వ్యాపారి దయాగుణం - - బోగా పురుషోత్తం

Vyapari dayagunam
రామగిరిలో రామయ్య అనే ఓ వడ్డీ వ్యాపారి వుండేవాడు. అతను వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు. నిరుపేదలను ఎంచుకుని ఇళ్లు, పొలాలు, బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టుకుని డబ్బువడ్డీకి వచ్చేవాడు.
క్రమంగా వడ్డీ తీసుకునేవారు అధికం కావడంతో తీసుకునే వడ్డీ అధికం చేశాడు. రుణాలు చెల్లించకుంటే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని జలగల్లా పీడిరచేవాడు.
రామగిరి పక్కనే రత్నగిరి వుంది. రత్నగిరిలో ఓ రత్నాల వ్యాపారి వున్నాడు. అతనికి మూడు, నాలుగు దుకాణాలు వున్నాయి. అందులో బంగారు ఆభరణాలు అమ్మడం, కొనడంతో పాటు బంగారు వస్తువులను తాకట్టుపెట్టుకుని వడ్డీలకు ఇచ్చేవాడు. రత్నాల వ్యాపారి చిన్నతనం నుంచి కష్టపడిని వ్యక్తి కావడంతో పేదల కష్టం గుర్తించి వారికి తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేవాడు.
ఇది చూసిన పేదలు రామయ్య వద్దకు రుణాల కోసం వెళ్లడం మానుకున్నారు. ఏదైనా కష్టాల్లో వున్న వారి బాధలు తెలుసుకుని ఆదుకుంటున్న రత్నాల వ్యాపారి వద్దకు వెళ్లి ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు తెచ్చుకునేవారు. రత్నాల వ్యాపారి దయాహృదయంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఎప్పుడూ ఎవరిని పీడిరచే వాడు కాదు. దీంతో రత్నాల వ్యాపారి వద్ద వున్న డబ్బు అంతా ఖాళీ అయ్యింది. తినడానికి తిండి లేక వ్యాపారం విడిచి వీధిన పడ్డాడు. భార్యా పిల్లలు పస్తులతో అలమటించసాగారు.
ఇది గమనించిన రామయ్య తన వడ్డీ వ్యాపారం పుంజుకోవడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఇక తను కోటీశ్వరుడు కావచ్చునని కలలు కన్నాడు. తన ఇంట్లో పిల్లలను పిలిచి వ్యాపారంలో ఎలాంటి దయాగుణం తగదని, అలా చేస్తే మనమే తీవ్రంగా నష్టపోతామని రత్నాల వ్యాపారి జీవితాన్ని వివరించ సాగాడు.
సరిగ్గా అదే సమయానికి రత్నాల వ్యాపారి జీవితాన్ని వివరించ సాగాడు. అదే సమయానికి రత్నాల వ్యాపారి రామయ్య గుమ్మం ముందు నిల్చొని తనను ఆదుకోవాలని అర్థించాడు.
రామయ్య కనికరించలేదు ‘‘ పో..పోవయ్యా..నీ చేతకాని తనం వల్ల డబ్బు పోగొట్టుకున్నావు.. వ్యాపారంలో దయాగుణం అసలు తగదు. నీ విశాల హృదయమే నిన్ను భిక్షగాడిని చేసింది.. వెళ్లి అడుక్కు తిను..’’ అని హేళన చేశాడు.
రత్నాల వ్యాపారి చేసేదేమీ లేక భారమైన మనసుతో వెనుదిరిగాడు.
నాలుగేళ్లు గడిచాయి. రామయ్య మిద్దెలపై మిద్దెలు కట్టాడు. ఇళ్లలో డబ్బుల కట్టలు కన్పించేవి. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది. అతని దుకాణాలపై, ఇళ్లపై దాడి చేశారు. అక్రమంగా డబ్బు సంపాయించాడని అభియోగం మోపారు. జైల్లో పెట్టారు.
పూరి గుడిసెలో నివసిస్తున్న రత్నాల వ్యాపారి వద్దకు ఓ రోజు ఆ జిల్లా ఎస్‌పి వచ్చాడు. ఓ నాల్గు లక్షలు డబ్బు ఇచ్చి ‘‘ మీరు ఇచ్చిన లక్ష రూపాయల సాయంతో నేను ఐపీఎస్‌ చది ప్రభుత్వ ఉద్యోగం పొందాను..ఇదుగోండి.. మీరిచ్చిన లక్ష అప్పుకు వడ్డీతో కలిపి నాల్గు లక్షలు ..తీసుకోండి..’’ అని చేతిలో పెట్టాడు.
‘‘ మీ కెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా నా దగ్గరకు రండి..’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
నాల్గు లక్షలతో మళ్లీ రత్నాల వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ సారి మరో ఇన్‌కంటాక్సు అధికారి వచ్చి పది లక్షలు చేతిలో పెట్టి ‘‘ ఇదుగోండి.. నా చదువుకు మీ రిచ్చిన మూడు లక్షలకు వడ్డీతో కలిపి ఇస్తున్నా స్వీకరించండి.. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను.. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి..’’ అంటూ వెళ్లిపోయాడు.
ఓ ఏడాదిలోనే రత్నాల వ్యాపారి వ్యాపారం పుంజుకుంది. కోట్లాది రూపాయల ఆస్తి సమకూరింది. పేదలకు ఇతోధికంగా సాయం చేస్తూ ఆదుకున్నాడు. ఆదాయ లెక్కలు చూపుతూ ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కట్టేవాడు.
ఓ రోజు రామయ్య కొడుకు అతని వద్దకు వచ్చి ‘‘ సార్‌.. సార్‌..! మా నాన్న లోభిగుణం వల్లే మేము సర్వం కోల్పోయి ఇలా అయ్యాము..!’’ అని సాయం కోసం చేతులు జోడిరచాడు.
చలించిన రత్నాల వ్యాపారి తతన దుకాణంలో ఉద్యోగం ఇచ్చి అతడిని బాగా చదివించాడు. జైలులో వున్న అతని తండ్రిని తన పేరు ప్రఖ్యాతలతో విడుదల చేయించాడు.
అప్పటికే ఐఎఎస్‌ ఆఫీసర్‌ అయిన కొడుకును చూసి ఆనంద పడ్డాడు రామయ్య.
తనకు, సమాజానికి ఎంతో సేవ చేసిన రత్నాల వ్యాపారి దయాగుణమే తనను రక్షించిందని తెలుసుకున్నాడు రామయ్య. తర్వాత రత్నాల వ్యాపారి ప్రోత్సాహం, డబ్బు సాయంతో మళ్లీ వడ్డీ వ్యాపారం ప్రారంభించి ధర్మగుణంతో డబ్బు వడ్డీలకు ఇస్తూ పేదలను ఆదుకుంటూ మంచి సమాజ సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు రామయ్య.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు