తాతగారి బిల్లు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Taatagari billu

కుందేలుపై తాటిచెట్టుపై నుండి పడ్డాడు కోతి. " చచ్చాన్రో అల్లుడు "అని కేకపెట్టాడు కుందేలు. " చెయి పట్టుతప్పింది అందుకే అంతఎత్తునుండి పడ్డాను సమయానికి నువ్వు అక్కడ ఉండటం వలన నానడుములు ఇరగకుండా మెత్తగా నువ్వు కాపాడావు ,కుందేలు మామా ఆనక్క నన్ను ఎప్పుడు బెదిరిస్తుంది ఈరోజు నక్కతో పోరాడి నేనేమిటో ఈఅడవిలోని జంతువులకు తెలియజేయాలి అనుకుంటున్నాను నువ్వేమంటావు " అన్నాడు కోతి.

" పోరాటమే విజయానికి ఏకైకమార్గం " అన్నాడు కుందేలు . అదేసమయంలో అటుగా వచ్చిన నక్కను చూసిన కోతి ,తన కోరపళ్ళను చూపిస్తూ హుంకరించి ఒక్క ఉదుటున ఎగిరి నక్కపైకిదూకి ,నక్క తోక జానడు నోటకరుచుకుంది .ఊహించని దాడికి అదిరిపడిన నక్క ప్రాణభయంతోరుగు తీస్తూ ఎటువెళ్ళాలో తెలియక ,నేలపై పడిఉన్న డొల్ల ఎండు చెట్టులో దూరి వెలుపలకు వెళదాం అనుకుని ,ఆచెట్టులోదూరి సగందూరం వెళ్ళి ఇరుక్కుపోయింది. నక్కతోక తన నోటితో గట్టిగా పట్టుకున్న కోతికూడా ఆచెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నక్కా,కోతి ముందుకు పోలేక ,వెనకకు రాలేక ,గాలి అందక గిజ గిజ లాడసాగాయి. నక్క,కోతిని అనుసరించి గెంతుతూ వచ్చిన కుందేలు వారి ఇరువురిని ఎలా కాపాడాలో తెలియక అయోమయంలో ఉంది.

అంతలో ఏనుగు అటుగా రావడంతో జరిగినవిషయం తెలియజేసింది కుందేలు.

తన శక్తిని అంతా వినియోగించి ,నేలపై ఉన్న ఆఎండుచెట్టును తొండంతో పైకిలేపి నేలపై బలంగా మోదింది. ఆదెబ్బకు మక్కలైన ఆచెట్టునుండి బైటపడిన నక్క ,కోతినోటిలో తెగిఉన్న తోకను చూసి ప్రాణ భయం పరుగుతీసింది. " వెదవ బ్రతికి పోయాడు. ఏనుగుతాత సమయానికి వచ్చి కాపాడావు ధన్యవాదాలు, చాలారోజులుగా నువ్వు కథచెపితే వినాలి అనుకుంటున్నాను ఏది ఓకథ చెప్పవు అన్నాడు కోతి.

" సరే వినండి...చాలా సంవత్సరాల తరువాత సుందరం తను పుట్టిపెరిగిన ఊరు చూద్దామని వచ్చి రైల్వే ష్టేషన్ దగ్గరలోని లాడ్జిలో బసచేసాడు. తమలాడ్జికి ఎదురుగా ఉన్న హొటల్ వెలుపల ' ఇప్పుడు మీరు భోజనం చేసి వెళ్ళండి,నలభై ఏళ్ళ తరువాత మీమనవడు మాబిల్లు చెల్లిస్తాడు ' అనిరాసిఉంది. వెంటనే ఆహొటల్లోనికి వెళ్ళిన సుందరం తనకు ఇష్టమైన పదార్ధాలతో భోజనం చేసాడు .వెంటనే సర్వరు ఆరువందల డెబై రూపాయల బిల్లుచేతికి ఇచ్చివెళ్ళాడు,బిల్లు చూసిన సుందరం క్యాషియర్ వద్దకు వాళ్ళి " ఏమిటండి ఇది,నాకు బిల్లు వేసారు అన్యాయంగా నేను తిన్నది నామనవడు కదా చెల్లించాలి " అన్నాడు. "నిజమే ఇందులో అన్యాయమేముంది మేము వేసినబిల్లు మీతాతగారు తిన్నదానికి,తమరు తిన్నదానికి మీమనవడి దగ్గర తీసుకుంటాంలెండి " అన్నాడు నింపాదిగా క్యాషియర్ . అదివిని కళ్ళుతిరిగి బిల్లు చెల్లించి వెళ్ళాడు సుందరం " అన్నాడు ఏనుగు తాత.

ఆ కథ విన్న కతి,కుందేలు నేలపైన పడి దొర్లుతూ నవ్వసాగాయి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు