కరోనా లో కామెడీ - తాత మోహనకృష్ణ

Karona lo Comedy


శృతి, శివాజీ బాల్కనీ లో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నారు...ఇద్దరికీ పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుంది.
"ఏమండీ! మనం మాస్క్ లు లేకుండా గాలి పీలుస్తూ... రెండు సంవత్సరాలు అవుతుంది కదండీ?"
"అవును శృతి! నిజమే!"

"ఏమిటండీ! ఆ రోజులు తలుచుకుంటే, కొంచం బాధగా...కొంచం ఫన్నీ గా అనిపిస్తుంది.."
"అవును శృతి! నిజమే!...ఇప్పుడెందుకు చెప్పు ఆ బాధ ను మళ్ళీ తలుచుకోవడం..."
"లేదండి! కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి...అంతే!"

"అప్పట్లో గుర్తుందా?..అండీ.."

"కరోనా టైం లో...మన పక్కింటి సుబ్బారావు అన్నయ్యగారు..అసలు ఇంట్లోంచి బయటకు వచ్చే వారే కాదు. అన్నిటికీ ఫోన్ లోనే మాట్లాడేవారు. ఇంట్లో కూడా మాస్క్ వేసుకునేవారు కదండీ.."
"నిజమే! శృతి! అప్పుడు ఒక రోజు నేను బాల్కనీ లో చూసాను..ఆయన ఎప్పుడూ మాస్క్ వేసుకునే ఉన్నారు.."

"ఒకసారి నేను న్యూస్ పేపర్ కోసం వాళ్ళింటికి వెళ్తే..ఇంట్లోకి రానివ్వలేదు..మేము పేపర్ తెప్పించమని చెప్పాడు ఆయన..పేపర్ చేతిలో పట్టుకుని; తప్పక నేను ఆన్లైన్ లో పేపర్ చదువుకున్నాను.."

"అవునండీ! ఆయన భార్యని తలనొప్పి గా ఉంది..డోలో టాబ్లెట్ ఇమ్మంటే...పై నుంచి కిందకు...ఒక చూపు చూసి.. తలుపు వేసేసింది"

"ఇంట్లోంచి ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్లాల్సి వస్తే ..మాస్కులు వేసుకుని...తోడు దొంగల్లాగా ఉండేవారు...ఇప్పటికి నవ్వోస్తుందండి..."
"అవునే! కుక్కలు కుడా వెంట పడ్డాయని..తర్వాత తెలిసింది నాకు"

"ఆన్లైన్ లో డెలివరీ బాయ్ గానీ.. ఇంటికి ఎవరైనా పొరపాటున వచ్చినా.... ఆరు నుంచి పది అడుగులు కొలుచుకుని...దూరం పెట్టేవాడు మనుషులని.."
"అవునండీ! ఫస్ట్ వేవ్ లో ఆరు..సెకండ్ వేవ్ కి పది అడుగులు చేసాడు...డిస్టెన్స్"

"ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన సామాన్లు.. ఒక గంట సేపు...డెటాల్ వాటర్ తో తుడిచి, రెండు రోజులు ఆర పెట్టేవాడు. కూరలు అయితే..ఇంకో మూడు సార్లు స్నానమే వాటికి..ఉప్పు నీటిలో..."
"అవును! డెటాల్, శానిటైజర్ కే ఎక్కువ ఖర్చు చేసేవాడు సుబ్బారావు"

ఎవరైనా ఇంటికి వస్తానని ఫోన్ చేస్తే...ఫోన్ కట్ చేసేవాడు. పెళ్ళిళ్ళకి..ఎవరైనా పిలిస్తే..వీడియో కాల్ లో అక్షింతలు వేసేవాడు..

"అవునండీ! అంత జాగ్రత్త గా ఉన్నారు కనుకనే .. ఆయన ను కరోనా ఏమీ చేయలేకపోయింది..."

ఇంకా...ఎన్నో...మరెన్నో జరిగాయి అప్పట్లో...మనం సరదాగా మాట్లాడుకున్నా..ఇంకా కొన్ని విషయాలు, బాధ కలిగించే సన్నివేశాలు మనసును ఇంకా కదిలిస్తూనే ఉన్నాయి...

********

మరిన్ని కథలు

Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి