జీవితం చాలా చిన్నది - తాత మోహనకృష్ణ

Jeevitam chala chinnadi


పెళ్ళి వేడుక ప్రవేశద్వారం నుంచి లోపలికి వస్తున్న అందరికీ... గులాబీలు అందిస్తున్నారు... చక్కాగా లంగా ఓణి అలంకరించుకున్న అమ్మాయిలు. అందులో చక్కటి చిరునవ్వుతో... అందరిని ఆహ్వానిస్తున్నది శృతి.

శృతి... ఆనంద్- దేవకి సంతానం. చాలా తెలివైన అమ్మాయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎప్పుడూ... నవ్వుతూ... నవ్విస్తూ ఉండే స్వభావం చేత, శృతి అందరికి చాలా తొందరగా దగ్గరైపోతుంది. కాలేజీ లో అందుకే, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు శృతి కు. క్యాంపస్ ఇంటర్వ్యూ లో టాప్ కంపెనీ కు సెలెక్ట్ అయ్యి, త్వరలో మంచి ప్యాకేజీ తో ఉద్యోగం జాయిన్ అవుతుందని తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు.

పెళ్ళి ముహూర్తం రాత్రి అవడం, సాయంత్రం నుంచి బంధుమిత్రుల రాక తో పెళ్ళి మండపం చాలా సందడిగా ఉంది. పెళ్ళికూతురు అందంగా అలంకరించుకుని, మండపం పైకి తీసుకుని వచ్చారు. పెళ్ళికూతురు... పెళ్ళికొడుకు పక్కనే కూర్చోపెట్టారు. పెళ్ళికొడుకు తాళి కట్టలేక, పక్కన పళ్ళెం లో పెట్టేసి కిందకు వచ్చేసాడు...
పెళ్ళికొడుకు చేసిన పనికి, అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికొడుకు తో గొడవకు దిగారు...

పెళ్ళికొడుకు ముందుకు వచ్చి...

"అంకుల్! మీ అమ్మాయి ప్రీతి ను పెళ్ళిచూపులలో చూసాను. మీ రెండో అమ్మాయి శృతి, నాకు ముందే తెలుసు. కాలేజీ లో మేము, రెండు సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నాము. ఒకరోజు శృతి నా దగ్గరకు వచ్చి ...

****
"రాజేష్! నువ్వంటే నాకు చాలా ఇష్టం...నీతో జీవితం ఎంతో ఉహించుకున్నాను. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ మా ఇంట్లో అక్క కు పెళ్ళి చేస్తే గాని, మన పెళ్ళి కాదు. మా అక్కంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాన్న మాట ప్రకారం...నువ్వు పెళ్ళిచూపులకు వచ్చి మా అక్కను ఇష్టపడాలి. మన ప్రేమ గురించి ఎవరికీ చెప్పనని మాట ఇవ్వు.

మా అమ్మ నాన్న కు నువ్వు చాలా బాగా నచ్చావు. మా అక్క.. నీ ఫోటో చూసి చాలా ఇష్టపడింది. మా అక్క నా అంత హుషారు కాదు. నెమ్మదస్తురాలు. అమాయకురాలు కూడా. నీ లాంటి వాడి తోడు ఉంటే, తాను చాలా సంతోషంగా ఉంటుంది."

"శృతి! నీలో నాకు నచ్చింది.... ఆ చలాకీతనం, ఆ హుషారు...అది ఎలాగా మర్చిపోమంటావు?"
"లేదు రాజేష్! నా కోసం నువ్వు అక్క ను పెళ్ళి చేసుకోవాలి...అని మనసునిండ బాధ తో చెప్పి వెళ్లిపోయింది శృతి"

పెళ్ళిచూపులలో రాజేష్ ముందు ప్రీతి కూర్చుని వుంది...కాఫీ ఇచ్చింది..పక్కనే ఉన్న శృతి వైపు చూసాడు రాజేష్...పైకి నవ్వుతు ఉన్నా, లోపల బరువైన మనసుతో అక్క ను ఓకే చేయమని సైగ చేసింది శృతి...

పెళ్ళికొడుకు ఏమీ మాట్లాడలేదు...మౌనం అంగీకారం అని... పెళ్ళి ఖాయం చేసారు ఇరువురు పెద్దలు. పెళ్ళి పత్రికలు అచ్చయ్యాయి....కల్యాణ మండపం కూడా బుక్ అయ్యింది...రాజేష్ మనసు ఎందుకో ఈ పెళ్ళి కి 'నో' అంటోంది.
****

"అంకుల్! ఇప్పుడు చెప్పండి...మనిషి జీవితం చాలా చిన్నదంటారు...అలాంటి జీవితం లో పెళ్ళి అంటే చాలా ముఖ్యం కదా! జీవితం చాలా చిన్నది కదా! అంకుల్.. మరుజన్మ గురించి తెలియదు....ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు. పుర్వం అయితే, మనుషులకు దీర్ఘ ఆయుష్షు ఉండేది...ఇప్పుడు ఈ కలికాలం లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు...ఇంత చిన్న జీవితంలో మన ఆనందాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం తప్పా? చెప్పండి!

శృతి మనసులో నేను ఎంత ఉన్నానో నాకు తెలుసు. బయటకు నవ్వుతు ఉన్నా, లోపల ఉన్న తన బాధ నాకు తెలుసు. మీ మాటకు ఎదురు చెప్పలేక, అక్క కోసం, నన్ను వదులుకుంది. శృతి జీవితం, నా జీవితం బాగుండాలనే ఇలా చేశాను. నాకు అన్ని విధాలా నచ్చిన శృతి కి తప్ప ఇంకెవరికి తాళి కట్టలేను.

నన్ను క్షమించండి అంకుల్..ప్రీతి కు ఇంకో మంచి సంబంధం నేనే చూస్తాను అంటూ... ఆనంద్ కాళ్ళు పట్టుకున్నాడు రాజేష్

"లే నాయన! చిన్నవాడివైనా....సత్యం చెప్పావు...నాకు అమ్మాయిలిద్దరూ రెండు కళ్ళు...ఒకరి జీవితం కోసం ఇంకొకరి జీవితం పాడు చెయ్యలేను...మీ పెళ్ళికి మా దంపతులము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాము....

అమ్మా! శృతి..ఇలా రా అమ్మ! అని శృతి చేతిని రాజేష్ చేతిలో పెట్టాడు ఆనంద్....దేవకీ కూడా శృతిని హత్తుకుంది. ప్రీతి 'అల్ ది బెస్ట్" చెప్పింది కొత్త జంట కు.

అదే ముహూర్తానికి శృతి కి రాజేష్ కు ఘనంగా పెళ్ళి జరిగింది.

**************

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు