పట్టణానికి చాలాదూరంగా ఉన్నగ్రామం సత్రం ఆరువందల ఇళ్ళుఉన్నా,ఆఊరికి బస్ ,రైలు సౌకర్యంలేదు,విద్య ప్రాధమిక పాఠశాల నాలుగు కిలోమీటర్ల దూరంలోని కండ్రిక గ్రామంలో ఉంది. వైద్యా అవసరాలకు నలభై కిలోమీటర్లు దూరం గతుకుల మట్టిరోడ్డులో ప్రయాణం చేయవలసిందే . ఆఊరుకు ఉన్నది రెండే మంచినీటి బావులు ,ఆబావుల్లో నీరు తక్కువగా ఉంటుంది.
అకస్మాత్తుగా సత్రం లోని ఒకబావిలో గణపతి వెలసాడు. ఆబావి నీళ్ళు తాగితే ఎటువంటి వ్యాధులైనా తగ్గిపోతాయని ప్రచారం జరిగింది.
ఆవిషయం ప్రసారమాధ్యమాలద్వారా అంతటా తెలిసిపోయింది. పలుబసులతోపాటు,కార్లు,ఆటోలు మోటారు సైకిళ్ళపై వచ్చిన జనాలు బావిలోని బురద నీటినికూడా తీసుకుపోసాగారు. ఆప్రాంతంలో పలురకాల అంగడులు వెలసాయి.ఆఊరిలో రోజు తిరునాళ్ళ సందడే. గ్రామపంచాయితి వారు, బావిలో వెలసిన గణపతికి దేవాలయం కట్టాలి కనుక సీసా నీళ్ళు వందరూపాయల వెలకు అమ్మసాగారు.
" ప్రెసిడెంటుగారు ఆదేవునిదయవలన మనఊరిబావిలో వినాయకుడు వెలసాడు.ఇంతకాలం నిధులు లేక మనం వైద్యశాల,పాఠశాల నిర్మించుకోలేకపోయాము, ఇన్నాళ్ళకు మనకోరిక తీరబోతుంది " అన్నాడు గ్రామ కార్యదర్శి. " కార్యదర్శిగారు ఇందులో దేవునిదయ ఏమిలేదు,మనం ఎంతప్రయాసపడినా మనగ్రామాభివృధ్ధికి ఎవ్వరు ధన సహయంచేయలేదు. ఇప్పుడు కోటి రూపాయలపైగా మనకు బావినీళ్ళ ద్వారా వచ్చింది. మొన్నకురిసిన వానలకు నేను మాపొలం దున్నుతుంటే పెద్ద గణపతి విగ్రహం దొరికింది దాన్ని మాపిల్లల ద్వారా ఆబావిలోనికి నేనే చేర్పించాను. నాఎత్తుగడ పారింది. ఇప్పుడు వద్దన్నా డబ్బే ,మన అవసరాలకు ఎదటివారి బలహీనతలను తెలివిగా వాడుకున్నాను. వచ్చేవారికి గణపతి బావి,దానిపై వచ్చే ఆదాయం మన గ్రామాభివృధ్ధిని చేసుకుందాం! అయినా బావి నీళ్ళకి రోగాలు తగ్గుతాయా? ఉడత ఊపులకు చింతకాయలు రాలవు " అనివెళ్ళాడు ప్రసిడెంట్ .ప్రసివడెంట్ తెలివికి నోరు తెరిచాడు గ్రామ కార్య దర్శి.