ఎక్కడో,అక్కడ పరిచయం కుల,మత భేదాలు లేని సంస్థ ఉందంటే మిత్రుడు ఒక్కటే అని చెప్పారు.ఒక రోజు సూరి,మంజు కలిసి కాలేజ్ హాలిడే రోజు ఊరికి వెళ్ళాలని మాట్లాడుకున్నారు.మంజు మనం సాయంత్రం ఊరికి రైలులో వెళ్దామా అని చెప్పాడు సూరి.సరే సూరి.మధ్యాహ్నం సమయంలో సూరి,మంజు వాళ్ళ కొందరి స్నేహితులు కలిసి మైదానానికి వెళ్ళారు.సాయంత్రం అయింది.కానీ ఇద్దరు మరిచిపోయారు ఊరికి వెళ్ళే విషయం...సూరి స్నేహితుడు(అరవింద్) వచ్చి మామ నువ్వు ఊరికి వెళ్ళాలని అనుకున్నవు గుర్తుందా అని తెలియజేస్తాడు.అప్పుడు అయ్యే..!అరవింద్ ఇప్పుడు సమయం ఎంత 7:30pm అని చెప్పుడు.ఇక మేము స్టేషనుకు అరగంటలో వెళ్ళాలి లేకపోతే మిస్స్ అవుతుంది అరవింది అని చెప్పాడు సూరి.సూరి మంజుకు ఫోన్ చేసి అరే మన రైలు ఇక అరగంట సమయం మాత్రమే ఉంది బయలుదేరుద్దాం.సరే అని మంజు,సూరి గబ గబ అన్నం తిని వెళ్తాడు.కానీ రోడ్డు సరిహద్దులో ఒక ఆటో కానీ బస్సులు కానీ రాలేదు...సూరి,మంజు తలబదుకున్నారు. ఆ సమయంలోనే అరవింద్ బయటికి వాకింగ్ చేయడానికి వచ్చాడు.సూరి,మంజును చూసి అందుకే సూరి సమయం మనది కాదు.సమయం ఉన్నప్పుడే ఆలోచించుంటే తొందరగా రైల్వే స్టేషన్ కు చేరుకునేవారు.అదిగో...అక్కడ ఆటో వస్తుంది ఎక్కండి తొందరగా వెళ్ళిన తరువాత నాకు ఫోన్ చేయండి సూరి.సరే అరవింద్ వెళ్ళి వస్తాము అని మంజు చెప్పాడు.రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.రైలు ఐదు నిమిషాలకు ప్లాట్ ఫామ్ మీదకు వస్తుంది అనడంతో వెంటనే ఫోన్ చేసి అరవింద్ మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాము అని చెప్పాడు.సరే కానీ ఇప్పుడు చేసిన తప్పు ఇంకెప్పుడు చేయకు “సమయం మనది కాదు కానీ సక్రమంగా సమయాన్ని ఎప్పుడైతే వాడుకుంటమో అప్పుడే నువ్వు రాజువు కాగలవు”...గుర్తుంచుకో సూరి,మంజు అని అరవింద్ చెప్పాడు..