కదిలే రాయి నీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు తాతయ్య నాకు(కిట్టు).తాతయ్య మరి ఇవన్నీ జరిగితే ఇంకేదుకు భౌతికశాస్త్రం.బాబు మానవులు అన్ని తెలుసు అనుకుంటారు కానీ మనం నేర్చుకునే కొద్ది జీవిత పాఠాలు ఉన్నాయి కానీ భౌతికశాస్త్రం స్థల-కాలాల ద్వారా దాని కదలికలను, ప్రవర్తనను, సంబంధిత శక్తి, బలాలను అధ్యయనం చేసే ప్రకృతి శాస్త్రం.సరే....కిట్టు వెళ్ళి మీ అమ్మమ్మతో నీళ్ళు తీసుకొని రావా.తాతయ్య మరి జీవిత కాలంలో మనం నేర్చుకున్న పాఠాలు తెలియని వాళ్ళకు తెలియజేయచ్చ చేయచ్చు బాబు. ఇంతకి నీ వయస్సు ఎంత కిట్టు.10ఏళ్ళు తాత.అవునా శభాష్ బాబు,చక్కగా చదువుకో అని వాళ్ళ తాత ఆశీర్వదించాడు కిట్టుని. ఆ తరువాత కిట్టు వాళ్ళ స్నేహితులు ఇంటి ఆవరణములో అడుకుంటుంటారు.ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ దోమలను ఎలాగైనా నశించేటట్టు చేయాలి అలాగే ఉంటే డెంగ్యూ,మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి అని స్నేహితులు చెప్పాడు.సాయంత్రం కాగానే వేపకను కాల్చి పొగను ఇంటి ఆవరణంలో పెడదాము అని కిట్టు(కిషోర్) వాళ్ళ స్నేహితులకు వివరించాడు.కాకపోతే కొన్ని నినాదాలతో గ్రామాల్లో "పరిసరాల పరిమళం" పేరుతో వివరించాలి అని మొదలుపెట్టారు. నీరును వృధా చేయకండి మన అయుషును పెంచుకోండి అని నినాదాలతో హోరెత్తించారు.వేపకును వాడండి దోమలను తరిమేయండి కాకపోతే వేపకును పూజించడం మరిచిపోకండి.కిట్టు,స్నేహితులు చేసిన పరిసరాల పరిమళం కార్యక్రమం విజయవంతం కావడంతో చిన్న వయస్సులోనే ఇంతటి ధైర్యంగా పయనన్ని మందుకు కొనసాగించావు అని పలువురు ప్రశంసించారు.కిట్టు వాళ్ళ అమ్మమ్మ,తాతయ్య సంతోషిస్తూ జీవనాన్ని కొనసాగించారు.