదువులు ముగిసాయి. రిజల్ట్స్ వచ్చాయి. సీత బాగా చదువుతుంది, డిస్టింక్షన్ వచ్చింది. గీత కు సెకండ్ క్లాస్ వచ్చింది.
నెక్స్ట్ ఏమిటి చేయాలన్నది ఇద్దరు ఈవెనింగ్ పార్టీ లో ఎజెండా. ఎప్పుడూ కలిసే చోటే ఫ్రెండ్స్ కలిశారు. సీత - "నేను మంచి ఉద్యోగం చూసుకొని, ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాను".
గీత - " లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. NRI ని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాను. సీత కి గీత చెప్పిన పద్ధతి నచ్చలేదు".
ఇద్దరు వాళ్ళ గమ్యం వైపు మొదటి అడుగులు వేస్తున్నారు...
సీత ఉద్యోగం కోసం బాగా ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టు, ఒక మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది. జాబ్ చేసుకుని, పేరెంట్స్ ని బాగా చూసుకుంటుంది.
గీత కి మర్క్స్ తక్కువ రావడం చేత, అమెరికా వెళ్లే ఛాన్స్ రాలేదు. చిన్న ఉద్యోగం చేయడానికి ఇష్టం లేదు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నది. NRI ని పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్లాలని డిసైడ్ చేసుకుంది.
ఇద్దరికీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేయాలనీ ఆలోచిస్తున్నారు. సీత కు మంచి వరుడు కోసం చూస్తున్నారు. గీత లైఫ్ స్టైల్ ని చూసి, పెళ్ళి చేస్తే మారుతుందని ఇంట్లో పెళ్ళి కొడుకు కోసం వెతుకుతున్నారు.
ఇద్దరి పేరెంట్స్ మాట్రిమోనీ సర్వీసెస్ లో రిజిస్ట్రేషన్ చేసారు.
సీత ను ఆమె తల్లిదండ్రులు ఎలాంటి వరుడు కావాలని అడిగారు. సీత, చాలా వినయంగా, మీ ఇష్టమే నా ఇష్టమని చెప్పింది. "అబ్బాయి మంచి వాడు అయితే చాలు" అని సీత అన్నాది.
వరుడు కావలెను : తల్లిదండ్రులు రిజిస్టర్ చేసారు.
అందమైన అబ్బాయి / తెలివైన అబ్బాయి / మంచి ఉగ్యోగము / సంప్రదాయమైన కుటుంబం
గీత ను ఆమె తల్లిదండ్రులు ఎలాంటి వరుడు కావాలని అడిగారు. గీత, లిస్ట్ ఇచ్చింది.
వరుడు కావలెను :
హ్యాండ్సమ్ / ఇంటెలిజెంట్ / ఇన్కమ్ లక్షలలో / రిచ్ బ్యాంకు బ్యాలెన్స్ / ఓన్ హౌస్ / మినిమం 2 కార్స్ / హై-ప్రొఫైల్ లైఫ్.
తల్లిదండ్రులు వాళ్ళ పక్కనుంచి జనరల్ పాయింట్స్ యాడ్ చేసారు:
అందమైన అబ్బాయి / తెలివైన అబ్బాయి / మంచి ఉగ్యోగము / సంప్రదాయమైన కుటుంబం
ఒక సంవత్సరం గడచింది. సీత కు మంచి సంబంధాలు వస్తున్నాయి. సీత ను చూసి ఒక మంచి అబ్బాయి, కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రుల ఇష్టమే తన ఇష్టమే అన్నాది సీత. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెళ్ళి ఉన్నంత లో బాగా జరిగింది. భార్య-భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ, హ్యాపీ గా ఉన్నారు.
గీత కు సంబంధాలు వచ్చినా, డబ్బుల విషయం లో గీత రాజీ పడట్లేదు. మాములు సంబంధాలు గీత ఒప్పుకోవట్లేదు.ఇలాగ ఒక 2 ఇయర్స్ గడిచాయి. సీత కు అబ్బాయి పుట్టాడు. బారసాల కు గీత ను పిలిచింది.
ఇంకో ౩ ఇయర్స్ గడచింది. సీత కు అమ్మాయి పుట్టింది. గీత ను బారసాల కు పిలిచింది. గీత లో హుషారు తగ్గింది. చాలా డల్ గా కనిపించింది.
సీత - గీత తో " పెళ్లి చేసుకోవే తొందరగా", లైఫ్ సెటిల్ అవుతుంది. గీత వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే గీత కు నచ్చచెప్పడానికి చూసారు. గీత అందరికీ "నో" చెప్పింది.
"నీ లాగా నేను రాజీ పడి బతకను." అని సీత కు సమాధానం చెప్పింది.
ఇలాగే, సంవత్సరాలు గడచిపోయాయి. గీత కు పెళ్లి సంబంధాలు రావడం మానేశాయి.
గీత కు ఇంక పెళ్లి కాదని అర్ధమైపోయింది. NRI కాదు కదా, కనీసం రెండవ పెళ్ళివాడు కూడా ఆసక్తి చూపించట్లేదు.
సీత అబ్బాయి చదువు అయిపోయింది. ఉన్నత చదువుల కోసం, సీత దంపతులు కష్టపడి అమెరికా పంపించారు.
గీత తాను చేసిన తప్పులు గుర్తుచేసుకుంది.
ఎక్కువ పేరాశ కు పోకూడదు. వయసు మళ్ళి తిరిగి రాదు. ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బు
కూడా మనకి సహాయం చేయదు. పెళ్లి చేసుకుని, లైఫ్ లో డెవలప్ అవడానికి ప్రయత్నం చేస్తుంటే, లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు, సంసారం లేకుండా అయిపోయింది . తెల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పి చెప్పి ఊరుకున్నారు. వారు కూడా కాలం చేసారు. బంధువులు ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఒంటరి జీవితం అయిపొయింది.
గీత లాంటి జీవితాలు ఎన్నో ఇలాగే ఉంటున్నాయని, మాట్రిమోనీ వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయని వింటున్నాం. అమ్మాయిలకు 40 సంవత్సరాలు వచ్చినా, పెళ్ళి కాని వాళ్ళు ఎందరో ఉన్నారు.