"తాతయ్యా!" అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది మనవరాలు శ్రావ్య.
"ఏమిటి శ్రావ్య? ఎందుకు పరిగెత్తుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు?"
"నా ఫ్రెండ్ బేబీ ని చాలా పొట్టిగా ఉందని నేను చాలా వెక్కిరించాను. తనకి కోపం వచ్చి, వాళ్ళ అమ్మ కు చెప్పింది. వాళ్ళమ్మ కొడుతుందేమోనని భయంగా ఉంది.
"ఏడవకు! నేను చెబుతాను లే!"
"అయినా, ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు తెలుసా?"
"నేనొక కథ చెబుతాను.అప్పుడు నీకు అర్ధమవుతుంది"
కొన్ని సంవత్సరాల కిందట, కూరగాయల తోట లో కూరలన్నీ సమావేశమయ్యాయి. కూరలలో ఎవరు గొప్ప అని చర్చ జరుగుతుంది.
"నిగ నిగ లాడుతూ ఉంటాను నేను. రంగులోనైనా, ఆకృతిలోనైనా, భలేగా ఉంటాను....వండితే రుచిగా ఉంటాను...నేను గొప్ప "అన్నది వంకాయ. అందుకే నేను ఎప్పుడూ కూరలలో రాజునే!"
అలాగే, బెండకాయ " నన్ను తింటే, బుద్ధి బాగా పెరుగుతుందంటారు. చాలా మంది నన్ను ఎక్కువగా తింటారు. నేను కూరలలోనే రాణి అంటారు.
దుంపకూరలు "మమల్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలైతే, ఇంకా ఇష్టంగా తింటారు.
మిగిలిన కూరలన్నీ కూడా, మేము గొప్పంటే, మేము గొప్ప అని మాట్లాడుతున్నాయి.
అప్పుడు టమోటా! "అలాగైతే, నన్ను చాలా ఎక్కువగా వాడతారు, ప్రతి కూరలో. రంగులో కూడా నేనూ నిగనిగ లాడుతూ ఎర్రగా ఉంటాను."
"ఓ టమోటా! నన్ను వాడినంత గొప్పగా నిన్ను వాడరు. పైగా నువ్వు, చాలా చవుక. నిన్ను ఎక్కువ పండించడానికి రైతులు ఆలోచిస్తారు. నీకు మార్కెట్ లో పెద్దగా రేటు ఉండదు. చాలా సార్లు, రేటు లేక, నిన్ను బయట పారబోశారు. ఈ విషయం అందరికీ తెలుసు. నా రేటు అయితే, చాలా చాలా గొప్పగా పెరిగింది. ఎప్పుడు నాకు చాలా డిమాండ్" అంది ఉల్లి.
నీకు రాజు అయ్యే అర్హత ఎప్పటికి రాదు. మిగతా కూరలు కూడా ఉల్లి ని సమర్ధించాయి.
"ఓ కూర స్నేహితులు! ఒకొక్క కూరలో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి...దేని రుచే దానిది...దేని విలువ దానిది. నా విలువ నాది." అని చెప్పి టమోటా వెళ్లిపోయింది.
కాలం మారింది. టమోటా రేటు మార్కెట్ లో పెరగడం మొదలుపెట్టింది. రోజు రోజుకు మార్కెట్ విలువ పెరిగిపోతూ వస్తోంది. రైతులందరూ, టమోటా మొక్కల సాగు మొదలుపెట్టారు. చాలా మంది కోటీశ్వరులయ్యారు.
కూరగాయలన్నీ, ఆలోచనలో పడ్దాయి. మనం, టమోటా ని చాలా చులకనగా మాట్లాడాము.
ఇప్పుడు టమోటా పంట వెయ్యని రైతు లేడు. మనం చాలా తప్పు చేసాం. ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది. టమోటా చెప్పింది నిజమే.
టమోటా ని రాజు గా ఆహ్వానించాలని కూరలన్నీ, నిర్ణయించుకున్నాయి. అప్పటినించి, అన్ని కూరలకు, సమానంగా రాజు అయ్యే అవకాశం వచ్చింది.
సారీ తాతయ్య! ఇంకెప్పుడూ, ఎవరిని ఏమి అనను.
"నీ తప్పు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు శ్రావ్య తాతయ్య.
********