“అరవిందు ! కాస్త అటక మీద నుంచి నా విసన కర్ర దించి పెడుదువు ” అని పిలిచింది బామ్మా .
“అబ్బా ... బామ్మా ! అటకేమో చంద్ర మండలం అంత ఎత్తులో వుంది. దాని మీద ఎక్కాలంటే నిచ్చెన కావాలి ” నసిగాడు మనవడు.
“అదేముంది రా , మామయ్య దగ్గర ఉంటుంది , రాజి ని తెమ్మంటాను ”
“రాజి న , అదేమో నన్ను గేలి చేస్తుంది”
“పోనీ నువ్వే తెచ్చు కో . తొందరగా విసన కర్ర దించు. కుంపటి లో నిప్పు రావడం లేదు , కళ్ళు మండు తున్నాయి … నా మడి వంటకి ఆలస్యం అవుతోంది రా ”
“ఆఆ, వెలు తున్న ” బద్ధకం గా కదిలాడు అరవిందుడు.
“మామయ్య ” అని పిలవక ముందే ప్రత్యక్షం అయిన్ది, శ్రీ రాజ రాజేశ్వరి.
“ఎం బావ ! ఇంత పొద్దునే వచ్చావు నన్ను చూడాలని పించింది ” ఆట పట్టిస్తూ అంటోంది మరదలు పిల్ల.
అసలే రాజి అంటే భయం మన వాడికి , ఇంకేముంది పులిని చూసిన జింకల కంగారు పడుతున్నాడు.
తొందరగా మావయ్య అండ దొరక క పోతే న ఈ సివంగి ఏమి చేస్తుందో అనుకుంటూ , నీలగు తూ “అదేమీ కాదు, బామ్మా నిచ్చెన తీసుకు రమ్మంది , మావయ్య ఎక్కడ ?” లోపల బామ్మాని తిట్టు కుంటూ నసిగాడు.
“అవునా ! నాన్న పొలం కి వెళ్ళాడు. నేను సాయం చేస్తా నిచ్చెన తీసుకు వెళ్దాం ఇటు రా ” అంటూ చెయ్ పట్టుకొని పశువుల పాక లో కి లాకేలింది రాజి. తాను తేరుకునే లోపు పేడ మీద కాలు వేసి “చి” అన్నాడు అరవిందు. పకపకా నవ్వు తున్న రాజీని చూసి , కళ్ళు పెద్ద వి చేసాడు అరవిందు. ఈ లోగ నిచ్చెన తన మీద పడేట్టు తోసింది రాజి.
“అబ్బా ” అని అరిచాడు అరవిందు . తన అల్లరికి బావ బిక్క మొహం చూసి లోపల నవ్వు కుంటూ , "ఇటు వైపు కదులు బావ" అంది రాజి. ఇద్దరు బామ్మా దగరికి చేరారు.
అరవిందు మీద నిచ్చెన చూసి బామ్మా “ భలే వుంది రా మీ ఆట, ఎద్దు మీద నాగలి ల తెచ్చేవేమే పిల్ల ?
కాబో యే మొగుడు ని అలానా ఆడించడం ? “ అని కసిరింది . మెల్లగా అరవిందు నిచ్చెన తీస్తూ
“చూడు బామ్మా ! అందుకే మావయ్య ఇంటికి వెళ్ళాను ” అని బుంగ మూతి పెట్టాడు అరవిందు.
“సరే రా! మావయ్య వచ్చాక రాజి సంగతి చెబుదాం. తొందరగా అటక ఎక్కరా” అని సముదాయించింది బామ్మా.
“ఆలా చూస్తా వేమే .. నిచ్చెన పట్టుకో , వాడు అటక ఎక్కుతాడు ” అని రాజీకి చెప్పింది. “రా బావ ” అని అటక దగ్గరకి తీసుకెళ్లింది.
“బామ్మా ! చూడవే రాజి నిచ్చెన కదిలిస్తోంది ” మొర పెట్టు కున్నాడు అరవిందు. పకపక నవ్వు తున్న రాజీని బామ్మా కసిరింది.
“బామ్మా - మనవడికి నా సహాయం నచ్చడం లేదు నే వెలుతున్న” అని నిచ్చెన వదిలేసింది రాజి.
అరవిందు అప్పటికీ అటకమీద కి వెళిపోయాడు.
“ విసన కర్ర కనిపించిందా , ఇటు కింద పడేయి. తర్వాత మీ బావ మరదలు ఆడుకుందురు గాని”
“ నువ్వూ నీ విసన కర్ర ” మండి పడ్డాడు అరవిందు ”దాని అల్లరి కనిపించదేమే నీకు ?
నేను ఇప్పుడు కిందకు ఎలా రావాలి ” బిక్క మొహం వేసాడు అరవిందు.
“రాజి ! వాడిని అలా వదిలేయకే నిచ్చెన పెట్టు, కిందకు దిగుతాడు ” అంది బామ్మా.
“అమ్మో ఇక్కడేదో కుట్టిన దే బామ్మా ” అని అరిచాడు అరవిందు.
“అయ్యో రాజి తొందరగా రావే. వాడు ఏడూస్తున్నాడు ” అరొస్తోంది బామ్మా. బ్రతుకు జీవుడా అని దిగాడు అరవిందు.
కుట్టిన చేతిని చూసి “మరేం పర్వాలేదు , కాస్త పసుపు ని వేడి చేసిన ఆముదం లో కలిపి రాస్తే తగ్గి పోతుంది లే ” అంది బామ్మా. చెప్పడమే తరువాయి, రాజి ఆముదం తెచ్చి అరవిందు చేతి మీద రాస్తోంది.
“చూడ రా దాని అల్లరి కనిపించింది నీకు. కానీ నీమీద వున్నా ప్రేమ కనిపించ లేదా. ఇంత మంచి పిల్ల ని చేసు కుంటే సుఖ పడతావ్ ” అన్నది బామ్మా. ఆలోచనలో పడ్డాడు అరవిందు.