జమీందారు గారి తోట బంగళా-1 - ఎం వి రమణారావ్

Jameendarugari tota banglaw.1

ఎవరో గేటు తట్టిన శబ్దమయింది. నౌకరు వచ్చి పీప్ హోల్ లోంచి చూశాడు.
‘ఎవరు బాబూ నువ్వు?’
‘నేను విక్రమ్ నండి’
‘లోపలికి వస్తావా?’
‘అవునండీ’
‘ఇలా రామ్మా•
నౌకరు అతన్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు.
•ఏ జ్యూస్ తాగుతావు అబ్బాయీ’
‘ఆరెంజ్ జ్యూస్’
వెంటనే ధగ ధగ లాడుతున్న పెద్ద గాజు గ్లాసులో చల్లని ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు.
‘తీసుకో బాబూ’
విక్రమ్ తల ఊపి ఆ డ్రింకు తాగుతూ దాని రుచిని ఎంజాయ్ చేయసాగాడు.
అదొక పెద్ద తోట. జమీందారుగారి బంగళాని ఆనుకొని అవ్ని ప్రక్కలా విస్తరించి ఉంది. అందులో అన్ని రకాల ఫల పుష్ప వృక్షాలూ, పూలమొక్కలూ కనువిందు చేస్తున్నాయి. రకరకాల పక్షుల కూతలతో తోటంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

ఇంతలో జుమీందారు గారు విచ్చేశారు. తెల్లగా మంచి వర్చస్సు గల ముఖం. నుదుట బొట్టు. సింపుల్ గా తెల్ల బట్టలు. వేసుకున్నారు. ధగ ధగ లాడుతున్న బంగారు రంగు జరీ అంచు కండువా ఆయన కుడి భుజం మీద నుండి అతని ఆకర్షణ మరింత పెంచుతోంది. తల మీద జనీందార్ల తలపాగా అందంగా ఆకర్షణీయంగా మెరుస్తోంది. జమీందార్లు సాధారణంగా వేసుకునే ఆభరణాలేవీ ఆయన ధరించలేదు.

ఆయన్ని చూడగానే దిగ్భ్రమ చెందిన విక్రమ్ సంభ్రమాశ్చర్యాలతో వెంటనే లేచి నిలబడిపోయి నమస్కరించాడు.
‘ కూర్చో, బాబూ.. మా ఇల్లు నచ్చిందా?
‘చాలా వచ్చిందండీ..ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది.’
‘ఉండిపోవచ్చు గాని మీ అమ్మా, నాన్నా బెంగ పెట్టుకుంటారుగా’
‘అవునండీ’
‘అబ్బాయీ….. ఒక్క ప్రశ్న అడుగుతాను…చెప్తావా’
‘అడగండి తాతగారూ’
‘బాబూ..ఇంతవరకూ ఎవరూ మా బంగళా గేటు వైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేదు కదా! మరి నువ్వు మా గేటు తట్టావే?’
‘నా పేరు విక్రమ్ అండీ’
జమీందారుగారు చాలాసేపు నవ్వుతూ ఉండిపోయారు. .
‘మరి నాకు స్కూలు టైము అవుతోందండీ. రేపు వస్తానండీ.’
‘నీ మిత్రులని కూడా తీసుకు వస్తావా’
‘అలాగే తాతగారూ’
జమీందారు గారు నౌకర్ని పిలిచి అతని చేతిలో రెండు జామ పళ్లు పెట్టించారు.
ఆ మర్నాడు అతని మిత్రులు పది మందితో తిరిగి వచ్చాడు. స్వాగత సత్కారాలు అయ్యాక పిల్లలు తోటలో ఆడుకుంటామని జమీందారు గారిని అడిగారు.
‘ఆడుకోండి.కాని పెద్దగా అరుపులు, కేకలు వద్దు. చెట్లమీద రాళ్లు వేయకండి. మనకి తగిలినట్టే వాటికీ దెబ్బ తగులుతుంది కదా.’
‘అవును తాతగారూ’
‘ఎండగా ఉంటే లోపల, చల్లబడితే బయట ఆడుకోండి. మీరు ఆడుకోవడానికి ఏవైనా కొనాలంటే చెప్పండి. వంట మనిషి శేషమ్మని అడిగి మీకు ఏం కావాలన్నా చేయించుకోండి. ఏవైనా పళ్లు కావాలంటే నౌకర్లను అడగండి. మీరు కోయవద్దు. ఈ తోటా, బంగళా అంతా మీదే అనుకోండి’ అన్నారు.
‘అలాగే,తాతగారూ’ అన్నారు పిల్లలంతా. సాయంత్రం వరకు తోట వారి ఆటపాటలతో, పక్షుల కిలకిలారావాలతో మారు మ్రోగిపోయింది. ఆ రోజుకి అలసిపోయి తమకిచ్చిన పళ్లు తీసుకుని ఆనందంగా తిరుగు ముఖం పట్టారు.

ఒకనాడు స్కూలు గ్రౌండులో పిల్లలందరూ ఆడుకుంటూండగా సాహసకార్యాల గురించి ప్రస్తావన వచ్చింది. విక్రమ్ ముందుకొచ్చాడు.రాత్రి ఒంటిగంటకు స్మశానం మధ్యలోని చింతచెట్టుకి మేకు కొట్టి రావాలి. ధైర్యంగా అక్కడికి వెళ్తున్న విక్రమ్ ని గుడ్లగూబల అరుపులూ, కీచురాళ్ల భయానక శబ్దాలూ, సగం కాలిన శవాల హడావిడీ ఏమీ చేయలేకపోయాయి. అతను తిన్నగా చింతచెట్టు వద్దకు వెళ్లి మేకు కొట్టి వెనుదిరిగాడు. కాని అతన్ని ఎవరో వెనక్కి లాగినట్లయింది. అతనికి ఒళ్లు జలదరించినా ఒకసారి వెనుదిరిగి చూశాడు. చూస్తే తన షర్టుకి తానే మేకు కొట్టేసుకున్నాడు. నవ్వుకుంటూ వెంటనే తన షర్టు వదిలించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.అతని సాహసం పిల్లల్లో వ్యాపించింది. గుప్తచరుల ద్వారా జమీందారు గారిని చేరింది. ఆయన విక్రమ్ ని పిలిచి అలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. ‘రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. నీకేమైనా జరిగితే మీ అమ్మా నాన్నా ఎంత బాధ పడతారో ఊహించావా? అలా చేయబోయి ఎంతమంది ప్రాణాలు విడిచారో తెలుసా? ధైర్యం ఉంది కదా అని మిడిసి పడకు. నీ చదువే నీకు ముఖ్యం’ అని హితవు చెప్పారు.
‘ అలాగే తాత గారూ’ అని చిన్నబోయిన ముఖం తో వెనుదిరిగాడు.

క్రమ క్రమంగా జమీందారు గారి ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఒకరోజు జమీందారు గారు బయట ఒక శిథిలమైన రామాలయాన్ని చూసి చాలా బాధ పడ్డారు. దాని అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించి వేదం తెలిసిన పూజారిని నియమించి అతనికి జీత భత్యాలనేర్పరిచి నివాస సౌకర్యము కల్పించమని ఆజ్ఞాపించారు.

@ ఇంకా ఉంది @

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు