సత్యం.. - రామ్ వారణాసి

Satyam

సత్యం మరియు అతని కుమారుడు నాని, గాృమానికి దూరంగా ఉన్న ఒక చిన్న ఇంట్లోనివసిస్తున్నారు. సత్యం సమీపంలోని కర్మాగారంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా అతనిసంపాదన కనీస అవసరాలకు కూడా సరిపోక ఇబ్బంది పడుతూంటాడు.

ఇటీవల సత్యం భార్య ఏదో తెలియని వ్యాధితో అనుకోకుండా మరణించింది. తల్లి లేనిలోటు నానీకి తెలియకుండా సత్యం నానిని చూసుకుంటూ వచ్చాడు.

నాని ఎప్పటినుండో ఒక కుక్కపిల్ల కావాలని మారాం పెడుతున్నా సత్యం తప్పించుకుంటూవచ్చాడు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు రెండు రోజుల్లో నాని పుట్టినరోజు వస్తోంది, ఎలాగైనా నానికోసం ఒక కుక్కపిల్లని తేవాలని నిర్ణయించుకున్నాడు సత్యం. అదీ రాబోయే రెండు రోజుల్లోనే! కిందా మీదా పడి తెలిసన వారి నుండి అప్పూ గటాృ చేసి మొత్తానికి ఓక బుజ్జి కుక్కపిల్లని తెచ్చి నానీ కి ఇచ్చాడు. ఇక నానీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి! అందమైన తెల్లటి జుట్టు గల కుక్కపిల్ల, ఎంత ముద్దు గా ఉందో! నాని ఆనందంతో మురిసిపోయాడు, నాన్నని గట్టిగా కౌగలించుకొని తన ఆనందాన్ని తెలియచేసాడు. సత్యం కొడుకుఆనందాన్ని చూసి చాలా సంతోషించాడు. తల్లి లేని పిల్లవానికి ఒక నేస్తాన్నిఇవ్వగలిగినందుకు ఎంతో గర్వ పడ్డాడు! నాని బుజ్జి కుక్కపిల్లకి "హీరో" అని పేరుపెట్టాడు తదుపరి సమయం నుండి హీరో అతని జీవితం అయ్యాడు. స్వతహాగ నానిచాలా చురుకైనవాడు, ఎప్పుడూ బడిలో అందరిలోకి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూరాముడు మంచి బాలుడు టైపుగా పేరు తెచ్చుకుంటున్నాడు.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, హీరో కూడా మంచి చెలాకీగాఆడుకుంటూ ఆరోగ్యంగానే ఎదుగుతున్నాడు. ఒక పక్క సత్యం శక్తకి మించి పనితో ఆర్థికఒత్తిడిని తట్టుకుంటూ తన కొడుకు సంతోషం కోసమూ ఇంకా హీరో చూపే నిష్పాక్షికమైనప్రేమ మరియు ఆప్యాయతను చూస్తూ ఏది ఏమైనా సరే అని అదనపు గంటలు పనిచేస్తూ ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు, కాని ఇది అతని వయస్సులో అతనికిబాగా వత్తిడి కలిగిస్తోంది. హీరోతో సంతోషకరమైన క్షణాలు మరియు అతని కుమారుడియొక్క ఆనందం సత్యాన్ని కష్టాన్ని మరిచేలా చేసాయి. నాని కూడా శ్రద్ధగా చదువుతూపాఠశాల లో అందరికంటే అగ్ర స్థాయి లో చదువు కొనసాగుస్తున్నాడు.

ఐతే అన్ని రోజులూ ఒక లా ఉండవుగా!ఊహించని విధంగా సత్యం మరియు అతనికుమారుడి ధుఃఖానికి కారకంగా హీరో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ప్రభుత్వఆసుపత్రిలో ఉన్న పశువైద్యుడు హీరో ని పరిశీలించి ఇక హీరో కి జీవితాంతం చికిత్సఅవసరం అని నిర్ధారించాడు. పైగా చికిత్స చాలా ఖరీదైనది అని చెప్పాడు. విషయం నిజంగా సత్యంపై భరించలేని భారాన్ని జోడించింది, అతన్ని ఒక నిస్సహాయపరిస్థితి లోకి నెట్టేసింది. ఊహించని అదనపు ఖర్చు అతన్ని కృంగ తీసేసింది. ఏమిచేయాలొ తోచని పరిస్థితి లో అతను ఇంట్లో వస్తువులను అమ్మడం ప్రారంభించాడు. విధంగా హీరో వైద్య ఖర్చులను చూసుకోవడానికి ప్రయత్నించాడు. నాని, తన తండ్రిపోరాటాన్ని చూసి, తన తండ్రికి మద్దతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు, అతను చదువు కు స్వస్థి చెప్పి ఉద్యోగం కోసం స్థానిక వ్యాపారవేత్త సుబ్బయ్యనుసంప్రదించాడు. నాని తెలివితేటలు మరియు నిజాయితీ తెలిసిన సుబ్బయ్య అతనికిఉద్యోగం ఇచ్చాడు.

నాని తన తండ్రికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. నాని చదువుమానేసినందుకు సత్యం చాలా ధుఃఖించాడు, ఐనప్పటికీ, హీరో కష్టాలను చూసి రాజీపడ్డాడు, నాని చూపిస్తున్న బాధ్యత మరియు అతనికి హీరోపై ఉన్న ప్రేమను చూచి చాలాగర్వంగానూ ఫీలయ్యాడు.

గ్రామాధిపతి రామబ్రహ్మం కు అసలు వాస్తవాలు తెలియవు కాని నాని చదువు మానైడం, ఉద్యోగం లో చేరడం వంటి విషయాలు మాత్రం ఊరి ప్రజల ద్వారా తెలుసుకున్నాడు. సత్యమే స్వార్థంతో నానిని చదువు మాన్పించి తన స్వంత ఆర్థిక కారణాల వల్ల ఉద్యోగంలోచేర్చడానికి ప్రోత్సహించాడని భావించాడు. ఒకరోజు రామబ్రహ్మం సత్యం ఇంటికి వచ్చి, అతను ఏమి తప్పు చేస్తున్నాడో మరియు తన కొడుకు చదువును నిలిపివేచి పనిచేయడానికి అనుమతించడం ద్వారా నాని కెరీర్‌ను ఎలా పాడు చేస్తున్నాడో చెప్పడంప్రారంభించాడు. సత్యం బాధతో అతని మాటలను పూర్తిగా విన్న తర్వాత అతనికి మొత్తంపరిస్థితిని వివరించాడు. సత్యం రామబ్రహ్మం తో ఇలా అన్నాడు: అయ్యా, విద్య అంతామానవులకు జ్ఞానం కలిగించి మరియు అటువంటి విద్య ద్వారా సరైన మార్గంలోనడిచేలా చెయ్యడానికె కదా?!. మనం కరుణగల మనిషిగా ఉండడం నేర్చుకుంటే తప్పమనం సాధించిన డిగ్రీల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా?! నా కొడుకులో నేనుజ్ఞానాన్ని మరియు కరుణను చూశాను, పైగా తోటి జీవుల సంరక్షణ కొరకు అతను ఇచ్చుప్రాముఖ్యతను చూసాను! తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి హృదయం కరిగిసహాయం చేయాలి అన్న తపన చూసాను. అవసరాన్ని అర్థం చేసుకున్నాడు, ఓక జీవిపడుతున్న భాధను చూడలేక దాన్ని రక్షించాలని నిర్ణయించు కున్నాడు. తను జీవితసారాంశాన్ని నేర్చుకున్నాడని నా గఠి నమ్మకం, అందుకే వాడు సరైన మార్గాన్నిఎంచుకున్నాడనే ఉద్దేశ్యంతో తను ఏమి చేయాలి అని అనుకున్నాడో దానికిఅనుమతించాను.

సత్యం చెప్పనది అంతా విన్న తరువాత మరియు ప్రేమ తప్ప మరొకటి తెలియని హీరోదుస్థితిని గమనించిన రామబ్రహ్మం తన తొందరపాటు ఆలోచనలకు లోలోనే సిగ్గుపడ్డాడు. ఎన్నో పై చదువులు చదివిన వారు కూడా కాపీనంతోను, స్వార్ధం చేతనో స్వంతతల్లిదండృలనూ, తోబుట్టువులను కూడా లెఖ చేయని మనుష్యులున్న లోకం లో, ఓకకుక్క పిల్ల కోసం తపిస్తున్న సత్యం ని, నాని ని చూసి అతని హృదయం చలించింది. ప్రతిజీవి లోను పరమాత్మను చూడగలిగే వారి సహృదయత్వానికి మనస్సు లోనే నమస్కరించుకున్నాడు. తాను కూడా వారికి సహాయ పడాలని నిర్ణయించు కున్నాడు. అతను సత్యంతోఇలా అన్నాడు; వినండి, మీ కొడుకు చాలా ఆదర్శవంతమైన వ్యక్తి, పైగా చాలా తెలివైనవాడు కూడా, మనిషికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలను పొంది ఉన్నాడు. కానీ, అలాంటి వ్యక్తి ఏదైనా రంగాలలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుని విద్యార్హతలనుపొందగలిగితే, అలాంటి వ్యక్తి మన సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు. అందువల్ల, హీరో చికిత్సకు నేను ఆర్థికంగా సహకరించబోతున్నాను మరియు నాని తనచదువును కొనసాగించాలి. సత్యం రామబ్రహ్మం యొక్క మంచి ఆలోచన దృష్టికిఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు, అతని ప్రతిపాదనకు అంగీకరించాడు, నానికి అదేవివరించాడు, నాని తిరిగి పాఠశాలలో చేరాడు. హీరో చికిత్స కూడా చక్కగా సాగుతోంది. చివరికి గ్రామం మొత్తం రామబ్రహ్మం ద్వారా విషయాలు తెలుసు కొని తాము కూడాసహకారం అందించడానికి ముందుకు వచ్చారు, కానీ వారందరూ సమిష్టిగా హీరో చికిత్సకోసం విరాళాలను ఖర్చు చేయడమే కాకుండా నాని విద్యకు కూడా చేయూత నివ్వడానికినిర్ణయించుకున్నారు. కొంత కాలానికి గ్రామస్తుల మద్దతుతో నాని తనకు ఇష్ట మైన పశువైద్యం చదివి గ్రామంలో పశువైద్యశాల ప్రారంభించాడు. తన నిరాడంబరమైన జీవనంకోసం అతి తక్కువ రుసుము వసూలు చేస్తూ అవసరమైన అన్ని జంతువులకు ఉచితసేవను అందించడం ప్రారంభించాడు.

ప్రతి జీవి లోను పరమాత్మ ఉన్నాడు, అన్ని జీవులను ప్రేమించడం ద్వారా పరమాత్మనుకూడా సేవించ గలరు

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు