కాళిదాసు గర్వ భంగము - ambadipudi syamasundar rao

Kalidasu garvabhangam

కాళిదాసు మగధను పరిపాలించిన శుంగ' రాజుల కాలం నాటి కవి.అంటే క్రీ.పూ 185 - 141 మధ్యకాలం నాటి కవి.రెండో శుంగ రాజైన అగ్నిమిత్రుని గూర్చి 'మాళవికాగ్నిమిత్రం' రచించాడు.వారి ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి.కాళిదాసు ఉజ్జయిని ని పాలించిన విక్రమాదిత్యుని సంస్థానంలోని కవి అని కూడా చెపుతారు అయన గొప్ప సంస్కృత పండితుడు చాలా గొప్ప మేధావిగా పేరు పొందిన వాడు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం వంటి కావ్యాలు రచించి పండితుల ప్రశంసలు పొందిన గొప్ప కవి నేటికీ సంస్కృతంలో గొప్ప కవిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కవి కాళిదాసు. విద్య అధికారము ధనము సహజముగా ఎలాంటి వారిలో నైనా గర్వాన్ని కలుగజేస్తాయి మహాకవి కాళిదాసు విషయంలో కూడా అదే జరిగింది సాక్షాత్తు సరస్వతి దేవి కాళిదాసు గర్వాన్ని ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కదా ద్వారా తెలుసుకుందాం

ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం కాళిదాసు ఒక గ్రామానికి చేరుకున్నాడు దాహము వేయటంతో ఓ గుడిసె దగ్గర ఆగి ,"దాహంగా ఉంది కాసిని మంచి నీళ్లు ఇవ్వండి" అని ఆ గుడిసెలోని వాళ్ళని అడిగాడు ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి కాళిదాసుని చూసి "మీరు ఎవరు?ఎక్కడి నుంచి వస్తున్నారు ? " అని అడిగింది. ఈ ప్రశ్న విని కాళిదాసుకు బోలెడు ఆశ్చర్యం వేసి," నేనెవరో మీకు తెలియదా? నేను పెద్ద పండితుడిని ఈ రాజ్యములో నా గురించి ఎవరిని అడిగినా చెబుతారు "అని అంటాడు. ఆ ముసలావిడ నవ్వి," ఆహా మీరు అంత గొప్ప పండితులా? అయితే నాకు ప్రపంచంలో ఇద్దరు బలవంతులు ఎవరో చెప్పండి?"అంది. కాళిదాసు కాసేపు అలోచించి," నాకు వాళ్లెవరో తెలియదు నా గొంతు ఎండి పోతుంది ముందు తాగడానికి నీళ్లు ఇవ్వండి"అని వినయంగా అడిగాడు.

ఆ ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా ," ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఆకలి,దాహము ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడిగింది. దానికి జవాబుగా ,"నేను బాటసారిని" అని సమాధానం ఇచ్చాడు వెంటనే ఆ ముసలావిడ " ఆహా అలాగే ఐతే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరో చెప్పండి?" అని అడిగింది. ఈ ప్రశ్నకు తెల్లమొహము వేసిన కాళిదాసు," అమ్మా దాహము తో చచ్చి
పోయేట ట్లున్నాను ముందు మంచి నీళ్లు ఇవ్వండి"అని ప్రాధేయపడ్డాడు.ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా,"సూర్యచంద్రులు"అని జవాబిచ్చి ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి?అంది. ఆ ప్రశ్నకు జవాబుగా కాళిదాసు దీనంగా,"నేను అతిధిని"అని చెపుతాడు.
ముసలావిడ,"మీరు అసత్యమాడుతున్నారు ఈ సృష్టిలో అతిధులు ఇద్దరే ఇద్దరు.ఒకటి ధనము, రెండవది యవ్వనము అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు" అని అంటుంది.అప్పుడు కాళిదాసు,"అమ్మా నా సహనాన్ని జ్ఞానాన్ని తర్వాత పరీక్షించవచ్చు ముందు హాసిని మంచి నీళ్లు ఇవ్వండి అని ప్రాధేయ పూర్వకముగా అడిగాడు.ఆ ముసలావిడ ప్రపంచములోని సహన శీలులు ఎవ్వరో సెలవివ్వగలరా? అని ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు బిక్కమొహం వేసిన కాళిదాసుతో ముసలావిడ "ఒకటి భూమి, రెండవది వృక్షము ఇంతకీ మీరు ఎవరు చెప్పండి?"అని అడుగుతుంది.ఓపిక, సహనం నశించిన కాళిదాసు ,"నేను మూర్ఖుడిని ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి కాసిని మంచినీళ్లు ఇస్తావా" చికాకు పడతాడు
ఆ ముసలావిడ నవ్వుతు," ఇది నిజము కాదు ఎందుకంటే ఈ రాజ్యములో ఇద్దరే ఇద్దరు మూర్ఖులు ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు ,రెండో వ్యక్తి ఆ రాజు మొప్పు ప్రాపకం కోసం ఆ సత్య వాక్యాలు పలికే పండితుడు "అని అన్న వెంటనే కాళిదాసుకు తత్వము అర్ధమై కనువిప్పు కలిగింది.వెంటనే ఆ ముసలావిడ కాళ్ళమీద పడి క్షమించమని అడిగి," అమ్మా మీరెవరు?" అని ప్రార్ధించగా కాళిదాసు ఎదుట సరస్వతి దేవి సాక్షాత్కరించి," నాయనా విద్యతో వినయము వృద్ధి చెందాలే గాని అహంకారము కాదు,కీర్తి ప్రతిష్టలు మాయలో పడిన నీ బుద్ధి సరి చేయడానికి ఈ పరీక్ష"అనగానే కాళిదాసుకు మంచి నీళ్లు తాగకుండా దాహము తీరిపోయింది.విద్య వినయాన్ని పెంచాలి గాని మనిషికి అహంకారాన్ని పెంచకూడదు. అలాగే ధనం అధికారం రాజుగారి ప్రాపకం వగైరాలు కూడా అహంకారానికి కారణాలు కారాదు అనేదే ఈ కధలో నీతి ఈ కనిజంగా జరిగిందా లేదా అన్నది ప్రశ్న కాదు ఈ కధ మేధావులము అనుకునే ప్రతి వారికి వర్తిస్తుంది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు