విధి వ్రాత - తాత మోహనకృష్ణ

Vidhi vraata


పెళ్ళి పద్ధతులు ఒక్కక్క చోట ఒకొక్క లాగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కథ కూడా అలాంటి చోటే జరిగింది.


"రాజ్యం! మన అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చిందే!.."
"అబ్బాయి ఎవరండీ...!"
"బాగా పేరున్న సంబంధం.."
"అయితే అమ్మాయిని చూసుకోడానికి రమ్మని కబురు పెట్టండి..."
"అయితే! వాళ్ళ ఆచారం ప్రకారం...అమ్మాయి, అబ్బాయి చూసుకోరంట పెళ్ళి అయ్యేవరకు...కాకపోతే మన పెద్దవాళ్ళము చూసి నచ్చితే... తాంబూలాలు మార్చుకోవచ్చు..ఏమంటావు చెప్పు రాజ్యం!"
"అలాగేనండి!....ఎవరి పద్ధతులు వారివి!...మనం గౌరవించాలి కాదండీ...మరి.."
"అయితే..కబురు పెడతాను....ఒక మంచి రోజున అమ్మాయిని చూసుకోడానికి రమ్మని... ..."
"అలాగేనండి!"

కొన్ని రోజులు తర్వాత ... టెలిగ్రామ్ వచ్చింది

"ఎక్కడ నుండి?"
"మగ పెళ్ళివారు...పెళ్లిచూపులకి ఎల్లుండి బండి కు వస్తారంట...అమ్మాయిని గొప్పగా అలంకరించుకోమని చెప్పు !"
"అమ్మయిదంతా...నా పోలికండి...నిద్ర లేచిన ముఖం లో కూడా అందంగా ఉంటుంది" అన్నది రాజ్యం
"అందుకే కదా!...నిన్ను కట్టబెట్టారు నాకు మా వాళ్ళు!"


మర్నాడు పెళ్ళిచూపులు జరుగుతున్నాయి...
"అమ్మాయి.. లక్షణంగా ఉంది బావగారు!"
"అయితే మంచి రోజు చూసి తాంబూలాలు తీసుకుందాం..బావగారు! పెళ్ళి మటుకు తిరుపతి కొండ పైనే చెయ్యాలి... అది మా ఆచారం...పెళ్ళి అయిపోగానే...అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకుని వెళ్తాము..."
"అలాగే బావగారు!..."

పెళ్ళి కొండ పై జరిగింది....పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ముఖాలు చూసుకోలేదు....ఇద్దరూ తమ జీవిత భాగస్వామి ఎలా ఉంటారో నని ఉహించుకుంటున్నారు...ట్రైన్ లో....

ట్రైన్ లో అందరూ...మగపెళ్ళివారి ఇంటికి వెళ్తున్నారు...పెళ్ళికూతురు తరపు వాళ్ళంతా ఒక భోగి...పెళ్ళి కొడుకు వారంతా...వేరే ముందు భోగి లో సర్దుకున్నారు. ట్రైన్...ఈలోపు వేగం అందుకుంది...రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. పట్టాల పై ఏదో గందరగోళం చేత, ట్రైన్ పట్టాలు తప్పి..పెద్ద ప్రమాదం జరిగింది. వంతెన కింద ఉన్న చెరువులో, కొన్ని భోగీలు పడిపోయాయి.

పెళ్ళివారు అంతా చెల్లాచెదురైపోయారు...ట్రైన్ లో వారు చాలా మంది మునిగిపోయి చనిపోయారు...గాయపడ్డ వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేసారు.
హాస్పిటల్ అంతా...ఆక్సిడెంట్ లో గాయపడిన వారితో నిండిపోయింది.

పెళ్ళికొడుకు రాము హాస్పిటల్ లో తన వారందరినీ... వెతుకుతున్నాడు...
"డాక్టర్ గారు! మా అమ్మ, నాన్న, శ్రీమతి జాడ తెలియట్లేదు డాక్టర్! "
"కంగారు పడకండి మిస్టర్! అలా వార్డ్ లో కెళ్ళి అంతా వెతకండి..."
"అంతా చూసాను డాక్టర్ ..కానీ ఎక్కడా లేరు"
"నా శ్రీమతి జాడ ఏమైనా తెలిసిందా డాక్టర్! "
"అక్కడ పెళ్ళికూతురు డ్రెస్ లో గాయపడి ఒక అమ్మాయి ఉన్నారు...అక్కడ చూడండి"
"అలాగే డాక్టర్!"
"రాము గారు! మీరు చాలా గాయపడ్డారు...ట్రీట్మెంట్ తీసుకోండి ఫస్ట్"
"నాకేమి పర్వాలేదు డాక్టర్"
"పెళ్ళికూతురు చిన్న గాయాలతో బయటపడింది ...ఊరుకోండి రాము...అన్నారు డాక్టర్"
"రెండు రోజుల్లో...మీ ఇద్దరూ ఇంటికి వెలోచ్చు.."

"ఇంటికొచ్చిన తరవాత...పెళ్ళికూతురు స్పృహ లోకి పూర్తిగా వచ్చింది...
"నేను ఎక్కడ ఉన్నాను?"
"మీరు మన ఇంట్లోనే ఉన్నారు..."
"మీరు ఎవరు?"
"నేను మీ భర్తను...కొండ పై మనకు పెళ్ళయింది..వస్తున్నప్పుడు ట్రైన్ ఆక్సిడెంట్ అయ్యింది...నిన్ను మాత్రమే నేను కనుక్కోగలిగాను..."
"మా అమ్మా నాన్న ఎక్కడ?"
"చాలా మంది గల్లంతయ్యారు...ఎవరైనా దొరికితే, కబురు చేస్తామని చెప్పారు"
"మీరు ..నా భర్తా? మా అమ్మ.. నాతో మా అయన ముఖము గుండ్రంగా ఉంటుందని చెప్పింది...మీ ముఖము కోలగా ఉంది...మీరు నా భర్త కాదు..అని గట్టిగా అరుస్తున్నాది"
"ఉండండి...డాక్టర్ ని పిలుస్తాను..."
డాక్టర్ ఇంటికి వచ్చారు...
"రండి డాక్టర్! మా ఆవిడ నేను తన భర్త కాదంటోంది.."
"మీ ఇద్దర్ని గుర్తుపట్టగల వారిని పిలవండి...తెలిసి పోతుంది"
"మా అమ్మ, నాన్న, అత్త, మావయ్య జాడ తెలియట్లేదు..."

"రైల్వే వాళ్ళు చాలా గాలిస్తున్నారు...ఎవరైనా కనిపిస్తే...మేము చెబుతాము...కొంచం ఓపిక పట్టండి"
"అలాగే డాక్టర్!"
అంతా గందరగోళం గా ఉండడంతో రాము కేమి తోచట్లేదు.. ఇలా ఉండగా...ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది...
"ఎవరో గాయాలతో వచ్చారు...వయసు సుమారు యాభై ఉంటాయి...మీరు వచ్చి ఒక సారి గుర్తుపట్టండి" చెప్పారు డాక్టర్
"అలాగే"
"రాము ఆసుపత్రి కి హడావిడిగా వెళ్లి...అక్కడ తనవారు ఎవరైనా ఉన్నారేమో నని వెతికాడు.."
"బాబు రాము! నన్ను గుర్తు పట్టవా?"
"నేను మీ మావయ్య ను..అమ్మాయి ఎక్కడ?"
"మీ అమ్మాయి నా ఇంట్లోనే ఉంది...నన్ను గుర్తుపట్టట్లేదు!"
"అత్తయ్య ఎక్కడ మావయ్య!"
"మీ అత్తయ్య.. జాడ ఇంకా తెలియలేదు బాబూ!..."
"పద నాయనా! అమ్మాయి దగ్గరకు తీసుకుని వెళ్ళు..."
రాము ఇంటికి... చేరుకున్నారు ఇద్దరూ...
"ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు బాబు.."
"అయ్యో! పొరపాటు జరిగిపోయిందే!"
"మన ట్రైన్ లో ఇంకో జంట కూడా ప్రయాణం చేస్తున్నారు...బహుసా అతని తాలుకా కాబోలు.."
"అడ్రస్ వెతుక్కుంటూ...మామ అల్లుడు వెళ్లారు...అనుకున్నట్టే...రాము భార్య ను ఎవరో గాయాలతో హాస్పిటల్ కు తీసుకొచ్చారు..."
"ఎలా ఉంది డాక్టర్ నా శ్రీమతి కి?"
"ఈవిడ మీ శ్రీమతి?" మరి ఇందాకల ఆవిడ?"
"ఆ అమ్మాయి కి నాకు ఎటువంటి సంబంధం లేదు... అమ్మాయి తాలుకా ఎవరైనా వస్తే...అప్పజెప్పండి.. మిగతా కథ తర్వాత చెబుతాను డాక్టర్ ..."
దేవుని చల్లని దయ వలన...రాము అమ్మ, నాన్న, అత్త, మావయ్య జాడ తెలిసింది...

అందరూ కోలుకున్నాక...ఇంటికి చేరుకున్నారు.
తన భార్య తో...రాము జీవితాంతం హ్యాపీ గా ఉన్నాడు..

****************

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు