ఛాలెంజ్! - ఎం వి రమణారావ్

Challange

అవి నేను షిప్ యార్డు లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీ లో 1988 నుండి పార్ట్ టైం BE(Mech) చదువుతున్న రోజులు. మా క్లాసులో సూర్యమోహన్ ( పేరు మార్చబడినది) అనే మెరిట్ స్టూడెంట్ ఉండేవాడు.విపరీతమైన అహంకారి. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అందరికీ .పేర్లు పెడుతూండేవాడు. అందరిమీదా జోకులేస్తుండేవాడు.

రెండు సంవత్సరాలు అప్పటికే పూర్తయ్యాయి. ఆ రోజే మూడవ సంవత్సరం ప్రారంభం అయింది. అతని మిత్రుడొకడు వేణుమాధవ్ ( పేరు మార్చబడింది) అని ఉండేవాడు. గోల్డ్ మెడల్ నీదే సూర్యం అంటూ అతన్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాడు.. దాంతో అతనికి అతిశయం పెరిగిపోయింది. ఆ రోజు క్లాసులో ఆందరి ముందూ ఛాలెంజ్ చేశాడు- చేతనైతే మిగతా రెండు సంవత్సరాలూ నన్ను ఓడించమని….. అది విని నాకు చాలా బాధ అనిపించింది. అతనిని ఎలాగైనా ఓడించాలని నిశ్చయించుకున్నాను. పైకి ఏమీ అనలేదు. వాడికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. వాడు వంక నవ్వు నవ్వుతూ మీసాలు దువ్వుకువ్నాడు.

ఆ తర్వాత నాకు తెలియని ఉత్తేజంతో చదివేవాడిని. ఒక్కరోజు కూడా కాలేజి మానే వాడిని కాదు. అన్నిటికీ నోట్సులు రాసుకునే వాడిని. క్లాస్ పరీక్షల్లో ఫస్టు మార్కులొచ్చేవి. తర్వాత నేను వెనుదిరిగి చూసుకోలేదు. ఒకరకంగా ఈ పోటీ నా మంచికే వచ్చింది. మూడు నాలుగు సంవత్సరాల్లో నేనే ఫస్టు వచ్చాను. . అంతే కాదు. నాకు BEలో డిస్టింక్షన్ వచ్చింది. 72% దాటాయి మార్కులు. అలా మాలో ముగ్గురికి డిస్టింక్షన్లు వచ్చాయి. నేను, సూర్యమోహన్ & వర్మ. మాలో సూర్యమోహన్ నాతో చిత్తుగా ఓడిపోయాడు. నీ గోల్డ్ మెడల్ సంత కెళ్లింది అ్నాడతని మిత్రుడు. సూర్యమోహన్ ముఖంలో కత్తి వాటుకి నెత్తుటి చుక్క లేనంతగా తెల్లబడిపోయింది.

జీవితంలో ఎవరైనా ఎదుటివారిని చులకనగా అంచనా వేయరాదు. ఇది చదివిన వారికి ఇదో గుణపాఠం కావాలి.

. ఫైనల్ ఇయర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పేపర్లో అనుకోకుండా ఒక ప్రాబ్లం ఇచ్చారు. . అసలే అది థియరీ పేపరు. మార్కులు రావు. నేను ముందుగా తయారయ్యే వచ్చాను కనుక లెక్మ గబ గబా చేసేస్తుంటే అందరూ నోళ్లు వెళ్లబెట్టుకు చూశారు. ఒక్కడికీ అది చేయడం రాదు.

కొంత సేపయ్యాక ఇక అందరూ మొదలెట్టారు ప్రాబ్లం, ప్రాబ్లం అంటూ అడగడం. డైరెక్టుగా నన్ను అడగడానికి నామోషీ. వాళ్ల బాధ పడలేక ఒకడికి చూపించాను. అంతే. మందు కొట్టినంత స్పీడుగా దాన్ని కాపీ కొట్టేశాడు. వాడి దగ్గర్నించి మిగతా అందరూ క్షణాల్లో కాపీలు కొట్టేశారు. ఎంతైనా అలవాటైన విద్య కదా..

అంతా బాగానే ఉంది గాని ఒక్కడూ బయటికి వచ్చాక కనీసం నా ముఖం కూడా చూడకుండా థాంక్స్ చెప్పకుండా బైకులమీద వెళ్లిపోయారు... వీళ్లకి ఒక సామెత చక్కగా సరిపోతుంది…’యేరు దాటేదాకా ఓడ మల్లన్న, యేరు దాటేక బోడి మల్లన్న.’… అదీ ఆ సామెత.
ఇకమీద ఎవ్వరికీ పరీక్షల్లో సాయం చేయగూడదని మనసులో గట్టిగా అనుకున్నాను. అది నాకు వీలవదు కూడాను. ఎందుకంటే పరీక్షలో నా రచన ఫ్లో ఆగిపోతుంది. ఎవ్వరేమనుకున్నా అదే నా పద్ధతి. కోరమండల్ లో పని చేసే ఒక నల్లటి నాయుడు ఏమీ చదవకుండా వచ్చి పరీక్ష హాల్లో జోరీగ లాగ నన్ను గొలికేసేవాడు. అతనికీ అదే జవాబిచ్చాను.

ఇలాంటి పొగరుబోతు మరొకరు నా ఆఫీస్ లో కొలీగ్ గా ఉండేవాడు. ఒకసారి ఎలక్ట్రికల్ ల్యాబ్ లో లెక్చరర్ ని చులకనగా మాట్లాడాడు. అంతే. ‘నువ్వు ఈ ల్యాబ్ లో టెస్టు నీ జీవితంలో ఎప్పటికి పాసవుతావో చూస్తా అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఇతను పట్టించుకోలేదు. కాని ఆయన వదల్లేదు. ల్యాబ్ లో ప్రతీ పరీక్షలోనూ ఫెయిల్ చేశాడు. ఆఖరికి ఆ స్టూడెంట్ BE (class) గానే మిగిలిపోయాడు.

అవతలివారి మనసులు గాయపరిచేవారికి చివరికి జరిగేది అదే మరి!
@@@@@@

మరిన్ని కథలు

Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి
A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం