పిల్లలు చేసిన సహాయం - సి.లక్ష్మి కుమారి

Pillaliu chesina sahayam

అనగనగా సంతతిపురం అనే ఊరిలో సాగర్ అనే అబ్బాయి ఉండేవాడు సాగర్ కు తినడం అంటే ఇష్టం సాగర్ ఎప్పుడు బయట తిరిగేవాడు సాగరకు చదువు పెద్దగా రాదు. సాగర్ కి చదువు మీద ఆసక్తి కూడా తక్కువగానే ఉండేది సాగర్ ఒకరోజు అంగడికి వెళ్లి వస్తూ ఉండగా తను రోడ్డు పక్కన ఒక జంతువునుంచుని ఉండడం చూశాడు ఆ జంతువు చాలా సన్నగా ఉంది తన కళ్ళు ఆహారం కోసం వెతుకుతున్నట్టు ఉంది దాని పక్కనే అంగడి ఉంది కానీ దానికి ఎవరు తిండి పెట్టేవారు లేరు అని సాగర్ మనసులో అనుకొని తనకోసం కొన్న ఆహారాన్ని దానికి వేసి అక్కడ నుంచి సాగర్ వెళ్లిపోయాడు. సాగర్ పాఠశాలకు వెళ్లాడు. ఆరోజు పాఠశాలలో పరీక్ష ఉంది సాగర్ పరీక్ష బాగా రాయలేదు అని ఉపాధ్యాయుడు తనపై కోపగించుకున్నాడు .కానీ తను నిరాశ చెందలేదు. సాగర్ పాఠశాల నుండి బయటకు వస్తున్న సమయంలో తనతో పాటు తన మిత్రులు ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు. వాళ్ళు అలా వస్తుండగానే ఒక బస్సు వచ్చి కుక్కని తొక్కించి వెళ్ళిపోయింది .ఆ కుక్క ప్రాణాలతో ఉంది తన కాలు మాత్రం పూర్తిగా పోయింది. అది ఇకమీదట నడవలేదు ఇదంతా అందరూ చూస్తున్నారు కానీ దానికి ఒక్కరూ సహాయం చేయడం లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు సాగర్ దాన్ని చూశాడు తను దానికి సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు తను ఒక్కడే చేయలేను అని ఎవరైనా పెద్దవారు సహాయం చేస్తే బాగుంటుందని భావించి అందరిని పిలిచాడు ఎవరు రాలేదు తన ఉపాధ్యాయులను కూడా పిలిచాడు కానీ వాళ్ళు కూడా సహాయం చేయలేదు. సాగరకి చాలా బాధ కలిగింది ఆ కుక్క నడిరోడ్డులో కదల లేక ఎంతో బాధగా అరుస్తుంది ,కన్నీళ్లు పెట్టుకుంటుంది .సాగర్ దానిని చూడలేక ఒంటరిగానే వెళ్దామని నిర్ణయించుకున్నాడు అప్పుడే తను సహాయం చేసిన ఆ జంతువు తన వెంట నిలుస్తాను అన్నట్టుగా వచ్చింది. తర్వాత అక్కడ ఉన్న చిన్న పిల్లలు వెళ్లారు. సాగర్, ఆ జంతువు, పిల్లలు కలిసి ఆ కుక్కకి సహాయం చేసి దానివాళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు .అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ తల దించుకున్నారు ఆ కుక్క తర్వాత నుంచి నడవలేదు ఆ పిల్లలందరూ కలిసి దానికి ప్రతి రోజు ఆహారం పెడుతూ జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు. చదువు అంటే పుస్తకాలలో ఉండేది చదవడం కాదు .చదువు అంటే విలువలు ,విజ్ఞానం, నైపుణ్యం ,బాధ్యత, మానవత్వం, మార్పును నేర్పించేది. చదువు నేర్పించే వాళ్లే మానవత్వాన్ని మర్చిపోతే రేపటి తరం ఎలా విలువలతో వికసిస్తుంది ?మానవత్వం అనేది ప్రతి మనిషి యొక్క సహజ గుణం దానిని చదువు వికసింప చేయాలి కానీ విడిచి పెట్టేలా కాదు. సహాయం చేయాలి అనే గుణం మనకు లేనప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత పెద్ద వాళ్ళమైన ఏం ఉపయోగం వాళ్ళ వయసు చిన్నది కానీ వాళ్ళ మనసు, వాళ్ళ గుణం ,వాళ్ళ మానవత్వం మాత్రం చాలా గొప్పవి. ఇక్కడ ఒక ప్రాణికి సహాయం చేయడానికి మంచి చెడు తెలియని పిల్లలు వచ్చారు .ఒక పూట ఆకలి తీర్చారు అనే కృతజ్ఞతతో ఒక జంతువు వచ్చింది కానీ మంచి చెడు బాగా తెలుసు మంచి విజ్ఞానం ఉంది కానీ సహాయం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. "మనిషి ఎప్పుడు మానవత్వాన్ని కాపాడాలి. బాధ్యతలు భుజాల పైన మోయడానికి కూడా సిద్ధంగా ఉండాలి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి". "సహాయం అనేది వయసుకు విజ్ఞానానికి సంబంధించింది కాదు మంచి మనసుకు సంబంధించింది ".

మరిన్ని కథలు

Guudivada
గుడివాడ
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్