హెడ్డు సూర్యం - కృష్ణమురళి

Head Suryam

ఆంజనీపుత్రుడు అరచేతితో పెకిల్చిన సంజీవని, చిటికెనవేలితో గోవిందుడు ఎత్తిన గోవర్ధనగిరి, ఉత్తరగోగ్రహణాన పరుగులు పెట్టించిన అర్జునుడి యుద్ధభేరి.... పల్లెటూరిలో ఇద్దరు ముగ్గురు పిల్లలకి ప్రైవేటు తో మొదలెట్టి,పట్టణాన కాలేజీ కట్టించిన మహమ్మారి.... హెడ్డు కాన్స్టేబుల్ సూర్యం ఊగిపోతూ...కోట్లు దొంగిలించిన దొంగని,సెల్లో వేసి,దంచికొట్టి నిజానికి దగ్గరగా తీసుకువచ్చిన వీరుడిలా...సూరీడులా నిప్పులు కక్కుతూ.... సర్!గాడి తప్పుతోంది, అన్న పిలువుకి ఆగిపోయాడు.. సూరీడు కదా!కళ్ళు మరింత ఎర్రబడ్డాయి భయపడ్డ భవానీగారి పీఏ..క్షమించాలి అన్న మాటకు,పూనకం వచ్చినట్టు మొదలుపెట్టేడు..అవును!నే సత్యం చెబుతున్నా...వందకు వంద తెప్పించే మహమ్మారి మళ్ళీ ఛాతీ చించుకున్నాడు.. ఎందుకు సర్!ప్రతిసారీ మహమ్మారి అని మా మేడమ్ని ఆడిపోసుకుంటారు?భవానీ చూపులకు ,ఇటు హెడ్డు లాఠీ దెబ్బలను చేర్చుకుంటూ,భయపడుతూ అడ్డుపడ్డాడు, హెడ్డుగారి ప్రసంగానికి.. మహమ్మారా!?మహానారా...ప్రసంగ పత్రాన్ని కూడి,కూడి చూస్తున్నాడు సూర్యం,తప్పు తెలుసుకున్నాక కింద ఆహూతుల్లో ఉన్న మహమ్మారి అయ్యో!క్షమించాలి భవాని మేడం వంక చూసాడు.. కొరొనా కరాళ నృత్యం అని అన్ని పేపర్ హెడ్ లైన్స్ లో చదివేడు,కొన్నింటిని దగ్గరగా చూసేడు..అప్పుడు వృత్తిధర్మంలో ఫీలింగ్ లేదు,ఇప్పుడు నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో !?ఏమిటో !?మీమాంస లో పడ్డాడు. అడ్డతీగల లో అన్నలతో ముఖముఖీ కూడా ఇంత ఎర్రగా ఉన్నది లేదు..అయినా...తప్పుకే...(సరిగ్గానే చదివేరు) ముందుకు సాగేడు,మన్నన అందుకున్నాడు..పోలీసాడు కదా! అవును భవానీ మేడమ్ మహమ్మారే!?వందకు వంద మార్కు రానివారకి ,రప్పించేవరకూ కునుకుతీయని,కునుకుపట్టనివ్వని మహమ్మారి. .ఇలాంటివారు చరిత్రలో అరుదు..మహనారీ అనే సంబోధన ఎవరికి కావలండీ!?ధారణబ్రహ్మ రాక్షసుడు అంటే ఆ ఘనాపాటి రాక్షసుడు ఐపోతారా!?అలానే చుట్టుపక్కల గ్రామాలకు చదువుల తల్లి,మార్కుల మహమ్మారి మా భవానీగారు...పిల్లలకి శాతానికి శాతం రప్పించడంలో యెనకాడరని చెప్పడానికి,నేనేం ....నేనేం...భయపడను అంటూ ముగించేడు, సిఐ గారు వస్తూండడం చూసి... ఆయన నవ్వుల్లో,విధిలేక అంతా శృతి కలిపేరు..ఆరోజు అప్రతిష్ట నుంచి తప్పించడం కోసం,సమయస్ఫూర్తిగా నవ్విన సిఐ గారిని జన్మలో సూర్యం మర్చిపోలేదు.. ఆ రోజు మొదలు అతడికోసం మాఊరు ప్రతి సభా ఆసక్తిగా ఎదురుచూసేది..ఓరోజు మా ఊరి ప్రెసిడెంటుకు కావాలనే,సరదాగా సన్మానం పెట్టించేం..గెస్ట్ సూర్యం గారు..ప్రెసిడెంట్ వెంకటరావు.. ఏముంది ఇందులో!?అనుకోకండి.. అపర కర్ణుడు,ధర్మ సూక్ష్మముల్లో ఆగ్రజుడు,గురిచూసి ఛేదించే అర్జునుడు అయిన మన ప్రెసిడెంటుకు ,చిన్నప్పటినుంచీ ఇప్పటివరకూ ఏవీరావు...ఏమీరావు అంటే ఏవీరావు అంతే!? ఎం చెప్పదలిచేరు సర్!?వార్డ్ మెంబర్ ఒకరు అడ్డుపడ్డారు.భయపడ్డాడు కూడా మొదలెడితే ఆపడం రాని,ఎక్కడున్నా డ్యూటీ లో ఉన్నాననుకుని,మాటలతో దోషినుంచి నిజాలు రాబట్టేస్తున్నా అని సరదాపడతాడో ఏమో!?...కింద కూర్చున్నవారు నవ్వాపుకుంటుంటే...తానేదో భారతం పార్ట్ 2 తీస్తున్నట్టు,ప్రెసిడెంటు అర్జునుడు,తాను కృషుడు అయినట్టు,ఏదేదో ఊహించేసుకుంటూ... అలా ఏవీరాకపోయినా ఊరికి మొగుడయ్యాడు మన వెంకట్రావు గారు..చప్పట్లు అన్నాడు సంతోషంతో.. కింద కూర్చున్న ప్రెసిడెంటుకి,చప్పట్లకు నవ్వాలో,తనకు ఏమీ రాదని తెలిసినందుకు ఏడవాలో అర్థం కాలేదు.. సీఐ వస్తూ కనిపించడంతో,తనను సంభాళించుకున్న సూర్యం,అంటే....ఏవీరావు...నిజమే!ఈ ఊరికి రోగాలు రొష్టులు రావు,అల్లర్లు,బందులు రావు,పిల్లలకి మార్కులు తక్కువ రావు,వ్యవసాయంలో నష్టాలు రావు...ఇలాంటి నక్షత్రాలు,సర్ !మీ నక్షత్రం ఆశ్లేష కదూ!?....ఆశ్లేష నక్షత్రాలు ఉన్నచోట అశేష ఆదరణ వస్తుంది తప్ప లాస్ రాదని...అలాంటి రావుగారు మీ ఊరికి ప్రెసిడెంటు కావడం ,నా అదృష్టం కూడా అని,అమ్మయ్యా అనుకుని తలపట్టుకున్నాడు... ముచ్చటగా మూడోసారి,రామారావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ,కొన్ని నవ్వులు పూయించే కార్యక్రమాన్ని హెడ్డుసూర్యం చేతుల్లో పెట్టారు.. హెడ్డు స్టేజ్ ఎక్కుతుండగానే మా ఊరోళ్ళు చప్పట్లు కొట్టారు..ఎంత అభిమానమో అనుకున్నారు మిగతా.. తండ్రిమాట జవదాటని పుత్రుడూ...ఊరంతటకి ఆపదలో మిత్రుడూ...మన కాంస్టిట్యూట్ కి అమావాస్య చంద్రుడు...(మొదలెట్టేడురోయి హెడ్డూ) మాటవిని ,తనను సరిచూసుకునే ప్రయత్నం చేసేడు హెడ్డు..మళ్ళీ అంతా చెప్పి,అమావాస్య చం...దు...ర్....మైకమా!?నటనమా!?తెలీని సందిగ్ధంలో పడిపోయాడు.. భలే తప్పుకున్నారు మన హెడ్డు!?మాటలు వినిపిస్తున్నాయి..డాక్టర్ వచ్చి మొహం మీద టార్చ్ వేస్తే కళ్ళు మూసే ఉంచుదాం అనుకున్నా ,కుదరలేదు.. అంతటి నవ్వుల కిరీటిని తీసుకెళ్లి అడ్డతీగల్లో వేసేసేరు మళ్ళీ..మాకు మాత్రం ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా,అతను వస్తే బావుణ్ణు అని చూపులు వెదుకుతూ ఉంటాయి.. నవ్వడం,నవ్వించడం ఆషామాషీనా మరి!?

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు