"ఏరా నిజం గా కళ్ళు వస్తాయంటావా?" అడిగాడు శంకర్ తన నేస్తం డాక్టర్ కిషోర్ ని. "తప్పకుండా, నీ రెటీనా పొజిషన్ చూస్తే వేరే వాళ్ళ కళ్ళు అమరిస్తే నీకు చూపు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది." శంకర్, కిషోర్ ఒకే స్కూలు లో చదువుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక కిషోర్ నాన్న కి ఉద్యోగం ట్రాన్సఫరవడం తో కిషోర్ వేరే స్టేట్ కి వెళ్ళిపోయాడు. శంకర్ చిన్న హొటల్ నడుపుకుంటూ ఊళ్ళో ఉండి పోయాడు. శంకర్ కి పెళ్ళయిన నాలుగేళ్ళ కి నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చి కంటి చూపు పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ కి కిషోర్ మాటలతో ధైర్యం వచ్చింది. హొటల్ శంకర్ భార్యే నడుపుతోంది
. ******** శంకర్ కి ఆపరేషన్ పూర్తయ్యింది. "నెమ్మది గా కళ్ళు తెరు. ముందు గా ఎవరిని చూడాలనుకుంటున్నావు?" అడిగాడు కిషోర్ "నాకొక అద్దం కావాలి. నన్ను నేను చూసుకుని చాలా కాలమయింది." శంకర్ తనను తాను చూసుకుని, కీషోర్ ని కౌగలించుకుని "ధన్యవాదాలు" చెప్పాడు. "నీ భార్య కి నీకు కళ్ళు వచ్చిన సంగతి తెలుసా?" " తెలియదు, సర్ప్రైజ్ చేద్దామని " " గుడ్, కొన్నాళ్ళు ఈ ఐ డ్రాప్స్ వాడు." అని బాటీల్, మందులున్న కవరు చేతి లో పెట్టాడు
. ********'**** తను చీకటి లో చూసిన ప్రపంచాన్ని ఇప్పుడు వెలుతురు లో చూసి ఆశ్చర్య పోయాడు. కష్ట పడి తన ఇంటికి చేరాడు. ఇల్లు నిశ్శబ్దం గా ఉంది. హాల్లో శంకర్, జయ ల పెళ్ళి ఫోటో ఉంది. అది చూసి ఆనంద పడ్డాడు. బెడ్ రూం నుండి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. బెడ్ రూం తలుపు సగానికి తీసి ఉంది. తన కళ్ళ ను తాను నమ్మలేక పోయాడు. "శంకర్ భార్య జయ నగ్నం గా పరపురుషుడి కౌగిలి లో." .. నాకు కళ్ళు ఎందుకు? ఇలా చూడడానికా.. అంటూ శంకర్ గుడ్డి వాడి గా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. వెనక్కి తిరిగి ఎటో వెళ్ళి పోయాడు. శంకర్ కి తెలియని విషయం ఏమిటంటే శంకర్ చూసిన స్త్రీ జయ కాదు జయ చెల్లెలు లయ! వాళ్ళిద్దరూ కవల పిల్లలు! జయ హొటల్లో ఉండి తన భర్త కి మంచి డాక్టర్ దొరికి చూపు రావాలని ప్రార్ధిస్తోంది!