మరదలే దేవత - తాత మోహనకృష్ణ

Maradale Devatha


రూప చాలా శ్రద్ధతో చదువుకునే అమ్మాయి అని కాలేజీ లో మంచి పేరు ఉంది. అలాంటి టైం లో.. రవి కాలేజీ లో జాయిన్ అయ్యాడు, తన సీనియర్ గా. మొదటి చూపులోనే వలచానని రూప చుట్టూ తిరిగాడు.

రూప పెద్దగా పట్టించుకోలేదు. రవి ఒక రోజు... రూప ప్రేమ కోసం కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి, రూప ప్రేమించకపోతే దూకేస్తానని అనడంతో..రూప ఫ్రెండ్స్, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా..రూప ను ఒప్పుకోమని బతిమాలారు.

"మా కాలేజీ కు చెడ్డ పేరు వస్తుంది...ఇది మీడియా వరకు వెళ్తే.. ఇంకా చెడ్డ పేరు. నువ్వు ఎదో చేసి, రవి కిందకు వచ్చేటట్టు చెయ్యి అని బతిమాలాడు. ప్రిన్సిపాల్ అంతటి వాడే, ఇలాగ అడిగేసరికి, రూపకు ఏం చెయ్యాలో అర్ధం కాక.. ఒప్పుకుంది. బిల్డింగ్ పైకి వెళ్లి.."ఐ లవ్ యూ రవి" అని చెప్పగానే, రవి కిందకు వచ్చాడు.

అప్పుడు, ఇష్టం లేకుండా చెప్పినా, రవి పైన రోజు రోజు కు ఇష్టం పెరుగుతూ వచ్చింది. రవి ని చూడకపొతే ఉండలేని స్థితికి వచ్చింది రూప. స్కూల్ లో టాపర్ అయిన రూప , ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లో మార్క్స్ బాగా తగ్గిపోయాయి.

ఫైనల్ ఇయర్ తర్వాత సెలవులకు వెళ్ళేటప్పుడు.. రవి రూప ను పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానని....ఇంట్లో చెప్పి సెలవుల తర్వాత వచ్చి పెళ్ళి చేసుకుంటానని అన్నాడు.

రూప చాలా రోజులు..రవి కోసం చూసింది..కానీ రవి రాలేదు. చూసి..చూసి..రవి ను వెతుక్కుంటూ...వాళ్ళ ఊరు వచ్చింది.

"ఇప్పుడు ఏం చేద్దాము రవి?ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు నన్ను?" అని గట్టిగా అడిగింది
"నువ్వు చాలా తెలివైన దానివి రూప..నాకు కొంచం టైం ఇవ్వు..ఏం చెయ్యాలో ఆలోచిస్తాను!"
"నీకోసమే జీవిస్తున్నాను" అంది రూప

ఆ రోజు రాత్రి రవి మనసులో ఎన్నో ఆలోచనలు...
ఒక వేళ రూప కు 'నో' చెబితే.... ఏమైనా చేసుకుంటే, ఆ పాపం, ఆ ప్రాబ్లెమ్ తనకే చుట్టుకుంటుంది...రూప కు నో చెప్పలేడు...పోనీ, రూప పై ప్రేమ లేదా అంటే, చాలా ప్రేమ...తానే ప్రపోజ్ చేసాడు..కాలేజీ అంతా తెలుసు...

ఇంట్లో..తన మావయ్య కూతురు గీత తో పెళ్ళి ఫిక్స్ చేసారు....ఏం చెయ్యాలి ఇప్పుడు?

గీత లాంటి మంచి అమ్మాయి కు అన్యాయం చేయలేడు. పోనీ.. ఇద్దర్ని చేసుకుందామంటే, కుదరదు...

మర్నాడు రవి... రూప ను కలిసి..జరిగిన విషయం చెప్పేసాడు...

కొన్ని రోజుల తర్వాత....

"డాక్టర్! ఎందుకో రమ్మన్నారని నా మరదలు ఫోన్ చేసింది... చెప్పండి..డాక్టర్"
"ఈ విషయం మీ తోనే చెప్పమని గీత చెప్పింది. అందుకే పిలిచాను"
"ఏమిటి డాక్టర్?"

"మీ మరదలు కడుపు నొప్పి తో నా దగ్గరకు వచ్చింది. స్కాన్ చేస్తే, ప్రాబ్లం అని తెలిసింది. ఆపరేట్ చేసి...గర్బ సంచి తీసేసాను. గీత కు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు" ఇది బాధాకరమైన..చెప్పక తప్పదు..వాళ్ళ పేరెంట్స్ కు కుడా ఈ విషయం చెప్పనివ్వలేదు!"

"బాధపడకు గీతా!..మన చేతిలో ఏముంది చెప్పు..నువ్వు నాకుంటే చాలు..పిల్లలు లేకపోయినా పర్వాలేదు లే!"

"అదేంటి బావ!..అలా అంటావు...మీ వంశం నీతో ఆగిపోకూడదు...నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకో!.."

"అదేంటి అలా అంటున్నావు గీతా!"

"నేనే చెబుతున్నప్పుడు నీ కేంటి?..చేసుకో. మా ఇంట్లో నేను ఏదో చెప్పి ఒప్పిస్తాను బావ!"

"నువ్వు అంతగా చెబుతుంటే, ఓకే అనాల్సి వస్తుంది..నీ కోసం"

"ఆ అమ్మాయి ని కూడా నువ్వే చూడు గీతా!"

"ఒక రోజు, రవి గీత ను గుడి కు తీసుకుని వెళ్ళాడు...అక్కడికి రూప ను రమ్మని ముందే చెప్పాడు రవి. రూప చీర కట్టుకుని..లక్షణంగా వచ్చి..ప్రదక్షణాలు చేస్తుంది.."
"ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది.. ఆ అమ్మాయి నచ్చిందా బావ?"

"నీ ఇష్టం గీత"

గీత దగ్గరుండి..రవి..రూప పెళ్ళి జరిపించింది.

**********

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు