సుందరామిడి పల్లె - సి.లక్ష్మి కుమారి

Sundaramidi palle

అనగనగా సుందరామిడి పల్లె అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఎక్కువగా చెట్లు ఉండేవి .చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఊరు పచ్చగా చాలా సుందరంగా కనిపించేది. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరిలో పక్షులు కూడా చాలా ఉండేవి చాలా పక్షులు చెట్ల పైన గూడు కట్టుకుని ఆ ఊరిలోనే ఉండేవి ఆ ఊరిలో వాళ్లు ఉదయాన్నే చెట్లు ఇచ్చె చల్లని గాలితో పక్షుల కిలకిల రావాలతో నిద్రలేచేవారు పొద్దున్నే స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ,పక్షులు చేసే వింపైన శబ్దం వినడంతోనే వారికి రోజు ప్రారంభమయ్యేది. అలా ప్రశాంతంగా వాటి శబ్దం వినడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకొవడం వల్ల వాళ్ళు ఎక్కువగా శాంతంగా ఉండేవారు ఎంత పని చేసినా కష్టం లేదు అన్నట్టుగా అనిపించేది.

ప్రకృతి, పక్షులు ఇచ్చే ఆనందం వల్ల వాళ్లకు ఎంత పని చేసినా ఏ కష్టం కలిగేది కాదు .ఏ కష్టమైనా ఇష్టంగా ముగించేవారు అంతేకాకుండా పక్షులు ఎక్కువగా ఉండటం వల్ల పంటకు పట్టిన పురుగులను పక్షులు తినేసేవి. అవి ఆ ఊరి వాళ్లకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. ఆ ఊరి వాళ్ళు వాటికి రోజు తినడానికి గింజలు పెట్టేవారు అందువల్ల అవి పంట ధాన్యాన్ని ఏమీ చేయవు .అలా అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు.

కొన్ని సంవత్సరాల తర్వాత మనుషులు చేసిన కొన్ని తప్పుల వల్ల చాలా పక్షులు ఆ ఊరిలోనే చనిపోయాయి. తర్వాత ఆ ఊరిలో ఒకటి రెండు పక్షులు మాత్రమే ఉండేవి .ప్రకృతి పరిస్థితి కూడా అంతే ఆ ఊరిలో చెట్లు అన్ని చనిపోయాయి ఎక్కడో ఐదు ఆరు చెట్లు మాత్రమే ఉన్నాయి .ఆ ఊరి వాళ్ళు నిద్ర లేవగానే చల్లగాలి తగలడం లేదు, పక్షుల శబ్దం లేదు .పక్షుల కిలకిల రావాలతో నిద్రలేచేవారు గడియారం శబ్దంతో నిద్రలేస్తున్నారు . చెట్ల గాలిని స్వచ్ఛంగా పిలుచుకునేవారు విద్యుత్ తో నడిచే పరికరాన్ని వాడుతున్నారు. ఎంతో సుందరంగా ఊరి పేరుకు తగ్గట్టుగా ఉన్న ఊరు కాస్త సుందరం అనేది ఊరు పేరుకు మాత్రమే సొంతమైంది . అలా చాలా సంవత్సరాల తర్వాత ఒక పిల్లాడు వాళ్ళ నాన్నను నాన్న పక్షులు అంటే ఎలా ఉంటాయని అడిగాడు వాళ్ళ నాన్న చాలా ఆలోచించి వాళ్ళ నాన్నని అడిగాడు. వాళ్ళ నాన్న పక్షులు ఈ ఊర్లో చాలా ఉండేవంట మానాన్న చెప్పాడు నేనెప్పుడో నా చిన్నతనంలో ఒక పక్షిని చూశాను అన్నాడు.

రాను రాను మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఎదుటివారి జీవితాలను బలివ్వడానికి కూడా వెనుకాడడం లేదు పక్షులు మనల్ని ఏం చేశాయని వాటిని మన అవసరాలు ఈ లోకం నుంచి దూరం చేస్తున్నాయి. పక్షులు మనల్ని నాకు నీ ఆస్తిని ఇవ్వు అని ఏమీ అడగలేదు కదా . అవి ఉన్నప్పుడు ఒక గొప్ప జాతీయ అయిన మనం వాటి ఆకలి తీర్చలేము వాటి ఆకలి తీర్చుకున్న ఏం పర్లేదు వాటికి ప్రమాదకరమైన వస్తువులను వాడి వాటి ప్రాణాలను తీయకండి.

ఒకప్పుడు ఆ ఊరు పక్షులకు మారుపేరు కానీ చివరకు పక్షి ఎలా ఉంటుందని ఎవరికీ తెలియనిదిగా మారింది. ఈ మార్పు మంచిదేనా? బిడ్డకు తెలియదు పక్షి ఎలా ఉంటుంది అని, తండ్రికి పేరు మాత్రమే తెలుసు. వాళ్ల తండ్రికి ఉండేది నేనొకటి రెండు సార్లు చూశాను అని తెలుసు. ఎలా ఇలాంటి పరిస్థితికి మారారు .వీళ్లే కాదు నిజమైన జీవితంలో రాబోయే తరాల పరిస్థితి కూడా ఇంతే.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ