థ్రెట్ - బొబ్బు హేమావతి

Threat

ఫోన్... రింగింగ్.... ఆమె భయపడుతూ అటు చూసింది... అతనేనేమో... ఏమి చెయ్యాలి... వెంటనే ఆమెలో ఏదో భయం ప్రవేశించింది.
గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
అటు గడియారం వైపు చూసింది.
తలుపులు వేసేసి ఉన్నానా లేదా గడి వేసి ఉందా అనుకుని తలుపులు లాగి చూసింది. తలుపులు వేసే ఉన్నాయి.
మళ్ళీ మళ్ళీ కిటికీలో నుండి బయటకు చూసింది. టీవీ వాల్యూం పెంచింది.
కానీ ఆమెలో భయం తగ్గలేదు.
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా భయపడాలి అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది.
జల జల రాలుతున్న కన్నీటి వర్షాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ఆమె.
వారం క్రితం అతని దగ్గర నుండి ఫోన్ కాల్.... తీయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు అని తీసింది.
తియ్యగానే ..ఆమె హలో అనగానే... అతను నిన్ను కలవాలి.... ఆ మాట వినగానే ఆమె... ఎందుకు అన్నది.
"ఊరికే... ఒకసారి మాట్లాడాలి" .... అతని మాట విని... ఆమె చూద్దాం అన్నది.
అతను కాసేపు ఊరుకుని... ఆమె దగ్గర నుండి ఏ జవాబు రాక పోయేసరికి... ఫోన్ పెట్టేసాడు.
కానీ ఆమె లో అతని ఆలోచనలే... కలుస్తాడా? అది ఎలా? అతనే కదా తనను వద్దు అనుకున్నది?
ఇప్పుడు కూడా .... నేను నిన్ను డంప్ చెయ్యలేదు అని నాకు చూపాలి అనా ?
లేక ప్రపంచానికి మేము ఇంకా కలిసి ఉన్నాము అని చూపాలి అనా ?
వెంటే నడుస్తూ...నేను నీ వెంటే అని తాను చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు... నువ్వు చిన్న పిల్లవి... అని తనను పక్కకు తోసినప్పుడు... లేని ప్రేమ... ఇన్ని ఏళ్ల తరువాత... ఎలా ఉంటుంది.
ఆమె లో భయం మొదలు అయ్యింది.
ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు ఆమెకు.
భయాన్ని జయించాలి అంటే ఆ భయానికి ఎదురు పోవాలి అని ఆమె అప్పట్లో అతన్ని వెంట నడిస్తే అతను "నువ్వు వెళ్ళు ఇక" అని ఆమెను పక్కకు తోసేసాడు.
ఆమె ఒంటరి అయిపోయింది.
ఇప్పుడు ఆ భయం తో ఆమె ఆ ఊరిలో ఉండలేక పోయింది. అతనికి కనపడకుండా పోవాలి అని ఊరు వదిలి వేసింది.
ఎక్కడికి పోయినా వదలని ఆలోచనలు... ఇంకా ఏమైనా చేసి ఉండాలా? ఆమె లో ప్రశ్నలే అన్ని.
అతనిని ఆమె ప్రేమించింది. కానీ అతను ఆమెను ఆట బొమ్మను చేసుకున్నాడు.
అతనికి పెళ్లి అని తెలిసి అతనిని నేరుగా అడిగింది.
"నీకు పెళ్లి అంటనే".... అని అడగగానే అతను అవును అని ఒప్పుకున్నాడు.
ఏదైనా నేరుగా మాట్లాడితే ఎటువంటి పొరపొచ్చాలు ఉండవని ఆమె అతనిని "పెళ్లి చేసుకోవాలా" అని అడగగానే "అవును చేసుకోవాలి" అని చెప్పాడు.
కానీ లేని పెళ్లిని ఉన్నట్లు... చెప్పగానే ఆకాశవాణి చూసి ఊరుకుంటుందా... దానిని నిజం చేసింది.
ఆమె ని ఎక్కడ పెళ్లి చేసుకోవాలి అని భయం అతని లో ...ఎందుకు.. . ఆమె అతనిని ఎప్పుడైనా వదిలేస్తుంది... అని భయం.
ఇద్దరినీ ఒకరికి ఒకరు కాకుండా చేసింది.
అతనే కోరుకుని పెళ్లి చేసుకుని... ఆమెను వేదనకు గురి చేసి... ఆమె అతనిని వదిలి ఉండలేక... బతకాలో చావాలో తెలియక వేదనతో ....
స్థిరమైన మనసుతో... అతనికి స్వేచ్ఛ ఇవ్వడానికి ఆమె పెళ్లి చేసుకుంటే... పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటూ వేధింపులు.
ఇక ఈ వేధింపుల కు స్టాప్ పెట్టాలి అని ఆమె నిర్ణయించుకుని.... ప్రేమ కంటే స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇచ్చింది.
డా.బి. హేమావతి

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు