సుఖమైన శిక్ష. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sukhamaina siksha

అమరావతి రాజ్యంలోని నదీతీరగ్రామం ఉప్పెనకు లోనైనందున తల్లి,తండ్రిని కోల్పోయిన యువకుడు సారంగధరుడు. ఒక్కరాత్రిలోని తనజీవితం అగమ్యగోచరంగా మారడంతో కట్టుబట్టలతో బయలుదేరాడు.

అలాప్రయాణం చేస్తు జాగర్లమూడి అనేగ్రామ సరిహద్దుల్లోని మామిడి తోటవద్దకు చేరాడు. ఆకలిగా ఉండటంతో ఆతోటలోనికి ప్రవేసించి కావలిగా ఎవరైనాఉన్నారేమోనని పరిశీలించాడు.అక్కడ కావలివారు ఎవరూలేక పోవడంతో రెండు దోరమామిడిపండ్లు తిని అక్కడేఉన్న దిగుడుబావిలో మంచినీరు తాగి అలసటగా ఉండటంతో మామిడి చెట్టునీడన తనతలపాగా పరుచుకుని నిద్రపోయాడు.

సాయంత్రం ఎవరో తనను తట్టిలేపడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. "నాయనా నేను ఈమామిడితోట యజమానిని నాపేరు రమణయ్య నాఅనుమతిలేకుండా నాతోటలో ప్రవేసంచడం ఒకతప్పు,నాఅనుమతి లేకుండా రెండుపండ్లు తినడం రెండోతప్పు. నీవు చేసినతప్పులకు శిక్ష అనుభవించవలసిందే 'అన్నాడు తోటయజమాని.

గ్రామ పెద్దల ఎదుట వినయంగా చేతులుకట్టుకు నిలబడ్డాడు సారంగధరుడు. "యువకుడా నీవుఎవరు,ఏఊరుమీది? మామిడి తోటయజమాని నీపైన చేసిన ఆరోపణను అంగీకరిస్తున్నావా? "అన్నాడు గ్రామాధికారి. తనగతాన్నివివరించిన సారంగధరుడు "అయ్య వారి మామాడితోటలో అనుమతిలేకుండా ప్రవేసించి ఆకలిబాధకు రెండు మామిడికాయలు తిన్నమాటయదార్ధమే,ప్రతిఫలంగా వారితోటలోని బావినుండి నీరు కడవలతో తెచ్చిఆతోటలోని ప్రతిమామిడిచెట్ల పాదుల లోపోసాను .వారి అనుమతిలేకుండా మామిడికాయలు తినడం నేరమే అందుకువారు నాకుఎటువంటి శిక్షవేసినాసమ్మతమే" అన్నాడు.

"రమణయ్యగారు ఈయువకుడు బుద్ధిమంతుడు తమతోటలో రెండుమామిడికాయలు తిన్నందుకు తోటలో ఉన్న చెట్లు అన్నింటికి బావిలో నీళ్ళు తోడిపోసాడు ఇతనిలో ఉచితంగా ఏదిపొందాలి అనుకోకపోవడం,శ్రమించేగుణం వంటి మంచిలక్షణాలు ఉన్నాయి ఇతనికితగినశిక్ష తమరేవిధించండి "అన్నాడు గ్రామాధికారి. "యువకుడా కళ్ళుఉండి చూడలేని,చెవులు ఉండివినలేని,నోరుఉండి మాట్లాడలేని, నాఅందవిహీనమైన కుంటిదిఅయిన నాకుమార్తెను చూడకుండానే ఇతను వివాహంచేసుకోవాలి,ఇదే ఇతనికి నేనువిధిస్తున్న శిక్ష "అన్నాడు మామిడితోటయజమాని రమణయ్య.

"అనాధగా ఉన్న నాపై ఇంతటి ఆదరణ,అభిమానం చూపించిన రణయ్యగారికి ధన్యవాదాలు.వారుసూచించిన విధంగాగుడ్డి,చెవిటి, మూగి,కుంటి,అందవిహీనమైన వారికుమార్తెను నేను వివాహం చేసుకోవడానికి పూర్తిసమ్మతమే! అలాగని ఈగ్రమపెద్దలఎదుట ప్రమాణం చేస్తున్నా "అన్నాడు సారంగధరుడు. అతని నిర్ణయానికి అక్కడ ఉన్నవారంతా అభినందించారు.

నడుచుకుంటూవచ్చితన సరసన పెళ్ళిపీటలపై కూర్చున్న అద్బుత సౌందర్యవతి అయిన యువతిని చూసి ఆశ్చర్యపోయాడు సారంగధరుడు. పెళ్ళిచేసే బ్రాహ్మణుడు చెప్పిన మంత్రాలువిని స్పష్టంగావిని తిరిగి చెప్పసాగిందిఆయువతి .బ్రహ్మణుడు చెప్పినది ప్రతిసారి ఆచరిస్తు, చూపించిన ప్రదేశంలో అక్షింతలు వేయసాగింది. ఆమె కుంటి,గుడ్డి,మూగ, చెవిటి యువతికాదని గ్రహించాడు సారంగధరుడు.అతను ఆశ్చర్యానికి లోనుకావడం చూసి చిరునవ్వుచిందించింది ఆయువతి. వివాహఅనంతరం సంశయిస్తున్న సారగధరుని చూసిన రమణయ్య "నాయనా నీబుధ్ధి,కుశలతలు,గుణగణాలు,శ్రమించేమనస్ధత్వం నాకునచ్చాయి. అందుకే అవలక్షణాలు ఉన్ననాకుమార్తెను వివాహం చేసుకోమని నీకుశిక్షవేసాను.అందానికి,అం గవైకల్యాంకలిగిన యువతిని వివాహం చేసుకోవడానికి భయపడకుండా అంగీకరించిన నీమంచితనం నాకు సంతోషం కలిగించింది. అందుకే నాఏకైక కుమార్తెను,నాఆస్ధిని నీకు అప్పగించాలని నీకు ఈసుఖమైన శిక్షవేసాను"అన్నాడు.

సంతోషంగా తనభార్యతో సారంగధరుడు తనమామగారు అయిన రమణయ్య గారికి పాదాభివందనంచేసాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు