వ్యాపారి తెలివి - ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల

Vyapari telivi

వ్యాపారి తెలివి . గుంటూరులో శివయ్య అనే వ్యక్తి టీ అంగడి నడుతూ ఉండేవాడు. ఊరిలో అందరు తమ టీఅంగడిలో ఐదురూపాయలకు ఒకటీ అమ్ముతూఉండగా, శివయ్య అంగడిలో మూడు రూపాయలకే రుచికరమైన టీ అమ్మేవాడు. సాటి టీ అంగడి వాళ్ళు వేయి టీలు అమ్మ గలిగితే, శివయ్య తన అంగడిలో రెండువేలకు పైగా టీలు అమ్మేవాడు. ఒకరోజు శివయ్య తమ్ముడు ఊరినుండి టీఅంగడి వద్దకు వచ్చి అంగడి లోని వ్యాపారాన్నిచూస్తూ "అన్నా! ఎదటి వారు టీ ఐదురూపాలకు అమ్ముతుంటే నువ్వు మూడు రూపాయలకే టీ అమ్ముతున్నావు, అంటే సాయంత్రానికి రెండు వేల టీలు అమ్మకం జరిగితే మనకు నాలుగువేలు నష్టం కదా " అడిగాడు. "తమ్ముడు వ్యాపారం చేయడానికి ధనమేకాదు, తెలివితేటలు కావాలి. ప్రతి వ్యాపారంలోనూ ,లాభ,నష్టాలు, కష్ట,సుఖాలు ఉంటాయి. మనం చేస్తున్న వ్యాపారం లోటుపాట్లు తెలుసుకుంటే చాలు. హయిగా వ్యాపారం చేయవచ్చు. నా వ్యాపారంలో లాభమే కాని, నష్టం ఉండదు. ఒకటీ మూడు రూపాయలకు ఇవ్వడం వలన దానిపై వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతుంది. కానీ అలా టీ తక్కువ ధరకు అమ్మటంవలన మనకు నష్టం రాదు, మన అంగడిలో టీ తక్కువధర కనుక ఎక్కువ జనం వస్తారు. అలా వచ్చిన వారు మన అంగడిలో అమ్మే బిస్కెట్ , మసలావడ, సమోసా, పకోడి, బజ్జి, బోండా తదితర తినుబండారాలను తిన్న తరువాతే టీతాగుతారు. ఈ తినుబండాలు ఎదటి అంగడి వాళ్ళవద్ద, నావద్ద ఒకేధర, చేపను పట్టడానికి గాలానికి ఎర వేసినట్టు, తినుబండారాలు అమ్ము కోవడానికి టీ వెల తగ్గించాను. టీ వెల నాదగ్గర తక్కువ కనుక జనం నావద్దకు వస్తారే కాని మరోకారణం లేదు . టీపైన లాభం పొందలేకపోయినా, తినుబండారలపై మంచి లాభం పొందుతున్నాను" అన్నాడు శివయ్య .

మరిన్ని కథలు

Parishkaram
పరిష్కారం
- తాత మోహనకృష్ణ
Apaatradanam
అపాత్రదానం
- Prabhavathi pusapati
Simhadri express
సింహాద్రి ఎక్స్ ప్రెస్
- అనంతపట్నాయకుని కిశోర్
Guudivada
గుడివాడ
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ