జమీందారు గారి తోట బంగళా - ఎం వి రమణారావ్

Jameendarugari tota banglaw.2

@@@@@@@

జమీందారు గారి రెండు టీములూ రోజూ బంగళాలో కలిసి చర్చించుకుని నిధుల సమస్య రాకుండా జాగ్రత్త పడేవారు.బంగళా లోని గదుల్లో రోజూ మన సంప్రదాయ నృత్యాలూ, గాత్ర సంగీతాలూ కాక అన్ని రకాల వాద్య పరికరాలూ తెప్పించడానికి ఏర్పాట్లు జరిగాయి. కరాటే, కుంగ్ ఫూ, ఇతర కోర్సుల ప్రారంభం వైభవంగా జరిగింది. అంతే కాక పేద విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుక పడుతున్నారో వారికి లెక్చరర్లను అపాయింట్ చేసి వారికి కొన్ని రూములను కేటాయించారు. ఖర్చులు పెరుగుతున్నా జమీందారు గారు వెనుకడుగు వేయడం లేదు.

పెద్దల టీము రోజూ తోటలో కుర్చీల్లో కూర్చుని అన్ని పేపర్లూ చదివేవారు. అందులో ఏదైనా కొత్త ప్రాజెక్టు తమ ప్రాంతానికి హానికరం అని భావిస్తే జమీందారుగారి దృష్టికి తీసుకొచ్చేవారు.వెంటనే ఆయన పై అధికారులతో మాట్లాడి ఆ ప్రాజెక్టు ఆపు చేసేవారు.

ఇదిలా ఉండగా రాజస్థాన్ కు చెందిన భయంకర దోపిడీ దొంగల ముఠా నాలుగు రోజులు రెక్కీ తర్వాత అకస్మాత్తుగా బంగళాపై ఒక రాత్రి దాడి చేసింది. వారికి తెలియనిదల్లా జమీందారు గారి కుటుంబ సభ్యులకు Z+ భద్రత ఎప్పుడూ ఉంటుందని. దాంతో వాళ్లు గట్టిగా ఎదురు దెబ్బలు తిని చావు తప్పి కన్ను లొట్టబోయి వరుసగా జైలుకి నడిచారు.

ఒకనాడు జమీందారు గారు అందరినీ హాలులోకి పిలిచి ఎందుకో తనకు రోజూ విచారం పెరిగిపోతోందనీ, కారణం ఎవరైనా చెప్పగలరా అన్నారు. ఎవరూ మాట్లాడలేదు గాని విక్రమ్ ముందుకొచ్చాడు. నువ్వు చెప్పలేవు బాబూ అన్నారు. నేను చెప్పగలను తాతగారూ. మీ మొదటి సమస్య దాయాదులతో కోర్టు సమస్యలు. రెండవది మీ అబ్బాయి జమీ వ్యవహారాలు పట్టించుకోకపోవడం. మూడవది మీ జమీ వ్యవహారాలు చూస్తున్న కేర్ టేకర్ నమ్మకస్తుడు కాకపోవడం వల్ల మీ నిధులు పక్కదారి పట్టడం. నాలుగవది మీ ఆరోగ్య సమస్యలురోజు రోజుకీ పెరిగి ఆందోళన కలిగించడం అన్నాడు.
శభాష్ అంటూ చప్పట్లు కొట్టారు జమీందారు గారు.
మీ సమస్యలన్నీ వారం రోజుల్లో పోయేలా రెండు టీములూ ఎప్పటినించో కృషి చేస్తున్నాయి తాతగారూ అన్నాడు విక్రమ్.
అలాగే లీగల్ నిపుణులు మీ దాయాదులను తరిమి కొట్టారు. జమీందారు గారి ఎస్టేటు కేర్ టేకర్ ను మార్చివేశారు. జమీందారు గారికి మంచి డాక్టరు చేత పరీక్షలు చేయించి మందులు మార్చారు. ప్రతీ వారం డాక్టరుగారు వచ్చి పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇక వారి అబ్బాయిని జమీందారుగా పట్టాభిషేకం చేసే ఉద్దేశ్యం జమీందారు గారికి తెలియజేశారు. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. రంగ రంగ వైభవంగా యువ జమీందారుకు పట్టాభిషేక మహోత్సవం జరిగింది. గవర్నమెంట్ తరఫున గూడా ఆ ఫంక్షనుకు కొందరు హాజరయ్యారు. ఆయనకి వేదమంత్రాలతో జమీందారీ తలపాగా తొడిగి ఆభరణాలన్నీ అలంకరించారు. కొత్త జమీందారుగారు చాలా సంతోషించి జమీ వ్యవహారాలన్నీ శ్రద్ధగా చూసుకోసాగాడు.అతనికి వివాహం చేయడానికి తగిన ఏర్పాట్లు ప్రాంభమయ్యాయి. మరో జమీకి చెందిన జగదంబిక అనే అమ్మాయితో వివాహం కుదిరింది. పెళ్లి వైభవంగా జరిగిపోయింది. గవర్నమెంటు నుండి ఇద్దరికీ వివాహం జరిగినట్లుగా అధికారిక రికార్డులో నమోదయింది. ఇద్దరూ హనీమూన్ కోసం డెహ్రాడూన్ వెళ్లి వచ్చారు.ఆ తర్వాత తమ తోటలోను పొలాల్లోను విహరించి సమయం గడపసాగారు. ఒక సంవత్సరం లోగా వారికి అందమైన ఆడపిల్ల జన్మించింది.ఆ సందర్భంగా జమీలో వేడుకలు వారం రోజులు జరిగాయి. పాపకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. ఆమె ఎప్పుడూ తాతగారి చుట్టూ తిరుగుతూ అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉండేది.

ఒకరోజు తెల్లవారినా పెద్ద జమీందారుగారుఎంత లేపినా లేవలేదు. వెంటనే విక్రమ్ డాక్టరు గారిని పిలిపించాడు. డాక్టరు వచ్చి చూసి ఏదో విష జ్వరం రాబోతోంది. మీరందరూ ఆయనను రాత్రీ పగలూ జాగ్రత్తగా చూసుకోండి. నేను రోజూ వచ్చి మందులు ఇస్తాను. వారం రోజుల్లో తగ్గిపోతుంది అని వెళ్లారు.అలాగే వారం రోజుల్లో ఆయన తిరిగి ఆరోగ్యవంతులయ్యారు.
టీములు నిశ్చయం తీసుకుని
తోట ప్రవేశద్వారం దగ్గర మార్బుల్ స్టోన్ మీద ఇలా రాయించారు.
————————
జమీందారు గారి తోట బంగళా
——————
అందరికీ సుస్వాగతం
——————
దానినొక అందమైన ఇల్యూమినేటెట్ బాక్సులో బిగించి రెండు ప్రక్కలా LED లైట్లు ఉంచారు.

ఇదిలా ఉండగా రెండు టీములూ కొన్ని అన్యాయాల్ని పెద్ద జమీందారు గారి దృష్టికి తీసుకెఒళ్లారు. అట్టడుగు వర్గాలకు కొంచెం పైబడిన వారికి గులాబీ రేషన్ కార్డు మీద పెన్షన్ గాని సరుకులు గాని ఏమీ ఇవ్వడం లేదు. వారికి గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ కేవలం ₹3:75 మాత్రమే ఇస్తున్నారు.కిడ్నీ వ్యాధి బాధితులను హాస్పిటల్ లో పట్టించుకోవడం లేదు. వారికి ఇవ్వవలసిన పది వేలు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కి సెంటర్ ఇస్తామన్న 5 లక్షల కార్డు వారికేమీ ఇవ్వడం లేదు. రిటైరయిన సీనియర్లకు పెంచవలసిన పెన్షన్ ఎన్ని సంవత్సరాలైనా ఏదో సాకు చెప్పి పెంచడం లేదు. తమ యువకులు పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేక తిరుగుతున్నారని తెలియజేశారు.
ఇవన్నీ విని పెద్ద జమీందారుగాను చాలా బాధ పడి తమకు కోలనీలోని అంటువంటి వారి వివరాలు ఇస్తే కావలసినవారికి అన్నీ తానే ఇస్తానని నిశ్చయిస్తున్నానని తెలియజేశారు. తమ నిరుద్యోగులకు రికమెండ్ చేసి తగిన ఉద్యోగాలు వేయిస్తానన్నారు.
తమ దృష్టిలో కేవలం ఉన్నవారు లేనివారు అనేది మాత్రమే ప్రామాణికమని తెలియజేశారు. ఈ అన్యాయాలన్నీ సెంటర్ దృష్టికీ, స్టేట్ దృష్టికీ తీసుకెళ్లి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అందుకు రెండు టీముల వారూ ఎంతో సంతోషించారు.

ఒకరోజు దూర ప్రాంతపు జమీందారు ఒకరు అక్కడికి వచ్చారు. చాలా ఆవేశంగా ఉన్నారు. పెద్ద జమీందారు గారితో మాట్లాడాలి అన్నారు. ముందు మా ఆతిథ్యం స్వీకరించమని టీములు అతన్ని కూర్చోబెట్టాయి. పెద్ద జమీందారుగారు వచ్చారు.ఆయనకు ఆరోగ్యం బాగులేదనీ, నెమ్మదిగా మాట్లాడమనీ టీములు హెచ్చరించాయి.
‘ మీరు సంఘ సంస్కర్త అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించాడు ఆగంతకుడు.
‘కాదు. సంఘ సంస్కర్త అయితే ఒకరి దగ్గర తీసుకుని మరొకరికి ఇస్తారు. నేను నా ఆస్తులు పేదవారికి ఇచ్చుకుంటున్నాను.’
‘మీరు శాంతి దూతా?’
‘కాదు. నా సామాన్య ప్రజలను చూసుకుంటున్న ఓ సామాన్యుడిని.’
‘దీనివల్ల మీరేం లాభం? మీ ఆస్తి అంతా కరిగిపోతుంది.’
‘ లేదు. మీరు పొరబడ్డారు. వీరంతా నాకు ఎంతో సహాయపడుతున్నారు. వారివల్ల నా ఆదాయం పెరుగుతోంది.’
‘అయితే ఇదంతా మానరా? మీవల్ల మా విలువ పోయింది. అందరూ మీ పేరు తలుస్తున్నారు. మమ్మల్ని లెక్క చేయడం లేదు.’
ఈ స్టేజిలో టీములు పెద్ద జమీందారుగారిని లోపలికి పంపేశాయి.
‘ మానడం కుదరదు’
‘ మీ బంగళాలో ఇన్ కమ్ టాక్స్ రైడ్ జరిపిస్తా’
‘ఏమైనా చేసుకోండి. మాదగ్గరేమీ లేదు’
తర్వాత రైడ్ జరిగింది. వారికి ఏమీ దొరకలేదు. విలువైనవన్నీ క్రింద నేసమాళిగలో భద్రపరచబడి ఉన్నాయి. అందులోకి ఎలా ప్రవేశించాలో జమీందారుకు తప్ప మరెవరికీ తెలియదు.
‘మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి.’
‘అలాగే. మీరిక వెళ్లండి’
ఆ జమీందారు తోక ముడిచి కోపంగా వెనుదిరిగి తన అశ్వ వాహనంపై వెళ్లిపోయాడు.

కొన్ని రోజులకు పెద్ద జమీందారు గారి ఆరోగ్యం పాడయింది. వారికి 92 సంవత్సరాలు నిండుతున్నాయి. డాక్టరుగారు వచ్చి చూసినా కళ్లు తెరవడం లేదు. అందరూ ఆయన చుట్టూ చేరారు. ఆ రోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ప్రాణాలు విడిచారు.
ఆ ప్రదేశమంతా శోక సంద్రమైంది. పక్షులు కూడా కూయడం మానేశాయి. వార్త తెలియగానే ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చిచేరుకున్నారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం వారికి వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతమంతా ఏడుపులతో దద్దరిల్లింది.
ఆ తర్వాత చందనపు చెక్కలతో ఆయన అంత్యక్రియలు వేద మంత్రాలతో జరిగాయి. వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించబడింది. ప్రజలందరూ విచారంగా తిరుగుముఖం పట్టారు.

కొందరు మనుషులు ఎదురుగా ఉన్నా లేనట్లుగా అనిపిస్తుంది. మరికొందరు ఎదురుగా లేకపోయినా వారు మనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.దానికి కారణం వారు చేసిన పుణ్య కార్యాలు.

శ్రీ లక్ష్మి తాతగారి ఫొటోకి నమస్కరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది.
ఆమె వెనుక నిలబడిన జమీందారుగారూ భార్యా ఆమెను ఆశీర్వదిస్తూ పెద్ద జమీందారు గారికి నమస్కరిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.

@అయిపోయింది @

@@@@@
మనిషికి మనిషి అన్నం పెడితే ఒక్క కడుపు నిండుతుంది.అలా ఎన్ని కడుపులు నిండితే దేశం ముందుకు నడుస్తుంది!

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు