జ్ఞానేశ్వర్ - మద్దూరి నరసింహమూర్తి

Gjnaneswar

ఆంధ్రరాష్ట్ర సరిహద్దుని ఆనుకొనికున్న ఒడిశా రాష్ట్రంలో ఉన్న మాఊరి బడిలో విద్యా మాధ్యమం తెలుగు భాషలో ఉన్నా-- 'లోయర్ ఒరియా' విధిగా చదువుకోవలసి ఉండేది. దాంతోబాటుగా, 'హిందీ' కానీ 'సంసృతం' కానీ చదువుకోవాలి.

'లోయర్ ఒరియా' మరియు 'హిందీ' కానీ 'సంసృతం' కానీ -- కలిపి మొత్తం మీద నూటికి 30 మార్కులు వస్తే పాస్ అయినట్టే. కాబట్టి, మేము సులువుగా చదువుకోగలిగే సంసృతంలో మంచి మార్కులు తెచ్చుకొని, 'లోయర్ ఒరియా' లో ఎన్ని మార్కులు వస్తాయో అని ఆలోచించక, పరీక్షలో ఉత్తీర్ణం అయేవాళ్ళం. అలా చదువుకొన్న మా మిత్రబృందంలో ఎవరికీ ఒరియా భాష కానీ హిందీ భాష కానీ వంటబట్టలేదు.

ఒరియా హిందీ భాషలలో అంతంత మాత్రం జ్ఞానం కలిగిన మా స్నేహితుడు ‘జ్ఞానేశ్వర్’ (మేము వాడిని సరదాగా ‘జ్ఞాని’ అని పిలుచుకుంటాం) పక్కనే ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక పల్లెటూరికి చిన్న పని మీద వెళ్ళవలసి వచ్చింది. ఆ పల్లెటూరిలో బస్సు స్టాండ్ దగ్గర ఉండే ఒకటి రెండు చిన్న హోటల్స్ తప్ప తిండికి ఇంకెక్కడా వేరే సదుపాయం ఉండదు. ఊరి లోపలికి వెళ్ళడానికి రెండో మూడో రిక్షాలుంటాయి.

బస్సు దిగేసరికి ఆకలికి నకనక లాడుతున్న కడుపుతో మా జ్ఞాని ఒక హోటల్ లోపలకి వెళ్లి, వచ్చీ రాని ఒరియా భాషలో భోజనం కావాలని అడిగితే, ఆ హోటల్ వాడు ఒరియా భాషలో 'ఆమిసొ' కావాలా లేక 'నిరామిసొ' కావాలా అని అడిగేడు. మా జ్ఞాని ఆ ప్రశ్నని ఆంగ్లంలోకి అన్వయించుకొని, హోటల్ వాడు 'వెజిటేరియన్' కావాలా లేక 'నాన్-వెజిటేరియన్' కావాలా అని అడుగుతున్నాడని అర్ధం చేసుకొన్నవాడై 'ఆమిసొ' కావాలని చెప్పిన పది నిమిషాలకి ---

ఒక ప్లేటులో వేయించిన చేప ముక్కలుతో బాటూ మసాలా బాగా దట్టించిన మాంసం కూర తెచ్చి 'ఏది కావాలి' అని అడిగేసరికి లేచి పరుగందుకున్నాడు జ్ఞాని.

-2-

ఆ దెబ్బకి -- జ్ఞాని భోజనం ఊసు ఎత్తుకోక అక్కడే ఉన్న చిన్న బడ్డీ దుకాణంలో దొరుకుతున్న నాలుగు అరటి పళ్లతో ఆ పూటకి ఆత్మారాముడికి నివేదన చేసేడు.

ఊళ్లోకి వెళ్ళడానికి రిక్షా వాడిని 'ఎంత' అని జ్ఞాని అడిగితే వాడు ' దెడొ టొంకా ' అన్నాడు.

రెండు రూపాయలన్నర అడుగుతున్నాడని అర్ధం చేసుకున్న జ్ఞాని -- రూపాయిన్నరకి బేరమాడతాననుకొని -- 'అడై రూపయా’ కి వస్తావా అన్నాడు.

వీడికి ఒరియా హిందీ భాషలు రెండూ తెలియవు అని గ్రహించిన రిక్షావాడు - ‘లేదు’ ‘కాదు’ అన్నట్టుగా ఒక నిమిషం నటించి – తరువాత ఒప్పుకున్నట్లు నటించి -- మా జ్ఞానిని రిక్షా ఎక్కించుకొని గమ్యస్థానం చేరిన తరువాత ---

మా జ్ఞాని ముక్కు పిండి రెండు రూపాయలన్నర

(అడై రూపయా) పూర్తిగా వసూలు చేసేడు.

*****

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు